ఎన్ఎండీసీలో 59 అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) లిమిటెడ్ అప్రెంటిస్‌ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్ల ఐరన్ ఓర్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 59
ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 16, టెక్నీషియన్ అప్రెంటిస్ 13, పాసా 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మైనింగ్ ఇంజినీరింగ్‌లో ఏదో ఒకటి చేసి ఉండాలి.
ట్రేడ్ అప్రెంటిస్‌కు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్, మైనింగ్, మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్లో ఏదో ఒకటి, పాసా పోస్టులకు కోపాలో వొకేషనల్ ట్రైనింగ్ తీసుకుని ఉండాలి.
ట్రేడ్ అప్రెంటిస్ అభ్యర్థులు www.apprenticeshipindia.orgలో, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అభ్యర్థులు www.mhrdnats.gov.inలో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో (ఈ-మెయిల్)
ఈ-మెయిల్: bld5hrd@nmdc.co.in
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15
వెబ్సైట్: https://www.nmdc.co.in/
-----------------------------------------------------------------------------------------------------------------------------
యూసీఐఎల్‌లో 51 మైనింగ్ మేట్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వరంగానికి చెందిన ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మైనింగ్ మేట్లు
* మొత్తం ఖాళీలు: 51
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు డీజీఎంఎస్ జారీ చేసిన మెటాలిఫెరస్ మైన్స్ మైనింగ్ మేట్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. హిందీ/ స్థానిక భాష రాయడం, చదవడంలో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు: 30.04.2021 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.34,785 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 20 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: General Manager(I/P&IRs/CP), UCIL, Jaduguda Mines, East Singhbhum, Jharkhand - 832102
-----------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్డీఓ డిఫెన్స్ ల్యాబ్‌లో 47 అప్రెంటిస్‌షిప్
రక్షణ శాఖ పరిధిలోని డీఆర్డీఓలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 5 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైనవారు జోధ్‌పూర్‌లోని డిఫెన్స్ ల్యాబొరేటరీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 47
ఇందులో ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 2, డీజిల్ మెకానిక్ 2, కార్పెంటర్ 2, ఐసీటీఎస్ఎం 2, కోపా 20, స్టెనోగ్రాఫర్-సెక్రటేరియల్ అసిస్టెంట్ (హిందీ, ఇంగ్లిష్) 10, కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్క్ మెయింటేనెన్స్ 3, ప్లంబర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రిషన్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 2018-2020 మధ్య పాసైనవారు మాత్రే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంతకు ముందు పాసైనవారు అప్లయ్ చేయకూడదు.
ట్రైనింగ్: ఏడాది
స్టయిఫండ్: ప్రతినెల రూ.7000
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్ ఆధారంగా
అప్లికేషన్ విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 5
వెబ్సైట్: https://apprenticeshipindia/org/course-search
-----------------------------------------------------------------------------------------------------------------------------
పవర్ గ్రిడ్‌లో 35 డిప్లొమా ట్రెయినీలు
మహారత్న కంపెనీ అయిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి నార్తర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 డిప్లొమా ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
మొత్తం పోస్టులు: 35
ఇందులో డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్) 30, డిప్లొమా ట్రెయినీ (సివిల్) 5 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: కనీసం 75 శాతం మార్కులతో మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా లేకుండా బీఈ/బీటెక్/ఎంటెక్ చేసినవారిని పరిగణనలోకి తీసుకోరు. 2021, జూన్ 15 నాటికి 27 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
స్టయిఫండ్: రూ. 27,500 (శిక్షణా కాలం పూర్తయిన తర్వాత జూనియర్ ఇంజినీర్ స్థాయిలో రూ. 25,000-1,17,500 పే స్కేల్ ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా
పరీక్ష విధానం: పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 170 మార్కులకు ఉంటుంది. దీన్ని రెండు భాగాలుగా విభజిస్తారు పార్ట్ 1 లో 120 ప్రశ్నలు టెక్నికల్ నాలెడ్జ్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పార్ట్ 2 లో 50 ప్రశ్నలు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కులను కోత విధిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15
అప్లికేషన్ ఫీజు: రూ. 300
వెబ్సైట్: www.powergridindia.in
No comments:
Post a Comment