Monday, 26 April 2021

డీఎఫ్‌సీసీఐఎల్‌లో 1074 మేనేజ‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు , యూపీఎస్సీ-363 ప్రిన్సిప‌ల్ ఉద్యోగాలు , బీహెచ్‌ఈఎల్‌లో 268 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు , సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్-2021 ఉద్యోగాలు 159 , టీఎస్‌పీఎస్సీలో 127 ఉద్యోగాలు , ఎన్ఏఎల్‌లో 43 టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, ఆఫీస‌ర్ పోస్టులు .

 డీఎఫ్‌సీసీఐఎల్‌లో 1074 మేనేజ‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

రైల్వే శాఖ ప‌రిధిలోని డెడికేటెడ్ కారిడార్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్‌)లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌, జూనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేల 23 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 1074 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఖాళీలు సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎస్ అండ్ టీ, ఆప‌రేష‌న్స్ అండ్ బీడీ, మెకానిక‌ల్ డిపార్ట్‌మెంట్ల‌లో ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 1074

ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 442, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ 519, జూనియ‌ర్ మేనేజ‌ర్ 111 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అభ్య‌ర్థులు 18 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో. అర్హ‌త క‌లిగిన‌వారిని ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష‌కు పిలుస్తారు.

అప్లికేష‌న్ ఫీజు: ఎగ్జిక్యూటివ్‌కు రూ.900, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.700, జూనియ‌ర్ మేనేజ‌ర్‌కు రూ.1000

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 24

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 23

రాత‌ప‌రీక్ష‌: జూన్ నెల‌లో

వెబ్‌సైట్‌: dfccil.com

--------------------------------------------------------------------------------------------------------------------------

యూపీఎస్సీ-363 ప్రిన్సిప‌ల్ ఉద్యోగాలు


న్యూదిల్లీలోని యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిషన్ (యూపీఎస్సీ) దిల్లీ ఎన్‌సీటీకి చెందిన డైరెక్ట‌రేట్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ విభాగంలో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.


వివ‌రాలు..


* ప్రిన్సిప‌ల్‌


* మొత్తం ఖాళీలు: 363 (పురుషులు-208, స్త్రీలు-155)


వ‌య‌సు: 50 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.


ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 13.05.2021.

--------------------------------------------------------------------------------------------------------------------------

బీహెచ్‌ఈఎల్‌లో 268 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు


నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చేనెల 5 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 268 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు అసోం, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లోని బీహెచ్‌ఈఎల్‌ పరిశ్రమల్లో ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 268

అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్‌ చేసి ఉండాలి. 2021, మే 5 నాటికి 32 ఏండ్లలోపు ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరితేదీ: మే 5

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/


--------------------------------------------------------------------------------------------------------------------------

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్-2021 ఉద్యోగాలు 159


బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎఎస్‌బీ కేంద్ర సాయుధ బలగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సీఏపీఎఫ్‌-2021 ప్రకటన విడుద‌ల చేసింది. 


వివ‌రాలు..


* అసిస్టెంట్ కమాండెంట్


మొత్తం ఖాళీలు: 159


1) బీఎస్ఎఫ్: 78


2) సీఆర్‌పీఎఫ్: 36 


3) సీఐఎస్ఎఫ్: 67


4) ఐటీబీపీ: 20


5) ఎస్ఎస్‌బీ: 01


అర్హత‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ/ త‌త్స‌మాన‌ ఉత్తీర్ణత‌. 2021లో డిగ్రీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. సీఏపీఎఫ్ ప‌రీక్ష 2021కి కావ‌ల్సిన‌ నిర్ధిష్ఠ శారీర‌క‌, ఆరోగ్య ప్ర‌మాణాలు క‌లిగి ఉండాలి. 


వ‌య‌సు: 01.08.2021 నాటికి 20-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 02.08.1996-01.08.2001 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.


ఎంపిక విధానం: రాతప‌రీక్ష, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్/ మెడిక‌ల్ స్టాండ‌ర్డ్స్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ/ ప‌ర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  


ప‌రీక్షా విధానం: దీనిలో రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్‌-1 ప‌రీక్ష ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల వ‌ర‌కు, పేప‌ర్‌-2 ప‌రీక్ష మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల నుంచి 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. పేప‌ర్‌-1లో జ‌న‌ర‌ల్ ఎబిలిటీ, ఇంట‌లిజెన్స్ విభాగాలు ఉంటాయి. దీన్ని 250 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ప్ర‌శ్న‌లు ఆబ్జెక్టివ్ మ‌ల్టిపుల్ ఛాయిస్ ప‌ద్ధ‌తిలో ఉంటాయి. ఇంగ్లిష్‌, హిందీ మాధ్య‌మాల్లో ప్ర‌శ్న‌లు ఉంటాయి. పేప‌ర్‌-2లో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్, ఎస్సే, కాంప్ర‌హెన్ష‌న్ విభాగాలు ఉంటాయి. దీన్ని 200 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ‌


ప‌రీక్ష తేది: 08.08.2021.


తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: హైద‌రాబాద్‌, తిరుప‌తి, విశాఖ‌పట్నం.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 15.04.2021.


ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 05.05.2021

--------------------------------------------------------------------------------------------------------------------------

టీఎస్‌పీఎస్సీలో 127 ఉద్యోగాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 127

పోస్టుల వివరాలు: సీనియర్‌ అసిస్టెంట్‌(పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీ)–15, జూనియర్‌ అసిస్టెంట్‌(పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీ)–10, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌(ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ)–102.


అర్హత: డిగ్రీతో పాటు కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి/బీసీఏ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి/కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టైప్‌ రైటింగ్‌ ఇంగ్లిష్‌(లోయర్‌ గ్రేడ్‌)లో ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్‌ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.


వయసు: 01.07.2021 నాటికి 18–34ఏళ్ల మధ్య ఉండాలి. 02.07.1987 –01.07.2003 మధ్య జన్మించి ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌కి మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.


ఎంపిక విధానం: రాతపరీక్ష(ఆబ్జెక్టివ్‌ టైప్‌) ఆధారంగా ఎంపికచే స్తారు.


పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్‌.


పరీక్షా విధానం: ఈ పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఎబిలిటీస్‌ 150 మార్కులకు, సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(డిప్లొమా స్టాండర్డ్‌) 150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష ఇంగ్లిష్, తెలుగులో నిర్వహిస్తారు. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ పేపర్‌ విభాగం మాత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 12.04.2021

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.05.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://tspsc.gov.in

--------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్ఏఎల్‌లో 43 టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, ఆఫీస‌ర్ పోస్టులు


నేష‌న‌ల్ ఏరోస్పేస్ ల్యాబొరేట‌రీస్ (ఎన్ఏఎల్‌) వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. వ‌చ్చేనెల 21 వ‌ర‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్ల‌డించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 43 పోస్టుల‌ను భ‌ర్తీ చేయనుంది. ఇందులో టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 43

ఇందులో టెక్నిక‌ల్ అసిస్టెంట్‌- 19, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ 1, సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ 6, టెక్నీషియ‌న్ 17, ఫిట్ట‌ర్ 6, మెషినిస్ట్ 3, డ్రాట్స్‌మెన్ 2, ట‌ర్న‌ర్‌, ఎల‌క్ట్రిష‌న్‌, పెయింట‌ర్‌, ఎల‌క్ట్రోప్లాట‌ర్‌, షీట్ మెట‌ల్ వ‌ర్క‌ర్ ఒక్కో పోస్టు చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్, ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రిక‌ల్స్ ఇంజినీరింగ్‌లో 55 శాతం మార్కుల‌తో బీఈ లేదా బీటెక్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం త‌ప్ప‌నిస‌రి. మిగిలిన పోస్టుల‌కు మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్‌ క‌మ్యూనికేష‌న్, కంప్యూట‌ర్ సైన్స్‌, బీసీఏ, ఎల‌క్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంట‌ల్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్ మెట‌ల్ల‌ర్జీలో డిప్లొమా లేదా బీఎస్సీ కంప్యూట‌ర్స్‌లో ఏదోఒక‌టి చేసి ఉండాలి. అదేవిదంగా ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. వ‌య‌స్సు ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉంది.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 21

వెబ్‌సైట్‌: nal.res.in


రైట్స్‌లో 156 అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ , ఇండియ‌న్ రైల్వేలో 146 అప్రెంటిస్‌లు , ఐఐటీ, రూర్కీలో 139 నాన్‌టీచింగ్‌ ఉద్యోగాలు , మెట్రో రైల్వేలో 123 అప్రెంటిస్ పోస్టులు , ఐటీబీపీలో 88 స్పెష‌లిస్ట్‌, జీడీఎంఓ ఉద్యోగాలు , అంబేద్కర్‌ యూనివర్సిటీలో 54 టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులు , ఆర్మీ డెంట‌ల్ 37 కాఫ్స్- ఎస్సెస్సీ ఆఫీస‌ర్లు , సీడాక్‌లో 14 టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు .

