సింగరేణిలో ట్రేడ్ అప్రెంటిస్‌లు
ఉద్యోగాల గని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ కోసం దరఖాస్తులను కోరుతున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ అప్లికేషన్లు ఈనెల 28 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనుంది.
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, వరంగల్ కరీంనగర్, ఆదిలాబాద్ సబంధించిన అభ్యర్థులను లోకల్‌గాను, మిగిలిన జిల్లాల అభ్యర్థులను నాన్ లోకల్‌గా పరిగణిస్తారు. 80:20 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేస్తారు. 28 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 28
వెబ్సైట్: www.scclmines.com/apprenticeship
------------------------------------------------------------------------------------------------------------------
రెప్కో బ్యాంకులో 10 స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉద్యోగాలు
భారత ప్రభుత్వరంగానికి చెందిన చెన్నైలోని రెప్కో బ్యాంక్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 10
1) మేనేజర్: 03
విభాగాలు: చార్టర్డ్ అకౌంటెంట్, లీగల్
అర్హత: లా గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్‌తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్‌లో అసోసియేట్ అయి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 31.05.2021 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
2) అసిస్టెంట్ మేనేజర్: 07
విభాగాలు: లీగల్, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్.
అర్హత: విభాగాల్ని అనుసరించి లా గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 31.05.2021 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 12.07.2021.
చిరునామా: The General Manager (Admin), Repco Bank Ltd, P.B.No.1449, Repco Tower, No:33, North Usman Road, T.Nagar, Chennai – 600 017.
-----------------------------------------------------------------------------------------------------------------------------
బీఈసీఐఎల్‌లో 10 అసోసియేట్ ఎడిటర్, ప్రూఫ్ రీడర్ ఉద్యోగాలు
ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 7 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్, ప్రూఫ్ రీడర్ వంటిపోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. ఎంపికైనవారు న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 10
ఇందులో ఎడిటర్ (ఇంగ్లిష్) 2, అసిస్టెంట్ ఎడిటర్ (ఇంగ్లిష్) 2, ప్రూఫ్ రీడర్ (ఇంగ్లిష్) 2, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ 2, మార్కెటింగ్ సూపర్వైజర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఇంగ్లిష్‌లో పీజీ, జర్నలిజంలో డిగ్రీ, ఎంకామ్, డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అభ్యర్థులకు రూ.450
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 7
వెబ్సైట్: www.becil.com, https://becilregistration.com
-----------------------------------------------------------------------------------------------------------------------------
నిఫ్ట్‌లో 9 వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్(ఐటీ)–01,రీసెర్చ్ అసిస్టెంట్(ఐటీ)–01, అసిస్టెంట్ (ఐటీ)–01,డాక్యుమెంటేషన్ అండ్ మెటాడేటా క్రియేటర్–01,ఇన్ఫర్మేషన్ అసోసియేట్–01, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–01,రీసెర్చ్ అసోసియేట్–03.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్లిíస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: recruitment.rtc@nift.ac.in
దరఖాస్తులకు చివరి తేది: 09.07.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://nift.ac.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్ఐఎన్, హైదరాబాద్‌లో 9 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ టీచింగ్ అసోసియేట్–03, ప్రాజెక్ట్ లెక్చరర్(స్టాటిస్టిక్స్)–01, ప్రాజెక్ట్ టీచింగ్ అసిస్టెంట్–02, ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్–01, ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్–01,ప్రాజెక్ట్ ల్యాబ్ అటెండెంట్–01.
ప్రాజెక్ట్ టీచింగ్ అసోసియేట్:
విభాగాలు: ఫిజియాలజీ, న్యూట్రిషన్, న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ;
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.70,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ లెక్చరర్(స్టాటిస్టిక్స్):
అర్హత: స్టాటిసిక్స్లో మాస్టర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 40ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ టీచింగ్ అసిస్టెంట్:
విభాగాలు: స్పోర్ట్స్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ;
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్:
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్ స్పీడ్ టెస్ట్‌తోపాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్:
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డీఎంఎల్టీ డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. అనుభవం ఉండాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.32,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ ల్యాబ్ అటెండెంట్:
అర్హత: హైస్కూల్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి.
వయసు: 25ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వూ్య ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: projectsnin2021recruitment@gmail.com
దరఖాస్తులకు చివరి తేది: 05.07.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.nin.res.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
సీపెట్‌లో 8 మేనేజర్ ఉద్యోగాలు
చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనోటిఫికేషన్ ద్వారా మేనేజనర్ పోస్టులను భర్తీ చేయనుంది.
మొత్తం ఖాళీలు: 8
ఇందులో చీఫ్ మేనేజర్ (టెక్నికల్ లసోసియేట్ ప్రొఫెసర్) 5,
చీఫ్ మేనేజర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) 2, మేనేజర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్) 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ, బీకాం, ఎంబీఏ ఫైనాన్స్, ఎంబీఏ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ, మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమాలో ఏదో ఒకటి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 30
వెబ్సైట్: www.cipet.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్డీఓలో 7 జేఆర్ఎఫ్లు
రక్షణ శాఖ పరిధిలోని డిఫెన్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్)కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) జేఆర్ఎఫ్, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే నెల చివరి నాటికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎంపికైనవారు అసోంలోని తేజ్‌పూర్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 7
ఇందులో జూఆర్ఎఫ్ 4, రిసెర్చ్ అసోసియేట్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: జేఆర్ఎఫ్కు టెక్స్టైల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్, ఎంఈ, లేదా ఎమ్మెస్సీ బయోటెక్నాలజీల్లో ఏదో ఒకటి చేసి.. నెట్ క్వాలిఫై అయి ఉండాలి.
రిసెర్చ్ అసోసియేట్‌కు.. జూలజీ, ఎంటమాలజీ, హార్టికల్చర్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో పీహెచ్డీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
వెబ్సైట్: drdo.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 ఆఫీస్ అసిస్టెంట్, ఇతర ఖాళీలు
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 05
1) ఆఫీస్ అసిస్టెంట్: 02
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18 - 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.15000 చెల్లిస్తారు.
2) అటెండర్: 01
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.
వయసు: 18 - 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.8000 చెల్లిస్తారు.
3) వాచ్మెన్ కమ్ గార్డెనర్: 02
అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తర్ణత.
వయసు: 18 - 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.5000 చెల్లిస్తారు.
* సిందు దుర్గ్‌కి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి అర్హులు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 30.06.2021.
చిరునామా: బ్యాంక్ ఆఫ్ ఇండియా, జోనల్ ఆఫీస్, ఆరోగ్య మందిర్ దగ్గర, శివాజీనగర్, రత్నగిరి 415639