Saturday, 8 May 2021

గోవా షిప్‌యార్డ్‌లో 137 ఫిట్ట‌ర్‌, ఆప‌రేట‌ర్ పోస్టులు, ఆయిల్ ఇండియాలో టెన్త్‌ ఇంట‌ర్ అర్హ‌త‌తో 119 ఉద్యోగాలు, ఇఫ్లూలో టీచింగ్ స్టాఫ్‌ 33 ప్రొఫెస‌ర్ ఉద్యోగాలు.

గోవా షిప్‌యార్డ్‌లో 137 ఫిట్ట‌ర్‌, ఆప‌రేట‌ర్ పోస్టులు

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. అర్హ‌త క‌లిగిన‌వారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేనెల 4 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 137 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో జ‌న‌ర‌ల్ ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల్ మెకానిక్‌, క‌మ‌ర్షియ‌ల్ అసిస్టెంట్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్ (క్యూఏ), అన్‌స్కిల్డ్‌, ఎఫ్ఆర్‌పీ లామినేట‌ర్‌, ఈఓటీ క్రేన్ ఆప‌రేట‌ర్‌, వెల్డ‌ర్‌, స్ట్ర‌క్చుర‌ల్ ఫిట్ట‌ర్‌, న‌ర్స్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్ (క‌మ‌ర్షియ‌ల్‌, స్టోర్స్‌), ట్రైనీ ఖ‌లాసీ వంటి పోస్టులు ఉన్న‌యి.

మొత్తం పోస్టులు: 137

ఇందులో జ‌న‌ర‌ల్ ఫిట్ట‌ర్ 5, ఎల‌క్ట్రిక‌ల్ మెకానిక్ 1, క‌మ‌ర్షియ‌ల్ అసిస్టెంట్ 1, టెక్నిక‌ల్ అసిస్టెంట్ 3, అన్‌స్కిల్డ్ 25, ఎఫ్ఆర్‌పీ లామినేట‌ర్ 5, ఈఓటీ క్రేన్ ఆప‌రేట‌ర్ 10, వెల్డ‌ర్ 26, స్ట్ర‌క్చుర‌ల్ ఫిట్ట‌ర్ 42, న‌ర్స్ 3, టెక్నిక‌ల్ అసిస్టెంట్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.

అప్లికేష‌న్ ఫీజు: రూ.200

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూన్ 4

వెబ్‌సైట్‌: www.goashipyard.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఆయిల్ ఇండియాలో టెన్త్‌ ఇంట‌ర్ అర్హ‌త‌తో 119 ఉద్యోగాలు

దేశంలో అతిపెద్ద చ‌మురు ఉత్పత్తి, పంపిణీ సంస్థ‌ల్లో ఒక‌టైన ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని సూచించింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నుంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 119 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తుంది. ఇందులో డ్రిల్లింగ్ హెడ్‌మ్యాన్‌, డ్రిల్లింగ్ రిగ్‌మ్యాన్‌, ఎల‌క్ట్రిక‌ల్ సూప‌ర్‌వైజ‌ర్‌, కెమిక‌ల్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్య‌ర్థులు అసోంలోని డిబ్రూగ‌ఢ్‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 119

ఇందులో అసిస్టెంట్ మెకానిక్ 79, గ్యాస్ లాగ‌ర్ 20, డ్రిల్లింగ్ టాప్‌మ్యాన్ 17, కెమిక‌ల్ అసిస్టెంట్ 10, అసిస్టెంట్ రిగ్ ఎల‌క్ట్రిష‌న్ 10, ఎల‌క్ట్రిక్ సూప‌ర్‌వైజ‌ర్ 5, డ్రిల్లింగ్ రిగ్‌మ్యాన్ 5, డ్రిల్లింగ్ హెడ్‌మ్యాన్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. ప‌ది, ఇంట‌ర్‌, డిగ్రీ పాస‌వ్వాల్సి ఉంటుంది. కెమిక‌ల్ అసిస్టెంట్‌కు 18 నుంచి 40 ఏండ్లు, మిగిలిన పోస్టుల‌కు 18 నుంచి 35 ఏండ్ల వ‌యస్సు క‌లిగి ఉండాలి.

ఎంపిక విధానం: వాకిన్ ప్రాక్టిక‌ల్ లేదా స్కిల్ టెస్ట్ క‌మ్ ప‌ర్స‌న‌ల్ అస్సెస్‌మెంట్ ద్వారా.

ఇంట‌ర్వ్యూ తేదీ: మే 24 నుంచి జూన్ 22 మ‌ధ్య‌

మెయిల్‌: https://www.oil-india.com/


-----------------------------------------------------------------------------------------------------------------------------

ఇఫ్లూలో టీచింగ్ స్టాఫ్‌ 33 ప్రొఫెస‌ర్ ఉద్యోగాలు


ఇంగ్లిష్ అండ్‌ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివ‌ర్సిటీ (ఇఫ్లూ)లో బోధన సిబ్బంది నియామకానికి రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆస‌క్తి క‌లిగిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా హైదరాబాద్‌తోపాటు షిల్లాంగ్‌, లక్నో క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో రెగ్యుల‌ర్ రిక్రూట్‌మెంట్‌తోపాటు, బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మొత్తం పోస్టులు: 33

ఇందులో ప్రొఫెస‌ర్ 9, అసోసియేట్‌ ప్రొఫెస‌ర్లు 10

బ్యాక్‌లాగ్ పోస్టులు.. ప్రొఫెస‌ర్లు 5, అసోసియేట్‌ ప్రొఫెస‌ర్లు 8, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ 1 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 18

పూర్తివివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.efluniversity.ac.in/



No comments:

Post a Comment