రైట్స్‌లో 156 అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌


భార‌తీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన రైల్వే ఇండియా టెక్నిక‌ల్ అండ్ ఎక‌న‌మిక్ స‌ర్వీస్ (రైట్స్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేనెల 12 వ‌రకు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 156 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అప్రెంటిస్ ట్రైనింగ్ ఏడాది కాలం మాత్ర‌మే ఉంటుంది. ప్ర‌స్తుత విద్యాసంవ‌త్స‌రానికిగాను ఈ అప్రెంటిస్ శిక్ష‌ణ కార్యక్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ది.

మొత్తం ఖాళీలు: 156

ఇందులో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 76, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ 20, డిప్లొమా అప్రెంటిస్ 15, ట్రేడ్ అప్రెంటిస్ 35 చొప్పున ఉన్నాయి.

అర్హ‌త‌లు: ఇంజినీరింగ్‌, బీఏ, బీబీఏ, బీకామ్‌, ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: అక‌డ‌మిక్ స్కోర్ ఆధారంగా అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని కోర్సుకోసం ఎంపిక‌చేస్తారు.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 10

వెబ్‌సైట్‌: https://rites.com/

--------------------------------------------------------------------------------------------------------------------------

ఇండియ‌న్ రైల్వేలో 146 అప్రెంటిస్‌లు


రైల్వేశాఖ ప‌రిధిలోని రైల్ ఇండియా టెక్నిక‌ల్ అండ్ ఎక‌న‌మిక్ స‌ర్వీస్ (రైట్స్‌) అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 146 పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది. 2021-22 విద్యా సంవ‌త్స‌రానికి గాను ఈ అప్రెంటిస్ ప్రోగ్రామ్‌ను చేపట్టింది.

మొత్తం పోస్టులు: 146

ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 96, డిప్లొమా అప్రెటిస్ 15, ట్రేడ్ అప్రెంటిస్ 35 చొప్పున ఉన్నాయి.

అర్హ‌త‌: బీఈ, బీటెక్, డిప్లామా, ఐటీఐలో ఏదోఒకటి ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: అక‌డ‌మిక్‌ స్కోర్ ఆధారంగా అర్హులైన అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారిని అప్రెంటిస్‌కు ఎంపిక‌చేస్తారు.

స్ట‌యిఫండ్‌: గ‌్రాడ్యుయేట్‌కు రూ.14 వేలు, డిప్లామాకు రూ.12 వేలు, ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.10 వేల చొప్పున ప్ర‌తి నెల చెల్లిస్తారు.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 17

వెబ్‌సైట్‌: https://rites.com/

--------------------------------------------------------------------------------------------------------------------------

ఐఐటీ, రూర్కీలో 139 నాన్‌టీచింగ్‌ ఉద్యోగాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 139

పోస్టుల వివరాలు: ఫైనాన్స్‌ ఆఫీసర్, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్, హిందీ ఆఫీసర్, అసిస్టెంట్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్, సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్, జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్, అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్, కోచ్, జూనియర్‌ సూపరిం టెండెంట్, ఫార్మసిస్ట్, జూనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్, డ్రైవర్‌.


అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ, సీఏ/ఐసీడబ్ల్యూ/ఎంబీఏ(ఫైనాన్స్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.


ఎంపిక విధానం: జాబ్‌ ఓరియంటెడ్‌ టెస్ట్‌/ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 11.05.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.iitr.ac.in


--------------------------------------------------------------------------------------------------------------------------


మెట్రో రైల్వేలో 123 అప్రెంటిస్ పోస్టులు


కోల్‌క‌తా కేంద్రంగా ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన ఏపీఎస్ మెట్రో రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 123 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో ఫిట్ట‌ర్‌, మెషినిస్ట్‌, వెల్డ‌ర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాత‌ప‌రీక్ష లేకుండా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నుంది. ఈ ఉద్యోగాలు సాధించిన‌వారు ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు జూలై 30 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి.

మొత్తం పోస్టులు: 123

ఇందులో ఫిట్ట‌ర్ 76, ఎల‌క్ట్రిష‌న్ 23, మెషినిస్ట్ 8, వెల్డ‌ర్ 8, ప్లంబ‌ర్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌: వెల్డ‌ర్ పోస్టుల‌కు 8వ త‌ర‌గ‌తి, మిగిలిన పోస్టుల‌కు ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణుల‌వ్వాల్సి ఉంటుంది. అభ్య‌ర్థులు 14 ఏండ్లు పైబ‌డిన‌వారై ఉండాలి.

స్ట‌యిఫండ్‌: శిక్ష‌ణ స‌మ‌యంలో ప్ర‌తి నెల రూ.7,700 నుంచి రూ.10,000లు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా. ఎంపిక‌చేసిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూకి ఆహ్వానిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూలై 30

వెబ్‌సైట్‌: apprenticeshipindia.org

--------------------------------------------------------------------------------------------------------------------------

ఐటీబీపీలో 88 స్పెష‌లిస్ట్‌, జీడీఎంఓ ఉద్యోగాలు


ఇండోటిబెట‌న్ బార్డ‌ర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్‌) ఖాళీగా ఉన్న స్పెష‌లిస్ట్స్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్స్ (జీడీఎంఓఎస్‌) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చే నెల 10 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. మూడేండ్ల కాల‌ప‌రిమితికిగాను ఈ పోస్టుల‌ను భర్తీ చేస్తుంది. ఎలాంటి రాత‌ప‌రీక్ష లేకుండా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తుంది.

మొత్తం పోస్టులు: 88

అర్హ‌త‌లు: ఎంబీబీఎస్ చేసి ఉండాలి. డిగ్రీ పూర్త‌యిన త‌ర్వాత క‌నీసం ఏడాదిన్న‌రపాటు ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి.

ఎంపిక‌విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 10

ఇంట‌ర్వ్యూ: మే 10, 17 తేదీల్లో

వెబ్‌సైట్‌: http://www.itbpolice.nic.in and http://www.itbp.gov.in


--------------------------------------------------------------------------------------------------------------------------


అంబేద్కర్‌ యూనివర్సిటీలో 54 టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులు

దేశ రాజధానిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకిని దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచిచింది. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు వచ్చే నెల 1 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

మొత్తం పోస్టులు: 54

ఇందులో టీచింగ్‌ స్టాఫ్‌ 30, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ 24 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: సంబంధి సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: అర్హతల ఆధారంగా

అప్లికేషన్‌ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: మే 1

వెబ్‌సైట్‌: http://aud.ac.in/careers

--------------------------------------------------------------------------------------------------------------------------

ఆర్మీ డెంట‌ల్ 37 కాఫ్స్- ఎస్సెస్సీ ఆఫీస‌ర్లు

ఇండియ‌న్ ఆర్మీకి చెందిన ఆర్మీ డెంట‌ల్ కాఫ్స్‌లో షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(ఎస్సెస్సీ) ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.


వివ‌రాలు..


* ఆర్మీ డెంటల్ కాఫ్స్‌లో షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఆఫీసర్లు


* మొత్తం ఖాళీలు: 37


అర్హ‌త‌: బీడీఎస్ (చివ‌రి ఏడాది బీడీఎస్‌లో క‌నీసం 55% మార్కులు సాధించాలి)/ ఎండీఎస్ ఉత్తీర్ణ‌త‌, 31.03.2021 నాటికి ఏడాది పాటు రొటేట‌రీ ఇంట‌ర్న్‌షిప్ త‌ప్ప‌క పూర్తి చేసి ఉండాలి.


వ‌య‌సు: 31.12.2021 నాటికి 45 ఏళ్లు మించ‌కూడదు.


ఎంపిక విధానం: నీట్‌(ఎండీఎస్)-2021 ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.


ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 18.05.2021


--------------------------------------------------------------------------------------------------------------------------

సీడాక్‌లో 14 టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు 


ప‌్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్‌)లో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగినవారు ద‌ర‌ఖాస్తుచేసుకోవాల‌ని, ఆన్‌లైన్ అప్లికేష‌న్లు వ‌చ్చేనెల 9 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది.

