Thursday, 27 May 2021

రైల్వేలో 3591 అప్రెంటిస్ పోస్టులు, 334 పోస్టుల‌తో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ఏఎఫ్‌సీఏటీ-2 నోటిఫికేషన్‌, ఎన్టీపీసీలో 280 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు, ఇండియ‌న్ ఆర్మీ(ఎస్ఎస్‌సీ) - 191 పోస్టులు.

రైల్వేలో 3591 అప్రెంటిస్ పోస్టులు

దేశ‌ ఆర్థిక రాజ‌ధాని ముంబై కేంద్రంగా ప‌నిచేస్తున్న వెస్ట్ర‌న్ రైల్వేలో ఖాళీగా అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఈనెల 25 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 3591 అప్రెంటిస్‌ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ పోస్టుల‌కు ప‌దో త‌ర‌గతి, ఇంట‌ర్‌తోపాటు ఐటీఐ పాసైన అభ్య‌ర్థులు అర్హులని తెలిపింది. డిప్లొమా చేసిన వారు అప్ల‌య్‌ చేసుకోవ‌డానికి వీల్లేద‌ని పేర్కొంది. ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్ష‌ణ అందించ‌నున్నారు.

మొత్తం పోస్టులు: 3591

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ త‌ర్వాత ఐటీఐ పూరిచేసిన‌వారు. అభ్య‌ర్థులు 2021, జూన్ 24 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి.

ఎంపిక విధానం: ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

అప్లికేష‌న్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, మ‌హిళా అభ్య‌ర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: మే 25

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూన్ 24

వెబ్‌సైట్‌: http://www.rrc-wr.com

-----------------------------------------------------------------------------------------------------------------------------

334 పోస్టుల‌తో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ఏఎఫ్‌సీఏటీ-2 నోటిఫికేషన్‌

భార‌త వాయుసేన (ఐఏఎఫ్‌) ఏటా నిర్వ‌హించే ఎయిర్ ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటీ) నోటిఫికేష‌న్ త్వ‌ర‌లో వెలువ‌డ‌నుంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ జూన్ 1 నుంచి ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ది. ఈ టెస్ట్‌ ద్వారా ఫ్ల‌యింగ్ డ్యూటీ, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీల్లో క‌మిష‌న్డ్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో టెక్టిక‌ల్‌, నాన్‌టెక్నిక‌ల్ పోస్టులు ఉంటాయి. AFCATని ఐఏఎఫ్ ఏటా రెండుసార్లు ఫిబ్ర‌వ‌రి, ఆగ‌స్టు నెల‌ల్లో నిర్వ‌హిస్తుంది. ప్ర‌స్తుతం రెండో బ్యాచ్ కోసం ఈ నెలాఖ‌రులోగా నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. దీనిద్వారా ఏఎఫ్‌సీఏటీ ఎంట్రీ, ఎన్‌సీసీ ఎంట్రీ, ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ, మెటీరియాలజీ ఎంట్రీ చేప‌ట్ట‌నున్నారు.

మొత్తం పోస్టులు: 334

అర్హ‌త‌లు: ఫ‌్ల‌యింగ్ బ్రాంచీకి.. ఇంట‌ర్‌లో (10+2)లో మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల్లో క‌నీ సం 50 శాతం మార్కులు రావాలి. అదేవిధంగా డిగ్రీ 60 మార్కుల‌తో ఉత్తీర్ణుల‌వ్వాలి.

గ్రౌంట్ డ్యూటీ టెక్నిక‌ల్, నాన్ టెక్నిక‌ల్‌ బ్రాంచీకి.. 10+2లో ఫిజిక్స్‌, మ్యాథ్స్ స‌బ్జెక్టుల్లో 60 మార్కులు, నాలుగేండ్ల డిగ్రీ ఉత్తీర్ణుల‌వ్వాలి. అభ్య‌ర్థులు 25 ఏండ్ల‌లోపు ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఆఫీస‌ర్స్ ఇంటెలిజన్స్ రేటింగ్ టెస్ట్ అండ్ పిక్చ‌ర్ ప‌ర్సెప్ష‌న్ అండ్ డిస్క‌సింగ్ టెస్ట్‌, సైక‌లాజిక‌ల్ టెస్ట్‌, గ్రూప్ టెస్ట్ లేదా ఇంట‌ర్వ్యూ.

ప‌రీక్ష విధానం..

