ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో 127 ఫ్యాకల్టీ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 127
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్–30, అడిషనల్ ప్రొఫెసర్–22, అసోసియేట్ ప్రొఫెసర్–29, అసిస్టెంట్ ప్రొఫెసర్–46.
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్) ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/పరిశోధనలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ఇంటర్వూ వేదిక: ఎయిమ్స్, గోరఖ్‌పూర్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 08.06.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://aiimsgorakhpur.edu.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
సెయిల్ దుర్గాపూర్‌లో 83 నర్సు ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 83
అర్హత: బీఎస్సీ(నర్సింగ్)/డిప్లొమా(జీఎన్ఎం) ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
కాల వ్యవధి: 18 నెలలు
స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.05.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://sail.co.in
-------------------------------------------------------------------------------------------------------------
వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో 62 క్లర్క్ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు
ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 25 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 62 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్ ఇంజినీర్, హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 62
ఇందులో జూనియర్ ఇంజినీర్ 16, హిందీ ట్రాన్స్‌లేటర్ 1, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 5, అప్పర్ డివిజన్ క్లర్క్ 12, స్టెనోగ్రాఫర్ 5, లోవర్ డివిజన్ క్లర్క్ 23 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసి ఉండాలి. అభ్యర్థులు 10 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా, కంప్యూటర్ స్కిల్ టెస్ట్
అప్లికేషన్ ఫీజు: రూ.800, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500
దరఖాస్తులు ప్రారంభం: మే 10
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 25
వెబ్సైట్: nwda.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్జీఆర్ఐలో 54 ప్రాజెక్ట్ అసిస్టెంట్ అసోసియేట్ పోస్టులు.
సీఎస్ఐఆర్- నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 24 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 54 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా విద్యార్హత ఆధారంగా ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 54
ఇందులో సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 2, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 3, ప్రాజెక్ట్ అసోసియేట్ 42, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 5, జేఆర్ఎఫ్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీకాం, బీఎస్సీ, బీఈ లేదా బీటెక్, పీజీ, ఎంటెక్, పీహెచ్డీ, నెట్ లేదా గేట్ అర్హత సాధించాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్యూ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: మే 10
దరఖాస్తులకు చివరితేదీ: మే 24
వెబ్సైట్: www.ngri.org.in
No comments:
Post a Comment