మొత్తం పోస్టులు: 14

ఇందులో సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ 2, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ 2, మేనేజ‌ర్ 3, అడ్మిన్ ఆఫీస‌ర్ 2, ఫైనాన్స్ ఆఫీస‌ర్‌ 3, ప‌ర్చేజ్ ఆఫీస‌ర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: బీటెక్‌, బీఈ, ఎల్ఎల్‌బీ, ఎంబీఏ, ఎంటెక్‌, ఎంఈ, ఎంసీఏ, పీహెచ్‌డీ చేసి ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, గ్రూప్‌డిస్క‌ష‌న్ ద్వారా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 9

వెబ్‌సైట్‌: https://www.cdac.in/


స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 300 కోచ్‌, అసిస్టెంట్ కోచ్ పోస్టులు , ఏక‌లవ్య మోడ‌ల్ స్కూళ్లలో 262 పోస్టులు , ఎస్‌బీఐలో 144 ఎస్‌వో, ఫార్మ‌సిస్ట్ పోస్టులు , ఎన్‌హెచ్ఐడీసీఎల్‌లో 61 మేనేజ‌ర్ పోస్టులు , ఐజీసీఏఆర్, కల్పకంలో 337 ఉద్యోగాలు, టీఎస్‌ఐసెట్‌-2021 , డీఆర్‌డీఓ-సెప్టంలో 02 జేఆర్ఎఫ్ ఉద్యోగాలు .

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 300 కోచ్‌, అసిస్టెంట్ కోచ్ పోస్టులు


కేంద్ర క్రీడాశాఖ ఆధ్వ‌ర్యంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌) కోచ్‌, అసిస్టెంట్ కోచ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగి అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచిందింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఈనెల 20 ప్రారంభ‌మ‌వుతాయ‌ని, వ‌చ్చే నెల 20 వర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 300 పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. ఎలాంటి రాత‌ప‌రీక్ష లేకుండా కేవ‌లం ఇంట‌ర్వ్యూ ఆధారంగానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తుంది.
మొత్తం పోస్టులు: 300
ఇందులో కోచ్‌లు 100, అసిస్టెంట్ కోచ్‌లు 200 చొప్పున ఉన్నాయి.
అర్హ‌త‌: కోచ్ పోస్టుల కోసం కోచింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి లేదా వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌, ఒలింపిక్స్‌‌లో ఏదోఒక దాంట్లో ప‌థ‌కం గెల‌వాలి లేదా ఒలింపిక్స్‌లో రెండుసార్లు పాల్గొనాలి లేదా ద్రోణాచార్య అవార్డు అందుకొని 45 ఏండ్ల లోపు ఉండాలి.
అసిస్టెంట్ కోచ్‌కోసం కోచింగ్లో డిప్లొమా చేసి ఒలింపిక్స్ లేదా అంత‌ర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనాలి, ద్రోణాచార్య అవార్డుల్లో ఏదోఒక‌టి అందుకొని 40 ఏండ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 20
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 20
వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in/

-------------------------------------------------------------------------------------------------------------------------

ఏక‌లవ్య మోడ‌ల్ స్కూళ్లలో 262 పోస్టులు


రాష్ట్రం‌లోని ఏక‌లవ్య మోడల్‌ స్కూళ్లలో 262 ఖాళీ పోస్టుల భర్తీకి నోటి‌ఫి‌కే‌షన్‌ వెలు‌వ‌డింది. ఇందులో 11 ప్రిన్సి‌పాల్‌, ఆరు వైస్‌ ప్రిన్సి‌పాల్‌, 77 పీజీటీ, 168 టీజీటీ పోస్టు‌లను నింప‌ను‌న్నారు. అర్హు‌లైన అభ్య‌ర్థులు ఈ నెల 30 వరకు ఆన్‌‌లై‌న్‌లో దర‌ఖాస్తు చేసు‌కో‌వా‌లని రాష్ట్ర ఎక‌లవ్య మోడల్‌ రెసి‌డె‌న్షి‌యల్‌ స్కూల్స్‌ సొసైటీ కార్య‌దర్శి డాక్టర్‌ ఆర్‌‌ఎస్‌ ప్రవీ‌ణ్‌‌కు‌మార్ సూచించారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఏక‌లవ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌లో మొత్తం 3479 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.
మొత్తం పోస్టులు: 262
అర్హ‌త‌లు: ప్రిన్సిపాల్ పోస్టులకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. లేదా టీచింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. టీజీటీ, పీజీటీ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30
పరీక్ష తేదీ: జూన్ మొదటి వారం
వెబ్‌‌సై‌ట్‌: http://telanganaemrs.in, https://tribal. nic.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఎస్‌బీఐలో 144 ఎస్‌వో, ఫార్మ‌సిస్ట్ పోస్టులు


దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భార‌తీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న స్పెష‌లిస్ట్ ఆఫీసర్ (ఎస్‌వో), ఫార్మ‌సిస్ట్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్ధులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 144 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేనెల 3 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొంది.
మొత్తం పోస్టులు: 144
ఇందులో మేనేజ‌ర్ 51, డిప్యూటీ మేనేజ‌ర్ 9, సీనియ‌ర్ స్పెష‌ల్ ఎగ్జిక్యూటివ్ 3, సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ 1, డాటా అన‌లిస్ట్ 8, ఫార్మ‌సిస్ట్ 67, ఎగ్జిక్యూటివ్ 1, చొప్పున ఉన్నాయి.
అర్హ‌త‌లు: ఫార్మ‌సిస్ట్ పోస్టుకు ప‌దో త‌ర‌గ‌తి, డీ ఫార్మా లేదా బీఫార్మ‌, ఎం ఫార్మ‌, ఫార్మ డీలో ఏదో ఒక‌టి చేయాలి. మిగిలిన పోస్టుల‌కు ఎంబీఏ, పీజీడీబీఎం, ఎంబీఏ, పీజీ, బీటెక్‌, బీఈ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఏ, సీఏ కోర్సుల్లో ఏదో ఒక‌టి చేసి ఉండాలి.
ఎంపిక ప్ర‌క్రియ‌: ద‌ర‌ఖాస్తుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారిని ఇంట‌ర్యూల‌కు ఆహ్వానిస్తారు. అందులో క‌న‌బ‌ర్చిన ప్ర‌తిభ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ప‌రీక్ష ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.
ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేదీ: మే 3
వెబ్‌సైట్‌: https://bank.sbi/careers or https://www.sbi.co.in/careers

--------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్‌హెచ్ఐడీసీఎల్‌లో 61 మేనేజ‌ర్ పోస్టులు



భార‌త ప్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన‌‌ నేషన‌ల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఐడీసీఎల్‌)లో ఖాళీగా ఉన్న మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 61 పోస్టులను భ‌ర్తీచేయ‌నుంది. అయితే అవ‌స‌రాన్నిబ‌ట్టి పోస్టుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. భార‌త్ మాల ప్రాజెక్టులో భాగంగా ఈశాన్య భార‌త‌దేశంలో, పొరుగు దేశాల‌తో అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దులు పంచుకునే ప్రాంతాల్లో జాతీయ ర‌హ‌దారుల‌ను నిర్మించ‌డంలో భాగంగా ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ది. ఎంపికైన అభ్య‌ర్థులు ల‌ఢ‌క్‌, ఈశాన్య రాష్ట్రాలు, అండ‌మాన్ నికోబార్ దీవులు, జ‌మ్ముక‌శ్మీర్‌లోని ఎన్‌హెచ్ఐడీసీఎల్ ప్రాంతీయ కార్యాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 61
ఇందులో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (పోస్టుల సంఖ్య పేర్కొన‌లేదు), డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ 25, మేనేజ‌ర్ 26, అసిస్టెంట్ మేనేజ‌ర్ 2, జూనియ‌ర్ మేనేజ‌ర్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హ‌త‌లు: స‌ంబంధిత స‌బ్జెక్టులో డిగ్రీ కానీ బీటెక్, బీఈ చేసి ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఏప్రిల్ 31
వెబ్‌సైట్‌: www.nhidcl.com

-------------------------------------------------------------------------------------------------------------------------

ఐజీసీఏఆర్, కల్పకంలో 337 ఉద్యోగాలు


మొత్తం పోస్టుల సంఖ్య: 337 (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌–98, స్టైపెండరీ ట్రెయినీ–239)

