ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 23 మెటీరియల్స్ ఆఫీసర్లు ఉద్యోగాలు
ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 24 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 23 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో సీనియర్ ఇంజినీర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, మెటీరియల్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 23
ఇందులో సీనియర్ ఇంజినీర్ 2, అకౌంట్స్ ఆఫీసర్ 7, అసిస్టెంట్ మేనేజర్ 4, మెటీరియల్స్ ఆఫీసర్ 10 చొప్పున ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ చేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్లు ప్రారంభం: మే 26
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 25
వెబ్సైట్: https://www.nationalfertilizers.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్, నాగ్‌పూర్‌లో 22 ఫ్యాకల్టీ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్–04, అసిస్టెంట్ ప్రొఫెసర్–18.
సబ్జెక్టులు: అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటిరాలజీ(మెడికల్), జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్) ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/పరిశోధనలో అనుభవం ఉండాలి.
వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి 50ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఎయిమ్స్ నాగ్‌పూర్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ప్లాట్ నెం.2, సెక్టార్–20, మిహాన్, నాగ్‌పూర్–441108 చిరునామాకు పంపించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.06.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 24.06.2021
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్ ఇండియాలో 15 ఫైనాన్స్ మేనేజర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అర్హత సాధించిన వారు ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 15
ఇందులో మేనేజర్ ఫైనాన్స్ 6, ఆఫీసర్ అకౌంట్స్ 7, అసిస్టెంట్ అకౌంట్స్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సీఏ, 10+2+3 విధానంలో డిగ్రీ పూర్తి ఉండాలి. ఆఫీసర్ అకౌంట్స్ పోస్టుకు 30 ఏండ్లు, మిగిలిన పోస్టులకు 28 ఏండ్లకు మించరాదు.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తును ఈ-మెయిల్ ద్వారా పంపించాలి.
ఈ-మెయిల్: hrhq.aiasl@airindia.in
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 1
వెబ్సైట్: http://www.aiatsl.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
బీఈఎల్‌లో 9 ట్రైనీ ఇంజినీర్లు ఉద్యోగాలు
ప్రభుత్వరంగ సంస్థ, కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే నెల 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఎంపికైన వారు స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అండ్ అన్నేమ్డ్ సిస్టమ్స్ ఎబీయూ, బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 9
ఇందులో ట్రైనీ ఇంజినీర్ 6, ప్రాజెక్ట్ ఇంజినీర్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎయిరో స్పేస్, ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్‌తోపాటు ఎంఈ, ఎంటెక్ చేసి ఉండాలి. అభ్యర్థులు 25, 28 ఏండ్లలోపువారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. నిర్ణీత నమూనాలోని దరఖాస్తులను సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: MANAGER(HR/SC&US), Bharat Electronics Ltd, Jalahalli, Bangalore– 560013
అప్లికేషన్ ఫీజు: ట్రైనీ ఇంజినీర్ రూ.200, ప్రాజెక్ట్ ఇంజినీర్ రూ.500
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 9
వెబ్సైట్: bel-india.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌బీసీసీలో 7 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్బీసీసీ లిమిటెడ్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 21 వరకు అందుబాటులో ఉంటాయని తెలిసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
మొత్తం పోస్టులు: 7
ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ 5, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: మేనేజ్మెంట్ పోస్టులకు ఎంబీఏ, ఎమ్మెస్‌డబ్ల్యూ, హెచ్ఆర్ఎంలో పీజీ చేసి ఉండాలి. ట్రాన్స్‌లేటర్ పోస్టుకు హిందీ సబ్జెక్టులో పీజీ చేయాలి. ఇంగ్లిష్ నుంచి హిందీలోకి ట్రాన్స్‌లేషన్‌లో ఏడాది అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 21
వెబ్సైట్: www.nbccindia.com
-----------------------------------------------------------------------------------------------------------------------------
సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్‌లో 5 జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
కోల్‌కతాలోని సీఎస్ఐఆర్-సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీజీసీఆర్ఐ)లో ఖాళీగా ఉన్న జేఆర్ఎఫ్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 11 వరకు అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా జూనియర్ రిసెర్చ్ ఫెలోలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 5
ఇందులో జనరల్ 2, ఓసీ-పీహెచ్సీ 1, ఎస్సీ 1, ఓబీసీ 1
అర్హత: సిరామిక్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ లేదా గ్లాస్ టెక్నాలజీ ఇంజినీరింగ్, మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్ చేసి ఉండాలి. వ్యాలిడ్ గేట్ స్కోరు ఉండాలి. అభ్యర్థులు 28 ఏండ్లలోపు ఉన్నవారై ఉండాలి.
స్టయిఫండ్: ప్రతి నెల రూ.31,000
ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ (coordinator.cgcri@acsir.res.in )ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ ఒకటి నుంచి ఏడు వరకు పంపించవచ్చు
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 11
వెబ్సైట్: www.cgcri.res.in
No comments:
Post a Comment