సింగరేణిలో 372 ఉద్యోగాలు,
సింగరేణిలోని వివిధ విభాగాల్లో 372 ఉద్యోగాల భర్తీకి కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 372
వీటిలో 305 పోస్టులు లోకల్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన పోస్టులకు రాష్ట్రంలోని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
లోక్‌ల్ జిల్లాలు: ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్
నాన్ లోకల్ జిల్లాలు: పై జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల వారు.
పోస్టులు- అర్హతలు
ఫిట్టర్ ట్రెయినీ-క్యాట్-1
మొత్తం ఖాళీలు: 128 (లోకల్-105, అన్రిజర్వ్డ్-23)
అర్హతలు: పదోతరగతి, ఫిట్టర్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (ఐటీఐ), ఎన్సీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ ఉండాలి.
ఎలక్ట్రీషియన్ ట్రెయినీ
మొత్తం ఖాళీలు: 51 (లోకల్-43, అన్రిజర్వ్డ్-8)
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత, ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ, అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వెల్డర్ ట్రెయినీ
ఖాళీల సంఖ్య - 54 (లోకల్-44, అన్రిజర్వ్డ్-10)
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు వెల్డర్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (ఐటీఐ), వెల్డర్ ట్రేడ్‌లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రెయినింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ ఉండాలి.
టర్నర్/ మెషినిస్ట్ ట్రెయినీ
ఖాళీల సంఖ్య: 22 (లోకల్-18, అన్రిజర్వ్డ్-4)
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు టర్నర్/ మెషినిస్ట్ ట్రేడులో రెండేళ్ల ఇన్స్టిట్యూషనల్ స్టడీ/ ఐటీఐ ట్రెయినింగ్ తర్వాత ఇచ్చే నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. ఆల్ఇండియా ట్రేడ్ టెస్ట్ ఉత్తీర్ణత, ఎన్సీటీ జారీచేసిన ట్రెయినింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ ఉండాలి.
మోటార్ మెకానిక్ ట్రెయినీ (పురుష అభ్యర్థికి మాత్రమే)-క్యాట్-1
ఖాళీల సంఖ్య- 14 (లోకల్-12, అన్రిజర్వ్డ్-2)
అర్హతలు: పదోతరగతి, మోటార్ మెకానిక్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, ఎన్సీటీ జారీ చేసిన అప్రెంటిస్ సర్టిఫికెట్ ఉండాలి.
ఫౌండ్రీ మెన్/ మౌల్డర్ ట్రెయినీ
ఖాళీల సంఖ్య: 19 (లోకల్-16, అన్రిజర్వ్డ్-3)
అర్హత: పదోతరగతి, మౌల్డర్ ట్రేడ్/ ఫౌండ్రీమెన్ ఐటీఐ సర్టిఫికెట్, మౌల్డర్ ట్రేడ్, అప్రెంటిస్ సర్టిఫికెట్ ఉండాలి.
జూనియర్ స్టాఫ్ నర్సులు (మహిళా అభ్యర్థులకు మాత్రమే)-
ఖాళీల సంఖ్య: 84 (లోకల్-67, అన్రిజర్వ్డ్-17)
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు డిప్లొమా/ జీఎన్ఎం సర్టిఫికెట్ కోర్సు/ బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత.
అన్ని పోస్టులకు వయస్సు 18-30 ఏండ్ల మధ్య ఉండాలి. స్టాఫ్ నర్స్ పోస్టు తప్ప మిగిలిన పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా.
రిజర్వేషన్ల వారీగా సంస్థ నిర్ణయించిన కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓసీలకు 30, బీసీలకు 25, ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
-------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ 249 పోస్టులు
కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 249
పోస్టులు- అర్హతలు:
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-6
అర్హత: షుగర్ టెక్నాలజీలో డిగ్రీతో పాటు పీజీ డిప్లొమా/ ఆయిల్ టెక్నాలజీలో లేదా బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. ఏడాది అనుభవం.
వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
అసిస్టెంట్ డైరెక్టర్-1
అర్హత: బీఈ/బీటెక్ (సివిల్) ఉత్తీర్ణత. కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: 35 ఏండ్లు మించరాదు.
స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్- 45 ఖాళీలు
విభాగాల వారీగా: ఫోరెన్సిక్ మెడిసిన్-6, పబ్లిక్ హెల్త్-5, సర్జికల్ ఆంకాలజీ-2, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్/ కమ్యూనిటీ మెడిసిన్-12, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్-7, రేడియో థెరపీ-7, యూరాలజీ-6 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమాతోపాటు కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: 40 ఏళ్లు మించరాదు.
లెక్చరర్-1
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (సోషల్ వర్క్) ఉత్తీర్ణత. కనీసం రేండేండ్ల అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్- 80
అర్హత: లా డిగ్రీ (ఎల్ఎల్బీ) ఉత్తీర్ణత. బార్ అసోసియేషన్‌లో మూడేండ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏండ్ల మించరాదు.
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్- 116
అర్హత: బీఈ/ బీటెక్ (సీఎస్ఈ లేదా ఐటీ) లేదా పీజీలో సీఎస్/ ఐటీ.
వయసు: 30 ఏండ్లు మించరాదు.
ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ ఆయిల్లో 505 అప్రెంటిస్‌లు,
దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ, పంపిణీదారు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) టెక్నికల్ అప్రెంటిస్, నాన్ టెక్నికల్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 505 పోస్టులను భర్తీ చేయనుంది. ఇవన్నీ బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్, అసోంలలో ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 505
ఇందులో టెక్నికల్ అప్రెంటిస్.. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ట్రేడ్ అప్రెంటిస్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్-14, రిటైల్ సేల్స్ అసోసియేట్-6 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ట్రేడ్ అప్రెంటిస్‌కు మెట్రిక్యులేషన్‌తోపాటు ఐటీఐ చేసి ఉండాలి. టెక్నికల్ అప్రెంటిస్‌కు సంబంధిత ట్రేడ్‌లో మూడేండ్ల డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 24 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపికవిధానం: రాతపరీక్ష ద్వారా. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను రాతపరీక్షకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 26
అడ్మిట్ కార్డుల విడుదల: మార్చి 1
రాతపరీక్ష: మార్చి 14
ఫలితాల విడుదల: మార్చి 25
వెబ్సైట్: https://iocl.com
-------------------------------------------------------------------------------------------------------------------
పీఎన్బీలో 100 సెక్యూరిటీ మేనేజర్ ఉద్యోగాలు.
దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో ఖాళీగా ఉన్న మేనేజర్ సెక్యూరిటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పీఎన్బీ కోరింది. వచ్చే నెల 13 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
మొత్తం పోస్టులు: 100
ఇందులో జనరల్ 40, ఈడబ్ల్యూఎస్ 10, ఓబీసీ 27, ఎస్సీ 15, ఎస్టీ అభ్యర్థులకు 8 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. గెజిటెడ్ పోలీస్ లేదా కమిషన్డ్ సర్వీస్‌లో ఐదేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూలో భాగంగా ఎస్సే రైటింగ్ లేదా లెటర్ డ్రాఫ్టింగ్ పరీక్షను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 13
వెబ్సైట్: pnbindia.in