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌..
పోస్టులు: సైంటిఫిక్‌ ఆఫీసర్, టెక్నికల్‌ ఆఫీసర్, టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, సెక్యూరిటీ గార్డ్, వర్క్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష/ఇంటర్వూ, స్కిల్‌ టెస్ట్‌ (స్టెనోగ్రఫీ, ఫిజికల్‌ టెస్ట్, డ్రైవింగ్‌), అడ్వాన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

స్టైపెండరీ ట్రెయినీ..
స్టైపెండరీ ట్రెయినీ– కేటగిరీ–1: 68 (కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌)
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

సై్టపెండరీ ట్రెయినీ– కేటగిరీ–2: 171
ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మెన్‌(మెకానికల్‌), ఫిట్టర్‌/రిగ్గర్, ప్లంబర్, వెల్డర్, ల్యాబ్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) ఉత్తీర్ణతతో పాటు సంబం«ధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేయాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 14.05.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.igcar.gov.in

------------------------------------------------------------------------------------------------------------------------

టీఎస్‌ఐసెట్‌-2021


ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌-2021 నోటిఫికేషన్‌ విడుదలైంది.
పరీక్ష పేరు: తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ఐసెట్‌) 2021
ఈసారి ఈ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.
ఎవరు అర్హులు ?
ఎంబీఏ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంసీఏ: డిగ్రీలో మ్యాథ్య్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: జనరల్‌అభ్యర్థులకు 650/-, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు 450/-
చివరితేదీ: జూన్‌ 15
వెబ్‌సైట్‌:https://icet.tsche.ac.in/

-----------------------------------------------------------------------------------------------------------------------

డీఆర్‌డీఓ-సెప్టంలో 02 జేఆర్ఎఫ్ ఉద్యోగాలు 


భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన దిల్లీలోని డీఆర్‌డీఓ-సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్స‌న‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్‌)

* మొత్తం ఖాళీలు: 02

విభాగాలు: కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్ & ఆటోమేష‌న్ ఇంజినీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్ & ఇన్ఫ‌ర్మాటిక్స్ ఇంజినీరింగ్, కంప్యూట‌ర్ సైన్స్ & ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌/  టెక్నాల‌జీ, ఇన్ఫ‌ర్మేష‌న్ సైన్స్ & ఇంజినీరింగ్, కంప్యూట‌ర్ & క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌.

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో మొద‌టి డివిజ‌న్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు నెట్‌/ గేట్ అర్హ‌త (లేదా) ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత టెక్నిక‌ల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

వ‌య‌సు: 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌: recruitment@ceptam.drdo.in

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 07.05.2021.

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్‌ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌) 159 ఉద్యోగాలు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 511 పోస్టులు , నేషన‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో 50 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఈటీటీ) ఉద్యోగాలు, ఎఫ్ఎస్ఎస్ఏఐలో 38 మేనేజ‌ర్ పోస్టులు , తెలంగాణ గురుకుల సైనిక్‌ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టులు , ఇండియ‌న్ నేవీలో సెయిల‌ర్ పోస్టులు , ఇఫ్కోలో ట్రెయినీ(ఫైర్‌మెన్) పోస్టులు .

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్‌ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌) 159 ఉద్యోగాలు


కేంద్ర హోంశాఖ ఆధ్వ‌ర్యంలోని సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్‌ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌) ఖాళీగా ఉద్యోగాల భ‌ర్తీకి యూపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త‌ క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 159 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు ఉన్నాయి. అభ్య‌ర్థుల‌ను రాతప‌రీక్ష‌, ఫిజిక‌ల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌చేయ‌నుంది. ప్రిలిమ్స్ ప‌రీక్ష పూర్తిచేసిన‌వారు ఫిజిక‌ల్ ఎఫిసియెన్సీ టెస్ట్ (పీఈటీ)కి అర్హ‌త‌సాధిస్తారు. అందులో క్వాలిఫై అయిన‌వారిని ఇంట‌ర్వ్యూల‌కు ఆహ్వానిస్తారు. ఈ ప‌రీక్ష‌ను ఏడాదికి ఒక్క‌సారిమాత్ర‌మే నిర్వ‌హిస్తారు.

మొత్తం పోస్టులు: 159

ఇందులో బీఎస్ఎఫ్‌లో 35, సీఆర్‌పీఎఫ్‌లో 36, సీఐఎస్ఎఫ్ 67, ఐటీబీపీలో 20, ఎస్ఎస్‌బీలో 1 చొప్పున ఉన్నాయి.

అర్హ‌త‌: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 20+25 ఏండ్ల లోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. నేపాల్‌, భూటాన్‌కు చెందిన‌వారు కూడా ఈ ప‌రీక్ష రాయ‌డానికి అర్హులు.

ఎంపిక ప్రక్రియ‌: రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 5

రాత‌ప‌రీక్ష‌: ఆగ‌స్టు 8

అడ్మిట్ కార్డులు: జూలై చివ‌రివారంలో

వెబ్‌సైట్‌: upsc.gov.in, upsconline.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 511 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 511

పోస్టుల వివరాలు:

సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–407, ఈ–వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–50, టెర్షరీ హెడ్‌–44, గ్రూప్‌ హెడ్‌–06, ప్రొడక్ట్‌ హెడ్‌(ఇన్వెస్ట్‌మె ంట్‌–రీసెర్చ్‌)–01, హెడ్‌(ఆపరేషన్స్‌ –టెక్నాలజీ)–01, డిజిటల్‌ సేల్స్‌ మేనేజర్‌–01, ఐటీ ఫంక్షనల్‌ అనలిస్ట్‌ మేనేజర్‌–01.


సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌:

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ/నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 01.04.2021 నాటికి 24–35ఏళ్ల మధ్య ఉండాలి.


ఈ–వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌:

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 01.04.2021 నాటికి 23–35ఏళ్ల మధ్య ఉండాలి.


టెర్షరీ హెడ్‌:

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ/నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 01.04.2021 నాటికి 27–40ఏళ్ల మధ్య ఉండాలి.


గ్రూప్‌ హెడ్‌:

అర్హత:ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 01.04.2021 నాటికి 31–45ఏళ్ల మధ్య ఉండాలి.


ప్రొడక్ట్‌ హెడ్‌(ఇన్వెస్ట్‌మెంట్‌–రీసెర్చ్‌):

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 01.04.2021 నాటికి 28–45ఏళ్ల మధ్య ఉండాలి.


హెడ్‌(ఆపరేషన్స్‌–టెక్నాలజీ):

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణుల వ్వాలి. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.


డిజిటల్‌ సేల్స్‌ మేనేజర్‌:

అర్హత:ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 01.04.2021 నాటికి 26–40 ఏళ్ల మధ్య ఉండాలి.


ఐటీ ఫంక్షనల్‌ అనలిస్ట్‌ మేనేజర్‌:

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంజనీరింగ్‌/సైన్స్‌/టెక్నాలజీ వారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 01.04.2021 నాటికి 26–35 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను పర్సనల్‌ ఇంటర్వూ/గ్రూప్‌ డిస్కషన్‌/ఇతర ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.04.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.bankofbaroda.co.in/careers.html


------------------------------------------------------------------------------------------------------------------------

నేషన‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో 50 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఈటీటీ)  ఉద్యోగాలు


మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే


నేషన‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఈటీటీ) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌రఖాస్తులు వ‌చ్చేనెల 6 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 50 పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది. ఇవి మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ విభాగంలో ఉన్నాయి. గేట్‌-2021 స్కోర్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తుంది. అయితే ఈ పోస్టుల‌కు మ‌హిళా అభ్య‌ర్థులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది.

మొత్తం పోస్టులు: 50

ఇందులో ఎల‌క్ట్రిక‌ల్ 22, మెకానిక‌ల్ 14, ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ 14 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌: సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. 27 ఏండ్ల లోపువ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి.

ఎంపిక విధానం: గేట్ 2021 మార్కుల ఆధారంగా

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 16

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 6

వెబ్‌సైట్‌: ntpccareers.net


-------------------------------------------------------------------------------------------------------------------------

ఎఫ్ఎస్ఎస్ఏఐలో 38 మేనేజ‌ర్ పోస్టులు


కేంద్ర ప్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డానికి నోటిఫికేష‌న్ విడుద‌లయ్యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చే నెల 15 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప్రిన్సిప‌ల్ మేనేజ‌ర్‌, జాయింట్ డైరెక్ట‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్‌, డిప్యూటీ డైరెక్ట‌ర్ అండ్ మేనేజ‌ర్ పోస్టులను భ‌ర్తీ చేస్తున్న‌ది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేష‌న్ ఇంకా విడుద‌ల‌వాల్సి ఉన్న‌ది.