ప‌రీక్ష మొత్తం 100 ప్ర‌శ్న‌ల‌కు ఉంటుంది. ఇందులో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌లో వ‌ర్బ‌ల్ ఎబిలిటీ, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ, రీజ‌నింగ్‌, మిల‌ట‌రీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. వీటికి మొత్తం 300 మార్కులు. ప‌రీక్ష‌ను 2 గంట‌ల్లో రాయాల్సి ఉంటుంది. ప్ర‌తి స‌రైన స‌మాధానానికి మూడు మార్కులు కేటాయిస్తారు. అయితే ప్ర‌తి త‌ప్పు జ‌వాబుకు ఒక మార్కు కోత విధిస్తారు.

ప‌రీక్ష ఫీజు: రూ.250. ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎట్రీకి ఎలాంటి ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: జూన్ 1

ద‌ర‌ఖాస్తులకు చివ‌రితేదీ: జూన్ 30

వెబ్‌సైట్‌: www.careerindianairforce.cdac.in OR www.afcat.cdac.in


-----------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్టీపీసీలో 280 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

ప‌్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (ఎన్టీపీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఈనెల 21న ప్రారంభ‌మై వ‌చ్చే నెల 10న ముగుస్తుంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 280 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ పోస్టులు ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. గేట్ స్కోర్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తుంది.

మొత్తం పోస్టులు: 280

అర్హ‌త‌లు: బీటెక్ లేదా బీఈలో ఎల‌క్టిల్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్‌, పవ‌ర్ సిస్ట‌మ్స్ అండ్ హై వోల్టేజ్‌, మెకానిక‌ల్, ప్రొడ‌క్ష‌న్‌, ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజినీరింగ్‌, ప్రొడ‌క్ష‌న్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజినీరింగ్‌, థ‌ర్మ‌ల్‌, మెకానిక‌ల్ అండ్ ఆటోమేష‌న్‌, ప‌వ‌ర్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేష‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ప‌వ‌ర్‌, ప‌వ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్ కోర్సుల్లో ఏదో ఒక‌టి చేసి ఉండాలి. అభ్య‌ర్థులు 27 ఏండ్ల లోపువారై ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: గేట్ 2021 స్కోర్, ఇంట‌ర్వ్యూ, గ్రూప్‌డిస్క‌ష‌న్ ఆధారంగా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: మే 21

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూన్ 10

వెబ్‌సైట్‌: www.ntpccareer.net

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఇండియ‌న్ ఆర్మీ(ఎస్ఎస్‌సీ) - 191 పోస్టులు

ఇండియ‌న్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీస‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌మీ(ఓటీఏ) 2021 అక్టోబ‌రు సంవ‌త్స‌రానికి గాను 57వ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్(టెక్) మెన్‌, ‌28వ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టెక్‌‌) ఉమెన్ కోర్సు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన‌ అవివాహిత పురుషులు, మ‌హిళ‌లు, డిఫెన్స్ ప‌ర్స‌న‌ల్ విడోస్ నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టెక్‌) మెన్‌/ విమెన్ (అక్టోబ‌రు 2021) కోర్సు 


* మొత్తం ఖాళీలు: 191

1) ఎస్ఎస్‌సీ (టెక్) మెన్‌: 175

2) ఎస్ఎస్‌సీ (టెక్‌) ఉమెన్‌: 14

3) విడోస్ డిఫెన్స్ ప‌ర్స‌న‌ల్‌: 02


విభాగాలు: సివిల్‌/ బిల్డింగ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాల‌జీ, ఆర్కిటెక్చ‌ర్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్, ఎల‌క్ట్రానిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, టెలీక‌మ్యూనికేష‌న్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: ఎస్ఎస్‌సీ(టెక్‌) మెన్‌/ విమెన్ - సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎస్ఎస్‌సీ విడోస్ (నాన్ టెక్నిక‌ల్‌)(నాన్ యూపీఎస్సీ)- ఏదైనా గ్రాడ్యుయేష‌న్, ఎస్ఎస్‌సీ విడో (టెక్నిక‌ల్‌)-బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌. 

వ‌య‌సు: ఎస్ఎస్‌సీ (టెక్‌) మెన్‌/ ఉమెన్ - 01.10.2021 నాటికి 20-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్ఎస్‌సీ విడోస్ (నాన్ టెక్నిక‌ల్‌)(నాన్ యూపీఎస్సీ), ఎస్ఎస్‌సీ విడో (టెక్నిక‌ల్‌)-01.10.2021 నాటికి 35 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 25.05.2021.


ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 23.06.2021


No comments:

Post a Comment