Saturday, 1 May 2021

ఎస్‌బీఐలో 5 వేల క్లర్క్‌ ఉద్యోగాలు, బార్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌లో 459 ఉద్యోగాలు, బీఎస్‌ఎఫ్‌లో 70 ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలు, స్టీల్‌ అథారిటీలో 60 డాక్టర్‌, నర్స్‌ పోస్టులు, ఎన్‌హెచ్‌ఏఐలో 41 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.

ఎస్‌బీఐలో 5 వేల క్లర్క్‌ ఉద్యోగాలు


దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 17 అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 5 వేల ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో కర్క్‌ పోస్టులతోపాటు క్లరికల్‌ క్యాడర్‌లో జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులకు స్థానిక భాష తెలిసి ఉండాలి.

అర్హతలు: ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సు లేదా 1993, ఏప్రిల్‌ 2 నుంచి 2021, ఏప్రిల్‌ 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ రాతపరీక్ష. పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్‌ అని రెండు విభాగాలుగా ఉంటుంది.


పరీక్ష విధానం

ప్రిలిమినరీ.. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు అన్ని ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. నిర్ణీత సమయంలోపు సెక్షన్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 30 మార్కులకు ఉంటుంది. న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 70 మార్కులు ఉంటాయి. మూడు విభాగాలకు 20 నిమిషాల చొప్పున మొత్తం గంట సేపట్లో పరీక్ష రాయాలి. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.

మెయిన్‌.. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారు మెయిన్స్‌ పరీక్ష రాయవచ్చు. ఇందులో మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు. వాటికి 200 మార్కులు కేటాయించారు. పరీక్షను 2.40 గంటల సమయంలో పూర్తిచేయాలి. జనరల్‌ లేదా ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ (50 మార్కులు, 50 ప్రశ్నలు), జనరల్‌ ఇంగ్లిష్‌ (40 మార్కులు, 40 ప్రశ్నలు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (50 మార్కులు, 50 ప్రశ్నలు), రీజనింగ్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ (50 ప్రశ్నలు, 60 మార్కులు) నుంచి ప్రశ్నలు అడుగుతారు

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్‌ 27

దరఖాస్తులకు చివరితేదీ: మే 17

ప్రిలిమినరీ పరీక్ష: జూన్‌ లో

మెయిన్‌ ఎగ్జామ్‌: జూలై 31

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/careers

-----------------------------------------------------------------------------------------------------------------------

బార్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌లో 459 ఉద్యోగాలు


అంతర్జాతీయ సరిహద్దుల్లో హైవేలను నిర్మించే బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌వో) జనరల్‌ రిజర్వ్‌ ఇంజినీర్‌ ఫోర్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందులో డ్రాట్స్‌మ్యాన్‌, స్టోర్‌ సూపర్‌వైజర్‌, రేడియో మెకానిక్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు పురుష అభ్యర్థులకు మాత్రమేనని స్పష్టం చేసింది. మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదని తెలిపింది. ట్రేడ్‌టెస్ట్‌, రాతపరీక్ష అభ్యర్థులను ఎంపికచేయనుంది.

మొత్తం పోస్టులు: 459

ఇందులో డ్రాట్స్‌మ్యాన్‌ 43, సూపర్‌వైజర్‌ స్టోర్‌ 11, రేడియో మెకానిక్‌ 4, ల్యాబ్‌ అసిస్టెంట్‌ 1, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ 250, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ 150 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: డ్రాట్స్‌మ్యాన్‌ పోస్టుకు సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులవ్వాలి. స్టోర్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు డిగ్రీ పూర్తిచేయాలి. ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఇంటర్‌ పాసై ల్యాబ్‌ అసిస్టెంట్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. రేడియో మెకానిక్‌, మల్టీస్కిల్డ్‌ వర్కర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్‌ ఉండాలి. మల్టీస్కిల్డ్‌ వర్కర్‌ పోస్టుకు అభ్యర్థులు 18 నుంచి 25 ఏండ్లు, ఇతర పోస్టులకు 18 నుంచి 27 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిసియెన్సీ టెస్ట్‌, ప్రాక్టికల్‌ (ట్రేడ్‌) టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను సంబంధిత చిరునామాకు పంపించాలి.

అడ్రస్‌: Commandant, GREF CENTRE, Dighi Camp, Pune – 411

అప్లికేషన్‌ ఫీజు: రూ.50, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరితేదీ: జూన్‌ 10

వెబ్‌సైట్‌: bro.gov.in

-----------------------------------------------------------------------------------------------------------------------

బీఎస్‌ఎఫ్‌లో 70 ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలు


సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)లో గ్రూప్‌ బీ, సీ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్‌ చివరి వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్‌ ఫ్లైట్‌ ఇంజినీర్‌, ఎన్‌స్పెక్టర్‌ లేదా స్టోర్‌మ్యాన్‌, జూనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌, అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌, సీనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌, సీనియర్‌ రేడియో మెకానిక్‌ (ఇన్‌స్పెస్టర్‌), అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ రేడియో మెకానిక్‌ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 70

ఇందులో సీనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ 12, సీనియర్‌ రేడియో మెకానిక్‌ 5, జూనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ 4, అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ 8, అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ రేడియో మెకానిక్‌ 3, సీనియర్‌ ఫ్లైట్‌ గన్నర్‌ 1, జూనియర్‌ ఫ్లైట్‌ గన్నర్‌ 4, సీనియర్‌ ఫ్లైట్‌ ఇంజినీర్‌ 1, జూనియర్‌ ఫ్లైట్‌ ఇంజినీర్‌ 4, ఇన్‌స్పెక్టర్‌ లేదా స్టోర్‌మ్యాన్‌ 4, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 4, కానిస్టేబుల్‌ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 31, 2021

పూర్తివివరాలకువెబ్‌సైట్‌: bsf.nic.in

-----------------------------------------------------------------------------------------------------------------------

స్టీల్‌ అథారిటీలో 60 డాక్టర్‌, నర్స్‌ పోస్టులు


ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) డాక్టర్‌, నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారు జార్ఖండ్‌లోని బొకారో జనరల్‌ హాస్పిటల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు సంబంధిత సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

మొత్తం పోస్టులు: 60

ఇందులో డాక్టర్‌ 30, నర్స్‌ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: డాక్టర్‌ పోస్టులకు ఎంబీబీఎస్ లేదా అంతకు ఎక్కువ చదివి ఉండాలి. నర్సు పోస్టులకు బీఎస్సీ నర్సింగ్‌, ఇటర్‌తోపాటు జీఎన్‌ఎంలలో ఏదో ఒకటి చేసి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగం

ఇంటర్వ్యూ తేదీ: మే 3 నుంచి 8వ తేదీ వరకు

వెబ్‌సైట్‌: https://www.sail.co.in/

-----------------------------------------------------------------------------------------------------------------------

ఎన్‌హెచ్‌ఏఐలో 41 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు


నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) టెక్నికల్‌ విభాగంలో డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చేనెల 28 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గేట్‌-2021 స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

మొత్తం పోస్టులు: 41

అర్హత: సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ లేదా బీఈ చేసి ఉండాలి. అభ్యర్థులు 30 ఏండ్లలోపువారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: గేట్‌-2021 స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: మే 28

వెబ్‌సైట్‌: nhai.gov.in

No comments:

Post a Comment