మొత్తం పోస్టులు: 38

ఇందులో ప్రిన్సిప‌ల్ మేనేజ‌ర్ 1, జాయింట్ డైరెక్ట‌ర్ 12, సీనియ‌ర్ మేనేజ‌ర్ 2, డిప్యూటీ డైరెక్ట‌ర్ 17, మేనేజ‌ర్ 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు, ఎంపిక విధానం వంటి వివ‌రాల కోసం అభ్య‌ర్థులు డిటెయిల్డ్ నోటిఫికేష‌న్ చూడ‌వ‌చ్చు. పూర్తిస్థాయి నోటిఫికేష‌న్ ఇంకా విడుద‌ల‌కాలేదు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 16

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 15

వెబ్‌సైట్‌: fssai.gov.in


-------------------------------------------------------------------------------------------------------------------

తెలంగాణ గురుకుల సైనిక్‌ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టులు

రుక్మాపూర్‌లోని తెంగాణ సాంఘిక సంక్షేమ బాలుర సంక్షేమ సైనిక విద్యాల‌యం, అశోక్‌న‌గ‌ర్‌లోని గిరిజ‌న గురుకుల సైనిక పాఠ‌శాల‌లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, కౌన్సిల‌ర్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజ‌న సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు అప్ల‌య్ చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేనెల 10 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. అభ్య‌ర్థుల‌ను రాత‌ప‌రీక్ష‌, డెమో, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌చేయ‌నుంది. ఎంపికైన వారిని పూర్తిగా తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ఔట్‌సోర్సింగ్ విధానంలో నియ‌మించ‌నుంది. ఇందు టీజీటీ, పీజీటీ, జేఎల్‌, ఆర్ట్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, కౌన్సిల‌ర్ పోస్టులు ఉన్నాయి.

అర్హ‌త‌: బీఈడీ పూర్తిచేసి టెట్‌లో అర్హ‌త సాధించాలి. సంబంధిత స‌బ్జెక్టులో పీజీ చేసి ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ: రాత‌పరీక్ష, డెమో, ఇంట‌ర్వ్యూ. రాత‌ప‌రీక్ష‌కు 100 మార్కులు, డెమోకు 25, ఇంట‌ర్వ్యూ 25 మార్కుల‌ చొప్పున ఉంటాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేష‌న్ ఫీజు: రూ.500 (డీడీ తీయాలి)

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 10

వెబ్‌సైట్‌: https://tswreis.in/ and https//tgtwgurukulam.telangana.gov.in/

-------------------------------------------------------------------------------------------------------------------------

ఇండియ‌న్ నేవీలో సెయిల‌ర్ పోస్టులు


ఇండియ‌న్ నేవీలో ఖాళీగా ఉన్న సెయిల‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఆస‌క్తి, అర్హ‌‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. సెయిల‌ర్ విభాగంలో సీనియ‌ర్ సెకండ‌రీ రిక్య్రూట్ (ఎస్ఎస్ఆర్‌), ఆర్టిఫిస‌ర్ అప్రెంటిస్ (ఏఏ) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ పోస్టుల‌కు పురుష అభ్య‌ర్థులు మాత్ర‌మే అర్హుల‌ని ప్ర‌క‌టించింది. గ‌తేడాది 2700 పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. ఇప్పుడు కూడా ఇంతే స్థాయిలో పోస్టులు ఉండ‌నున్నాయి. దీనికి సంబ‌ధించిన పూర్తిస్థాయి నోటిఫికేష‌న్ త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నుంది. ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులు ఈనెల 26 నుంచి ప్రారంభంకానున్నాయి. ప‌రీక్ష విధానం వంటి వివ‌రాల‌ను అందులో వెల్ల‌డిస్తారు.

అర్హ‌త‌లు: 60 మార్కుల‌తో ఇంట‌ర్ పాస‌వ్వాలి. నిర్ణీత ప్ర‌మాణాల ప్ర‌కారం శ‌రీరధారుడ్యం క‌లిగి ఉండాలి.

స్ట‌యిఫండ్‌: ట‌్రైనింగ్ స‌మ‌యంలో ప్ర‌తినెల‌ రూ.14,600 ఇస్తారు.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌. రాత‌ప‌రీక్ష 100 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఒక్క మార్కు చొప్పున 100 ప్ర‌శ్న‌లు అడుగుతారు. గంట‌లోపు ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 0.25 మార్కులు కోత‌విధిస్తారు. ప‌రీక్ష హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది.

అప్లికేష‌న్ ఫీజు: రూ.215, ఎస్సీ, ఎస్టీల‌కు ఎలాంటి ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 26

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఏప్రిల్ 30

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in


--------------------------------------------------------------------------------------------------------------------------

ఇఫ్కోలో ట్రెయినీ(ఫైర్‌మెన్) పోస్టులు 


న్యూదిల్లీలోని ఇండియ‌న్ ఫార్మ‌ర్స్ ఫ‌ర్టిలైజ‌ర్ కోఆప‌రేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.


వివ‌రాలు..


* ట్రెయినీ (ఫైర్‌మెన్)


శిక్ష‌ణా వ్య‌వ‌ధి:  బీఎస్సీ (ఫైర్ & సేఫ్టీ) - రెండేళ్లు, ఐటీఐ/ త‌త్స‌మాన కోర్సు వారికి మూడేళ్లు ఉంటుంది.


అర్హ‌త‌: 60% మార్కుల‌తో మూడేళ్ల ఫుల్ టైం రెగ్యుల‌ర్ బీఎస్సీ డిగ్రీ (ఫైర్ & సేఫ్టీ) ఉత్తీర్ణ‌త‌. ఐటీఐ(ఫైర్‌)/ త‌త్స‌మాన కోర్సు చేసి ఉండాలి. నిర్ధేశిత శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.


వ‌య‌సు: 01.04.2021 నాటికి 18-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, బీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.


ఎంపిక విధానం:  


* బీఎస్సీ(ఫైర్ & సేఫ్టీ) అభ్య‌ర్థుల‌కు ఫిజిక‌ల్ ఫిట్‌నెస్, ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.


* ఐటీఐ (ఫైర్‌)/ త‌త్స‌మాన కోర్సు వారికి ఫిజిక‌ల్ ఫిట్‌నెస్, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్‌, ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. మ‌రే ఇత‌ర ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తులు అంగీక‌రించ‌బ‌డ‌వు.


ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.05.2021

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో 1515 సివిలియన్‌ పోస్టులు , భార‌తీయ రైల్వేలో 716 అప్రెంటిస్‌లు , ఎస్‌బీఐలో 149 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు , కోల్ ఇండియాలో 89 మెడిక‌ల్ ఎగ్జిక్యూటివ్‌లు , బార్క్‌లో 31 రీసెర్చ్‌ అసోసియేట్లు , బీహెచ్ఈఎల్‌లో 11 స్పెష‌లిస్టు ఉద్యోగాలు , ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 06 మెడిక‌ల్ ఆఫీస‌ర్లు .

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో 1515 సివిలియన్‌ పోస్టులు

కేవలం పదోతరగతి, ఇంటర్‌, ఐటీఐ ఉత్తీర్ణులై ఉంటే చాలు. దేశసేవ చేసే భాగ్యం, భరోసానిచ్చే కొలువు. భద్రమైన జీవితంతోపాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు, పదోన్నతులకు అవకాశం. వీటన్నింటి సమాహారమే వాయుసేన విడుదల చేసిన గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు. పదిహేను వందల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు…


మొత్తం ఖాళీలు 1515

పోస్టు: గ్రూప్‌ సీ (సివిలియన్‌ పోస్టులు) – గ్రేడ్‌-2 స్టెనో, సూపరింటెండెంట్‌ (స్టోర్‌), కుక్‌, హౌజ్‌కీపింగ్‌, మెస్‌స్టాఫ్‌, హిందీస్టాఫ్‌, ఎల్‌డీసీ, లాండ్రీమ్యాన్‌, సీఎస్‌&ఎస్‌ఎండబ్ల్యూ, ఎల్‌డీసీ, సీఎంటీడీ, కార్పెంటర్‌, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌, ఆయా/వార్డ్‌ సహాయక్‌, హిందీ టైపిస్ట్‌, పెయింటర్‌, వల్కనైజర్‌, హెచ్‌కేఎస్‌, ఫైర్‌మ్యాన్‌, ఎఫ్‌ఎంటీ, టర్నర్‌ (ఎస్‌కే), లెదర్‌ వర్కర్‌ (ఎస్‌కే), టైలర్‌, సీనియర్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌.


