బీఈఎల్‌లో 30 ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలు
ప్రభుత్వరంగంలోని నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 21 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్నారు.
మొత్తం పోస్టులు: 30
ఇందులో జనరల్ 12, ఓబీసీ 8, ఎస్సీ 4, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ 3 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హత: ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా టెలీకమ్యూనికేషన్‌లో నాలుగేండ్ల బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. 2021, ఏప్రిల్ 1 నాటికి 25 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: మే 12
దరఖాస్తులకు చివరితేదీ: మే 21
వెబ్సైట్: https://register.cbtexams.in/BEL/SBU/
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్ రాయ్‌పూర్‌లో 25 జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 25
అర్హత: ఎంబీబీఎస్(ఇంటర్న్‌షిప్ పూర్తిచేసుకొని)/తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ఇంటర్వూ తేదీ: 18.05.2021
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: residents@aiimsraipur.edu.in
దరఖాస్తులకు చివరి తేది: 15.05.2021
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్ఐడీ హర్యానాలో 23 నాన్ టీచింగ్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: సీనియర్ సూపరింటెండెంట్–01, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్–02, సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్–01, సూపరింటెండెంట్–02, డిజైన్ ఇన్స్ట్రక్టర్–02, టెక్నికల్ ఇన్స్ట్రక్టర్–02, సీనియర్ అసిస్టెంట్–04, సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్–01, సూపర్వైజర్–01, టెక్నికల్ అసిస్టెంట్–02, అసిస్టెంట్–05.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాతపరీక్ష/ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, హర్యానా, ట్రాన్సిట్ క్యాంప్ ఎట్ పాలిటెక్నిక్ బిల్డింగ్ విలేజ్–ఉమ్రి, డిస్ట్రిక్–కురుక్షేత్ర–136131 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 19.07.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.nidh.ac.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఐఎంఎంటీ లో 14 సెక్రటేరియట్ అసిస్టెంట్,స్టెనో ఉద్యోగాలు
సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (ఐఎంఎంటీ)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హతక లిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 21 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 14 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో జూనియర్ సెక్రటేరియట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిప్లొమా చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులు ఒడిశాలోని భువనేశ్వర్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 14
ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 9, సెక్రటేరియట్ అసిస్టెంట్ 3, జూనియర్ స్టెనోగ్రాఫర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి, ఇంటర్, డిప్లొమా చేసి, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఉండాలి. అభ్యర్థులు 28 ఏండ్లలోపువారై ఉండాలి.
దరఖాస్తులు ప్రారంభం: మే 20
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 21
వెబ్సైట్: www.immt.res.in
No comments:
Post a Comment