Saturday, 1 May 2021

ఎయిమ్స్‌ జోధ్‌పూర్‌లో 86 ఫ్యాకల్టీ పోస్టులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలో 38 ఉద్యోగాలు, ఐఐటీ, జోధ్‌పూర్‌లో 50 ఉద్యోగాలు, సీఎంఎస్ఎస్‌లో 9 మేనేజర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు, బీఈఎల్‌లో 23 ట్రైనీ ఇంజినీర్‌, ఆఫీసర్లు ఉద్యోగాలు.

ఎయిమ్స్‌ జోధ్‌పూర్‌లో 86 ఫ్యాకల్టీ పోస్టులు


మొత్తం పోస్టుల సంఖ్య: 86

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–32, అడిషనల్‌ ప్రొఫెసర్‌–10, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–30, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–14.


విభాగాలు: అనెస్తీషియాలజీ అండ్‌ క్రిటికల్‌ కేర్, అనాటమీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌–టాక్సికాలజీ, న్యూరాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టుగ్రాడ్యుయేట్‌ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 17.05.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.aiimsjodhpur.edu.in

-----------------------------------------------------------------------------------------------------------------------

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలో 38 ఉద్యోగాలు


మొత్తం పోస్టుల సంఖ్య: 38

పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్‌ మేనేజర్‌–01, జాయింట్‌ డైరెక్టర్‌–12 (టెక్నికల్‌–08, అడ్మిన్‌–ఫైనాన్స్‌–04), సీనియర్‌ మేనేజర్‌–01, సీనియర్‌ మేనేజర్‌(ఐటీ)–01, డిప్యూటీ డైరెక్టర్‌–17 (టెక్నికల్‌–11, అడ్మిన్‌–ఫైనాన్స్‌–06), మేనేజర్‌–06 (జర్నలిజం–03, మార్కెటింగ్‌–02, సోషల్‌ వర్క్‌–01).


విభాగాలు: జర్నలిజం/మాస్‌ కమ్యూనికేషన్, టెక్నికల్, అడ్మిన్‌–ఫైనాన్స్, సోషల్‌ వర్క్‌/సైకాలజీ/లేబర్‌–సోషల్‌ వెల్ఫేర్, మార్కెటింగ్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీటెక్, పీజీ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.05.2021

పరీక్ష తేది: 20.06.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.fssai.gov.in

-----------------------------------------------------------------------------------------------------------------------

ఐఐటీ, జోధ్‌పూర్‌లో 50 ఉద్యోగాలు


మొత్తం పోస్టుల సంఖ్య: 50


పోస్టుల వివరాలు: సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌–01, జూనియర్‌ అసిస్టెంట్‌(అడ్మినిస్ట్రేషన్‌)–15, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌–34.




సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌:


అర్హత: లైబ్రరీ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటరైజ్డ్‌ లైబ్రరీ విధానంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.


వయసు: 32 ఏళ్లు మించకూడదు.


వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.




జూనియర్‌ అసిస్టెంట్‌ (అడ్మినిస్ట్రేషన్‌):


అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.


వయసు: 27 ఏళ్లు మించకుండా ఉండాలి.


వేతనం: నెలకు రూ. 21,700 చెల్లిస్తారు.




జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌:


విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, బయో ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్‌ తదితరాలు.


అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ఎంటెక్‌/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.




ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.




దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, ఆఫీస్‌ ఆఫ్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌–2, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ జోధ్‌పూర్, ఎన్‌హెచ్‌–62, నాగోర్‌ రోడ్, కార్వార్, జోధ్‌పూర్‌–342037 చిరునామాకు పంపించాలి.




ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 11.05.2021




దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 20.05.2021




పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.iitj.ac.in

-----------------------------------------------------------------------------------------------------------------------

సీఎంఎస్ఎస్‌లో 9 మేనేజర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు

కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ మెడికల్ సర్వీసెస్‌ సొసైటీ (సీఎంఎస్ఎస్‌) మేనేజర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనుంది. ఎంపికైన వారిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తుంది.

మొత్తం ఖాళీలు: 9

ఇందులో అకౌంట్స్ ఆఫీసర్ 1, మేనేజర్‌ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు అకౌంట్, ఫైనాన్షియల్ అన‌లైటిక‌ల్, కంప్యూట‌ర్ స్కిల్స్‌ తెలిసి ఉండాలి. మేనేజర్‌ పోస్టులకు డిగ్రీలో సైన్స్‌ గ్రూప్‌ చేసి, బీఫార్మసీ, బీటెక్, ఎంబీఏ, బీసీఏ, ఎంసీఏలో ఏదో ఒకటి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.

ఎంపిక ప్రక్రియ‌: ఇంట‌ర్వ్యూ ద్వారా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్, ఈ-మెయిల్ (cmss.admn2021@gmail.com) ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ: మే 10

వెబ్‌సైట్‌: www.cmss.gov.in


-----------------------------------------------------------------------------------------------------------------------

బీఈఎల్‌లో 23 ట్రైనీ ఇంజినీర్‌, ఆఫీసర్లు ఉద్యోగాలు


 ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) ట్రైనీ ఇంజినీర్‌, ట్రైనీ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనుంది. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను వచ్చేనెల 19వతేదీలో పంపించాలని కోరింది.

మొత్తం పోస్టులు: 23

ఇందులో ట్రైనీ ఇంజినీర్‌ 20, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ 1, ట్రైనీ ఆఫీసర్‌ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులకు ఎలక్ట్రానిక్స్‌ లేదా మెకానికల్‌లో బీఈ, బీటెక్‌, బీఎస్సీ (ఇంజినీరింగ్‌) కోర్సుల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. ప్రాజెక్ట్ ఆఫీసర్‌ పోస్టులకు సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏలో ఏదో ఒకటి చేసి ఉండాలి. ట్రైనీ ఆఫీసర్‌కు ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీడీఎంలో ఏదో ఒకటి ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.

అడ్రస్‌: Sr. Dy. Gen. Manager (CS, FTD, HR&A) Bharat Electronics Limited, Plot No. L-1, MIDC Industrial Area, Taloja, Navi Mumbai: 410208, Maharashtra.

దరఖాస్తులకు చివరితేదీ: మే 19

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/


No comments:

Post a Comment