ఎవరు అర్హులు?

పోస్టును బట్టి పదోతరగతి, ఇంటర్‌ ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, హిందీ, ఇంగ్లిష్‌ టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.

వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్‌లిస్ట్‌ చేసిన తర్వాత రాతపరీక్ష నిర్వహిస్తారు.

రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష

దీనిలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రశ్నలు పదోతరగతి, ఇంటర్‌, ఐటీఐ స్థాయిలో ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌/హిందీలో ఉంటుంది. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా

స్కిల్‌టెస్ట్‌/ఫిజికల్‌ ప్రాక్టికల్‌ టెస్ట్‌

నిర్వహిస్తారు.


దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో


నోట్‌: అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ప్రకటించిన విధంగా సంబంధిత ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చివరితేదీ:ప్రకటన విడుదలైన 30 రోజుల్లో పంపాలి.


వెబ్‌సైట్‌: https://indianairforce.nic.in

------------------------------------------------------------------------------------------------------------------------

భార‌తీయ రైల్వేలో 716 అప్రెంటిస్‌లు

 రాజ‌స్థాన్‌లోని కోటా కేంద్రంగా ప‌నిచేస్తున్న వెస్ట్ సెంట్ర‌ల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను భార‌తీయ రైల్వే ఆహ్వానిస్తున్న‌ది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఈనెల 30 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. ఎంపికైనవారు కోటా డివిజ‌న్‌లో ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని తెలిపింది.

మొత్తం ఖాళీలు: 716

ఇందులో ఎల‌క్ట్రీషియ‌న్ 135, ఫిట్ట‌ర్ 102, వెల్డ‌ర్ 43, పెయింట‌ర్ 75, మేస‌న్ 61, కార్పెంట‌ర్ 73, ప్లంబ‌ర్ 58, బ్లాక్‌స్మిత్ 63, వైర్‌మ్యాన్ 50, కంప్యూట‌ర్ ప్రోగ్రామింగ్ 10, మెషినిస్ట్ 5, ట‌ర్న‌ర్ 2, ల్యాబ్ అసిస్టెంట్ 2, క్రేన్ అసిస్టెంట్ 2, డ్రాఫ్ట్స్‌మెన్ 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌: త‌ప్ప‌నిస‌రిగా ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణుల‌వ్వాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి, 15 నుంచి 24 ఏండ్ల‌లోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి.

ఎంపిక విధానం: ఐటీఐ, పదో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేష‌న్ ఫీజు: రూ.170, ఎస్టీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఏప్రిల్ 30

వెబ్‌సైట్‌: wcr.indianrailways.gov.in


------------------------------------------------------------------------------------------------------------------------

ఎస్‌బీఐలో 149 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు


దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భార‌తీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న స్పెష‌లిస్ట్ క్యాడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్ధులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 149 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేనెల 3 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొంది.

మొత్తం పోస్టులు: 149

ఇందులో డాటా అన‌లిస్ట్ 8, ఫార్మ‌సిస్ట్ 67, చీఫ్ ఎథిక్స్ ఆఫీస‌ర్ 1, అడ్వైజ‌ర్ 4, డిప్యూటీ మేనేజ‌ర్ 10, మేనేజ‌ర్ 51, ఎగ్జిక్యూటివ్ 1, డిప్యూటీ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ 1, సీనియ‌ర్ స్పెష‌ల్ ఎగ్జిక్యూటివ్ 3, సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ 3 చొప్పున ఉన్నాయి.

అర్హ‌త‌లు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి.

ఎంపిక ప్ర‌క్రియ‌: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్యూ ద్వారా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ప‌రీక్ష ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేదీ: మే 3

వెబ్‌సైట్‌: sbi.co.in


-----------------------------------------------------------------------------------------------------------------------

కోల్ ఇండియాలో 89 మెడిక‌ల్ ఎగ్జిక్యూటివ్‌లు

దేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్ప‌త్తిదారైన కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న మెడిక‌ల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 86 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగినవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఈనెల 30 వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఉద్యోగాల‌కు ఎంపికైన‌వారు స‌బ్సిడ‌రీ కంపెనీలు, బొగ్గు గ‌నులు ఉన్న ప్రాంతాల్లోని ద‌వాఖానాలు, డిస్పెన్స‌రీల్లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఎలాంటి రాత‌ప‌రీక్ష లేదు.

మొత్తం పోస్టులు: 89

ఇందులో సీనియ‌ర్ మెడిక‌ల్ స్పెష‌లిస్ట్ 52, సీనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ 34

అర్హ‌త‌: ఎంబీబీఎస్ చేసి ఉండాలి. సీనియ‌ర్ మెడిక‌ల్ స్పెష‌లిస్ట్ పోస్టుల‌కు 45, మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు 35 ఏండ్ల లోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: ఇంట‌ర్వ్యూ ఆధారంగా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేదీ: ఏప్రిల్ 30

వెబ్‌సైట్‌: coalindia.in

-----------------------------------------------------------------------------------------------------------------------

బార్క్‌లో 31 రీసెర్చ్‌ అసోసియేట్లు

మొత్తం పోస్టుల సంఖ్య: 31
విభాగాలు: ఫిజిక్స్, క్రయోజనిక్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, మెటీరియల్‌ సైన్స్, కెమికల్‌ సైన్స్, మెటలర్జీ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: ఇంటర్వూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ ఎస్టాబ్లిస్‌మెంట్‌ ఆఫీసర్, రిక్రూట్‌మెంట్‌–5, సెంట్రల్‌ కాంప్లెక్స్, బార్క్, ట్రాంబే, ముంబై–400085 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 10.05.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.barc.gov.in.


---------------------------------------------------------------------------------------------------------------------


బీహెచ్ఈఎల్‌లో  11 స్పెష‌లిస్టు ఉద్యోగాలు

రామ‌చంద్రాపురంలోని భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్‌)లో ఖాళీగా ఉన్న పార్ట్ టైమ్ మెడిక‌ల్ క‌న్స‌ల్టెంట్స్ (పీటీఎంసీ) స్పెష‌లిస్ట్ లేదా ఎంబీబీఎస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి క‌లిగిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేనెల 4 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. ఎంపికైన‌ అభ్య‌ర్థుల‌ను కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న నియ‌మించ‌నుంది. ఎలాంటి రాత‌ప‌రీక్ష లేకుండా ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేయ‌నుంది.

మొత్తం పోస్టులు: 11

ఇందులో పీటీఎంసీ స్పెష‌లిస్ట్ 5 (జ‌న‌రల్ స‌ర్జ‌రీ 2, ఫిజీషియ‌న్ 2, పీడియాట్రిక్స్ 1), ఎంబీబీఎస్ 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: స్పెష‌లిస్ట్ పోస్టుల‌కు సంబంధిత విభాగంలో ఎమ్మెస్ లేదా డీఎన్‌బీ చేసి ఉండాలి. మిగిలిన పోస్టుల‌కు ఎంబీబీఎస్ పూర్తిచేయాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: ఇంట‌ర్వ్యూ ద్వారా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. సాఫ్ట్ కాపీని ప్రింట్ తీసి అవ‌స‌ర‌మైన సర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.

అడ్ర‌స్‌: R.MANAGER/HR-RMX, HRM Dept., Ground Floor, Administrative Building, BHEL, RC Puram, Hyderabad, 502032.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 15

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ‌మే 4

వెబ్‌సైట్‌: careers.bhel.in


-------------------------------------------------------------------------------------------------------------

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 06 మెడిక‌ల్ ఆఫీస‌ర్లు 


భార‌త ప్ర‌భుత్వ‌రంగానికి చెందిన అసోంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* సూప‌రింటెండింగ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌

మొత్తం ఖాళీలు: 06

విభాగాలు: పాథాల‌జీ, ఆప్త‌ల్మాల‌జీ, ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్‌, ఫిజీషియ‌న్‌, స‌ర్జ‌రీ.

అర్హ‌త‌: సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో మెడిక‌ల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్) ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.04.2021.

