Saturday, 8 May 2021

సీఆర్‌పీఎఫ్‌లో 50 జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్‌ ఆఫీస‌ర్లు ఉద్యోగాలు, ఐటీఐ లిమిటెడ్‌లో 40 ఇంజినీర్లు ఉద్యోగాలు, నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు, ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ ద‌వాఖాన‌లో డాక్ట‌ర్ పోస్టులు.

 సీఆర్‌పీఎఫ్‌లో 50 జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్‌ ఆఫీస‌ర్లు ఉద్యోగాలు

సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకిని నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త‌ క‌లిగినవారు ఈనెల 13న జ‌ర‌గ‌నున్న ఇంట‌ర్వ్యూలకు హాజ‌రుకావాల‌ని కోరింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 50 పోస్టులు భ‌ర్తీ చేయ‌నుంది. ఇంట‌ర్వ్యూకి హాజ‌ర‌య్యేవారు అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని సూచించింది. ఎంపికైన‌వారు సీఆర్‌పీఎఫ్‌కు చెందిన‌ యూనిట్లు, జీసీ, సీహెచ్, ఇన్‌స్టిట్యూట్ల‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 50

ఇందులో జ‌మ్ముక‌శ్మీర్ జోన్‌లో 18, సెంట్ర‌ల్ జోన్‌లో 19, సద‌ర‌న్ జోన్‌లో 7, నార్త్ ఈస్ట్ జోన్‌లో 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: ఎంబీబీఎస్ చేసి ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: ఇంట‌ర్వ్యూ ద్వారా

ఇంట‌ర్వ్యూ తేదీ: మే 13

వెబ్‌సైట్‌: www.crpf.gov.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఐటీఐ లిమిటెడ్‌లో 40 ఇంజినీర్లు ఉద్యోగాలు

ప‌్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన ఐటీఐ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 40 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో మెకానిక‌ల్ ఇంజినీర్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్‌, ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. రాత ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నుంది. ఎంపికైనవారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాయ్‌బ‌రేలీలో ప‌నిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 40

ఇందులో మెకానిక‌ల్ ఇంజినీర్ 29, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్ 7, ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీర్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: ప‌దో త‌ర‌గ‌తితోపాటు మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్ ట్రేడ్‌ల‌లో 60 శాతం మార్కుల‌తో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష ఆధారంగా. డిప్లొమాలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. వారిని రాత ప‌రీక్ష‌కు ఆహ్వానిస్తారు.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 15

ప‌రీక్ష తేదీ: జూలై 4

వెబ్‌సైట్‌: https://www.itiltd.in/

-----------------------------------------------------------------------------------------------------------------------------

నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు

న‌గ‌రంలోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (నిమ్స్‌)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల‌ను భ‌ర్తీచేస్తున్న‌ది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. జెరియాట్రిక్ మెడిసిన్‌లో ఈ పోస్టుల‌ను చేస్తున్న‌ది. ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను నియ‌మిస్తున్న‌ది. వాక్‌-ఇన్‌-ఇంట‌ర్వ్యూలు ఈనెల 19న ఉద‌యం 11 నుంచి న12 గంటల వ‌రకు నిర్వ‌హిస్తారు. అర్హ‌తల‌ వంటి వివ‌రాల కోసం నిమ్స్ అధికారిక వెబ్‌సైట్ http://www.nims.edu.in/ చూడవ‌చ్చ‌ని, లేదా 040-23489353 నంబ‌ర్‌లో సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని అధికారులు తెలిపారు. ఈ పోస్టుల‌ను కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో భ‌ర్తీ చేస్తున్నారు

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ ద‌వాఖాన‌లో డాక్ట‌ర్ పోస్టులు

మెదక్ జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ద‌వాఖాన‌లో వైద్య నిపుణుల నియామ‌కానికి వాక్‌-ఇన్‌-ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తున్నారు. ఈ పోస్టుల‌ను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భ‌ర్తీచేస్తారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా రెండు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఆరు నెల‌ల కాలానికి వైద్యుల‌ను నియ‌మిస్తున్నారు. ఈ పోస్టుల‌కు ఎంపికైన‌వారు.. అవసరానికనుగుణంగా క్యాంపస్‌లోనే ఉండాల్సి ఉంటుందని, వైద్యులకు తగిన వసతి కల్పిస్తామని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ అధికారులు వెల్ల‌డించారు. ఎంబీబీఎస్ పూర్తిచేసిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్ నంబ‌ర్‌ 040 23283480, మొబైల్ నంబర్‌ 8332999339లో సంప్రదించవచ్చ‌న్నారు

No comments:

Post a Comment