Friday, 9 April 2021

ఇండియన్‌ ఎకనమిక్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌–2021 ఉద్యోగాలు 26, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 18 ఉద్యోగాలు, ప్ర‌సార భార‌తిలో 15 ఉద్యోగాలు, ఇన్‌కంటాక్స్‌-స్పోర్ట్స్ కోటాలో 14 ఉద్యోగాలు.

ఇండియన్‌ ఎకనమిక్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌–2021 ఉద్యోగాలు 26

మొత్తం ఖాళీల సంఖ్య: 26
ఖాళీల వివరాలు: ఇండియన్‌ ఎకనమిక్‌ సర్వీస్‌–15, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌–11.
అర్హత: ఎకనమిక్స్‌/అప్లైడ్‌ ఎకనమిక్స్‌/బిజినెస్‌ ఎకనమిక్స్‌/ఎకనామెట్రిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
వయసు: 01.08.2021 నాటికి 21–30ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1991–01.08.2000 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష, వైవా–వాయిస్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందులో రాతపరీక్ష 1000 మార్కులకు, వైవా–వాయిస్‌ 200 మార్కులకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.200 చెల్లించాలి. మహిళా/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 07.04.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.04.2021

పరీక్ష తేది: 16.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsconline.nic.in

-----------------------------------------------------------------------------------------------------------------------

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 18 ఉద్యోగాలు


మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: పీడియాట్రిషయన్‌–11, స్టాఫ్‌ నర్సులు–06, డేటా ఎంట్రీ ఆపరేటర్‌–01.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌(హాస్పిటల్‌ సర్వీసెస్‌ –ఇన్‌స్పెక్షన్స్‌), కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్, ఖైరతాబాద్, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.04.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://vvp.telangana.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------

ప్ర‌సార భార‌తిలో 15  ఉద్యోగాలు

ఇండియా పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ అయిన న్యూదిల్లీలోని ప్ర‌సార భార‌తి ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 15

1) అసైన్‌మెంట్ కోఆర్డినేట‌ర్‌: 04

అర్హ‌త‌: మాస్ క‌మ్యూనికేష‌న్‌/ జ‌ర్న‌లిజంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. ఇంగ్లిష్ భాష‌లో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి. సంబంధిత ప‌నిలో క‌నీసం ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

2) బ్రాడ్‌కాస్ట్ ఎగ్జిక్యూటివ్: 05

అర్హ‌త‌: రేడియో/ టీవీ ప్రొడ‌క్ష‌న్ విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ/ ప్రొఫెష‌న‌ల్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. ఇంగ్లిష్ భాష‌లో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి. సంబంధిత ప‌నిలో క‌నీసం మూడేళ్ల‌ అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

3) కాపీ రైట‌ర్‌: 04

అర్హ‌త‌: మాస్ క‌మ్యూనికేష‌న్‌/ జ‌ర్న‌లిజంలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. ఇంగ్లిష్ భాష‌లో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి. సంబంధిత ప‌నిలో క‌నీసం ఏడాది అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

4) గెస్ట్ కోఆర్డినేట‌ర్‌: 02

అర్హ‌త‌: గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు జ‌ర్న‌లిజం/ ప‌బ్లిక్ రిలేష‌న్స్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. ఇంగ్లిష్ భాష‌లో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి. సంబంధిత ప‌నిలో క‌నీసం మూడేళ్ల‌ అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: ఈ ప్ర‌క్రియ‌ వివిధ ద‌శ‌ల్లో జ‌రుగుతోంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్య‌ర్థుల‌ను తదుప‌రి ఎంపిక ప్ర‌క్రియ‌కు పిలుస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.04.2021.

చిరునామా: Deputy Director (HR), Room No. 413, 4h Floor, Doordarshan Bhawan, Tower-B. Copernicus Marg. New Delhi - 110001
-----------------------------------------------------------------------------------------------------------------------

ఇన్‌కంటాక్స్‌-స్పోర్ట్స్ కోటాలో  14 ఉద్యోగాలు

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన న్యూదిల్లీలోని ఇన్‌కంటాక్స్ ప్రిన్సిప‌ల్ చీఫ్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం స్పోర్ట్స్ కోటా ద్వారా కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 14

క్రీడాంశాలు: అథ్లెటిక్స్‌, క‌బ‌డ్డీ, ఫుట్‌బాల్‌, హాకీ, గోల్ఫ్‌, బాడీ బిల్డ‌ర్‌, క్రికెట్‌.

పోస్టులు-ఖాళీలు: 

1) ఇన్‌కంటాక్స్ ఇన్‌స్పెక్ట‌ర్‌: 01

అర్హ‌త‌: డిగ్రీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌. 

2) టాక్స్ అసిస్టెంట్లు: 04

అర్హ‌త‌: డిగ్రీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌తో పాటు డేటా ఎంట్రీ స్పీడ్ ఉండాలి.

3) స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్‌-2: 03

అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌తో పాటు డిక్టేష‌న్‌, ట్రాన్స్‌స్క్రిక్ష‌న్ వ‌చ్చి ఉండాలి.

4) మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ట్‌: 06

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి/ త‌త్సమాన ఉత్తీర్ణ‌త‌.

* పైన సూచించిన క్రీడ‌ల్లో రాష్ట్రం లేదా దేశం లేదా జాతీయ లేదా అంత‌ర్జాతీయ స్థాయిలో పాల్గొని ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ, గ్రౌండ్‌/ ప్రొఫిషియ‌న్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.04.2021.

చిరునామా: డిప్యూటీ క‌మిష‌న‌ర ఇన్‌కంటాక్స్‌, సీఆర్ బిల్డింగ్‌, ఐపీ ఎస్టేట్‌, న్యూదిల్లీ-110002


బీఈసీఐఎల్‌లో 1679 ఉద్యోగాలు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 511 మేనేజర్‌ ఉద్యోగాలు, ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌–2021 ఉద్యోగాలు 215.

 బీఈసీఐఎల్‌లో 1679 ఉద్యోగాలు


ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 20 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1679 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బీఈసీఐఎల్ ట్రైనింగ్ కోర్సును నిర్వహిస్తుంది. దీనిని విజయవంతంగా పూర్తిచేసి.. ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో 50 శాతం మార్కులు సాధించిన వారిని వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు ప్రాతిప్రదికన నియమిస్తుంది.
మొత్తం పోస్టులు: 1679
ఇందులో ఎలక్ట్రిషన్‌, లైన్‌మెన్‌, ఎస్‌ఎస్‌ఓ, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ వంటి పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: స్కిల్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి. అన్‌స్కిల్డ్‌ పోస్టులకు ఎనిమిదో తరగతి పాసై, సెమీ స్కిల్డ్‌ పోస్టులకు ఇంటర్‌ పాసై, ఇంగ్లిష్, హిందీలో టైపింగ్ చేయగలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్‌ ఫీజు: రూ. 590, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.295
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 20
వెబ్‌సైట్‌: www.beciljobs.com

-----------------------------------------------------------------------------------------------------------------------

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 511 మేనేజర్‌ ఉద్యోగాలు

దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 511 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
మొత్తం పోస్టులు: 511
ఇందులో సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్స్‌ 407, ఈ-రిలేషన్‌షిప్‌ మేనేజర్లు 50, టెర్రిటరీ అధిపతులు 44, గ్రూప్‌ హెడ్స్‌ 6, ప్రాడక్ట్‌ హెడ్స్‌ (ఇన్వెస్ట్‌మెంట్‌, రిసెర్చ్‌) 1, ఆరేషన్స్‌ అండ్‌ టెక్నాలజీ హెడ్‌ 1, డిజిటల్‌ సేల్స్‌ మేనేజర్‌ 1, ఐటీ ఫంక్షనల్‌ అనలిస్ట్ మేనేజర్‌ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అయితే సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 23 నుంచి 45 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ లేదా గ్రూప్‌డిస్కషన్‌. దరఖాస్తుల ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్‌ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్‌ 9
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 29
వెబ్‌సైట్‌: www.bankofbaroda.co.in/Careers.htm

-----------------------------------------------------------------------------------------------------------------------

ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌–2021 ఉద్యోగాలు 215

మొత్తం పోస్టుల సంఖ్య: 215
విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
వయసు: 01.01.2021 నాటికి 21–30 ఏళ్ల మధ్య ఉండాలి. 02.01.1991–01.01.2000 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌–ప్రిలిమ్స్, ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌–మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.200 చెల్లించాలి. మహిళా/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 07.04.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.04.2021

ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష తేది: 18.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in

Monday, 5 April 2021

డీఎంహెచ్‌వో-సంగారెడ్డిలో సీహెచ్ఓ పోస్టులు , పశ్చిమ మధ్య రైల్వేలో 716 అప్రెంటిస్‌ ఖాళీలు


డీఎంహెచ్‌వో-సంగారెడ్డిలో సీహెచ్ఓ పోస్టులు  


సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్, మెజిస్ట్రేట్ కార్యాల‌యం, జిల్లా వైద్య‌, ఆరోగ్య కార్యాల‌యం(డీఎంహెచ్‌వో) ద్వారా కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.


వివ‌రాలు..


* క‌మ్యునిటీ హెల్త్ ఆఫీస‌ర్లు/ మిడిల్ లెవ‌ల్ హెల్త్ ప్రొవైడ్ల‌ర్లు.


* మొత్తం ఖాళీలు: 18


అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌/ బీహెచ్ఎంఎస్‌/ బీయూఎంఎస్‌, బీఎస్సీ న‌ర్సింగ్ ఉత్తీర్ణ‌త‌. టీఎస్ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 


* మొత్తం 100 మార్కుల‌కు ఎంపిక ప్ర‌క్రియ‌ ఉంటుంది.


* అక‌డ‌మిక్ మార్కుల‌కు 90 శాతం కేటాయిస్తారు.


* మ‌రో 10 శాతం వ‌య‌సు, అనుభ‌వం ఆధారంగా కేటాయిస్తారు.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.


చిరునామా: డీఎంహెచ్ఓ, సంగారెడ్డి, తెలంగాణ‌.


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 19.04.2021.

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

 పశ్చిమ మధ్య రైల్వేలో 716 అప్రెంటిస్‌ ఖాళీలు


మొత్తం ఖాళీల సంఖ్య: 716

విభాగాలు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ప్లంబర్, వైర్‌మెన్, ల్యాబ్‌ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత: పదోతరగతి, అప్రెంటిస్‌ విభాగాన్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100/–


దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://mponline.gov.in/portal/Services/RailwayRecruitment/frmhome.aspx

Saturday, 3 April 2021

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో 1515 సివిలియ‌న్ పోస్టులు, మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌–2021 నోటిఫికేషన్‌ 502 ఉద్యోగాలు, ఎన్ఎండీసీలో 211 పోస్టులు .

  Till now, there is no official conformation regarding Latest TS Police recruitment notifications 2021. We update here, once any notification out. 

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో 1515 సివిలియ‌న్ పోస్టులు,

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న వివిధ డివిజ‌న్‌ల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.


వివ‌రాలు...


* గ్రూప్‌, సీ సివిలియ‌న్ పోస్టులు


* మొత్తం ఖాళీలు: 1515


పోస్టులు: సీనియ‌ర్ కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌, ఎల్‌డీసీ, కార్పెంట‌ర్‌, పెయింట‌ర్‌, మెస్ స్టాఫ్‌, ఎంటీఎస్‌, స్టోర్ కీప‌ర్‌, హిందీ టైపిస్ట్‌, కుక్‌, ఆయా, టెయిల‌ర్‌, ట‌ర్న‌ర్‌, ఫైర్‌మెన్‌, ఫైర్ ఇంజిన్ డ్రైవ‌ర్ త‌దిత‌రాలు.


అర్హ‌త‌:  పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో 10వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. డ్రైవింగ్ లైనెన్స్‌, ఇండ‌స్ట్రియ‌ల్ ట్రెయినింగ్ స‌ర్టిఫికెట్‌, హిందీ, ఇంగ్లిష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. 


వ‌య‌సు: 18 నుంచి 25 ఏళ్లు మించ‌కూడ‌దు.


వ‌య‌సు స‌డ‌లింపు: ఓబీసీ అభ్య‌ర్థుల‌కు 03 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థుల‌కు 05 ఏళ్లు వ‌య‌సులో స‌డలింపు ఉంటుంది.


ఎంపిక విధానం: అభ్య‌ర్థుల‌కు షార్ట్‌లిస్ట్ చేసిన అనంత‌రం రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


* రాత‌ప‌రీక్ష‌లో మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్ర‌శ్న‌లు ఇస్తారు.


1. జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజ‌నింగ్‌


2. న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ


3. జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌


4. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌


ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ఉంది.


* అభ్య‌ర్థులు ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లో తెలిపిన విధంగా సంబంధిత ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్‌లో అందేలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: ఉద్యోగ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన 30 రోజుల్లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌–2021 నోటిఫికేషన్‌ 502  ఉద్యోగాలు,


వివరాలు:

పోస్టుల సంఖ్య: 502

ఎంఈఎస్‌–2021 నోటిఫికేషన్‌ ద్వారా మిలిటరీ ఇంజనీర్‌ సర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 502 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 450 సూపర్‌వైజర్‌ పోస్టులు, 52 డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులు ఉన్నాయి.


విద్యార్హతలు:

డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్‌ అసిస్టెంట్స్‌షిప్‌లో డిప్లొమా ఉండాలి. దీంతో పాటు ఆటోక్యాడ్, ఆపరేషన్ ఆఫ్‌ జిరాక్స్, ప్రింటింగ్‌ అండ్‌ లామినేషన్ మెషీన్ పై ఏడాది కాలం అనుభవం అవసరం.

సూపర్‌వైజర్‌ పోస్టులకు ఎకనామిక్స్‌/కామర్స్‌/స్టాటిస్టిక్స్‌/బిజినెస్‌ స్టడీస్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్‌ డిగ్రీ తప్పనిసరి. దీంతోపాటు స్టోర్స్‌ అండ్‌ అకౌంట్స్‌ మెయింటెనెన్స్ లో ఏడాది అనుభవం తప్పనిసరి.లేదా ఎకనామిక్స్‌/కామర్స్‌/ స్టాటిస్టిక్స్‌/బిజినెస్‌ స్టడీస్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ తోపాటు మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌/వేర్‌ హౌసింగ్‌ మేనేజ్‌మెంట్‌/ పర్చేజ్‌/లాజిస్టిక్స్‌/ పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌లో డిప్లొమా, స్టోర్స్‌ అకౌంట్స్‌ మెయింటెనెన్స్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి.

రెండు విభాగాల పోస్టులకు అభ్యర్థుల వయసు దరఖాస్తు చేసుకునే నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారు.


వేతనం: సూపర్‌వైజర్, డ్రాఫ్ట్స్‌మెన్ గా ఎంపికైనవారు పే లెవెల్‌–6 ప్రకారం నెలకు రూ.35,400 – 1,12,400 వరకూ వేతనం అందుతుంది.


ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి


దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 12, 2021.


రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100 (ఎస్సీ/ఎస్టీ/ వికలాంగులకు ఫీజు లేదు)

రాత పరీక్ష తేది: మే 16, 2021.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విశాఖపట్నం


పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.mesgovonline.com/mesdmsk

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్ఎండీసీలో 211 పోస్టులు .


భార‌త ప్ర‌భుత్వ ఉక్కు మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎన్ఎండీసీ) వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.


వివ‌రాలు..


* మొత్తం ఖాళీలు: 211


1) ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 97


విభాగాలు: ఎన‌ర్జీ మేనేజ్‌మెంట్, సేప్టీ, మెటీరియ‌ల్స్ మేనేజ్‌మెంట్, కాంట్రాక్ట్స్ మేనేజ్‌మెంట్‌, సెంట్ర‌లైజ్డ్ మెయింటెనెన్స్ మెకానిక‌ల్‌, కంప్రెస్డ్ ఎయిర్ స్టేష‌న్, క్రేన్ ఇంజినీరింగ్.


అర్హ‌త‌: ఏదైనా బ్రాంచుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.


2) సూప‌ర్‌వైజ‌రీ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 114


విభాగాలు: ఎన‌ర్జీ మేనేజ్‌మెంట్, హాట్ స్ట్రిప్ మిల్‌, సెంట్ర‌ల్‌ మెయింటెనెన్స్ మెకానిక‌ల్‌, కంప్రెస్డ్ ఎయిర్ స్టేష‌న్, క్రేన్ ఇంజినీరింగ్.


అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడుల్లో/ స‌బ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.


ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూ, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు రాత ప‌రీక్ష‌, సూప‌ర్‌వైజ‌రీ స్కిల్ టెస్ట్‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 31.03.2021.


ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.04.2021.