Saturday, 26 June 2021

ఎస్‌ఈసీఎల్‌లో 428 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, ఎన్‌పీసీఐఎల్‌లో 121 అప్రెంటిస్‌ ఉద్యోగాలు, బీఈసీఐఎల్‌లో 103 ఉద్యోగాలు, ఏఎస్సీ సెంటర్‌(సౌత్‌)–2 ఏటీసీలో 100 ఉద్యోగాలు.

ఎస్‌ఈసీఎల్‌లో 428 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు


మొత్తం పోస్టుల సంఖ్య: 428

పోస్టుల వివరాలు: డంపర్‌ ఆపరేటర్‌–296, డోజర్‌ ఆపరేటర్‌–60, పేలోడర్‌ ఆపరేటర్‌–26, షోవెల్‌–23, సర్ఫేస్‌ మైనర్‌/కంటిన్యూయస్‌ మైనర్‌–23.

అర్హత: ఎనిమిది, పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు వాలిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లైసెన్స్, సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.


ఎంపిక విధానం: విద్యార్హతలు, అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకుగాను అప్టిట్యూడ్‌ టెస్ట్‌కు 80, విద్యార్హతలకు 15 మార్కులు, ఇతర అర్హతలకుS5 మార్కుల చొప్పున కేటాయిస్తారు.


దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 14.07.2021

దరఖాస్తు హార్ట్‌కాపీలను పంపడానికి చివరి తేది: 22.07.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.secl-cil.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్‌పీసీఐఎల్‌లో 121 అప్రెంటిస్‌ ఉద్యోగాలు


మొత్తం ఖాళీల సంఖ్య: 121

ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ మెకానిక్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, వెల్డర్, టర్నర్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత ట్రేడ్‌ను అనుసరించి ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

కాలవ్యవధి: ఒక సంవత్సరం

వయసు: 14 నుంచి 24 ఏళ్లు మించకూడదు.

సై్టపెండ్‌: నెలకు రూ.7,700 నుంచి రూ.8855 వరకు చెల్లిస్తారు.


ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, కాక్రాపర్‌ గుజరాత్‌ సైట్, అనుమల–394651, టీఏ.వ్యారా, జిల్లా. తపి, గుజరాత్‌ చిరునామాకు పంపించాలి.


దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.npcilcareers.co.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

బీఈసీఐఎల్‌లో 103 ఉద్యోగాలు

ప్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌యింది. ఆస‌క్తి, అర్హ‌త‌ క‌లిగినవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఈనెల 30 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 103 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో సూప‌ర్‌వైజ‌ర్‌, సీనియ‌ర్ సూప‌ర్‌వైజ‌ర్‌, హ్యాండీమ్యాన్ లేదా లోడ‌ర్ పోస్టులు ఉన్నాయి. అభ్య‌ర్థుల‌ను రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌చేస్తారు.

మొత్తం పోస్టులు: 103

ఇందులో సూప‌ర్‌వైజ‌ర్ 26, సీనియ‌ర్ సూప‌ర్‌వైజ‌ర్ 4, లోడ‌ర్ 73 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: లోడ‌ర్ పోస్టుల‌కు 8వ త‌ర‌గ‌తి పాసై, స్థానిక భాష‌, హిందీ మాట్లాడ‌టం, రాయ‌డం వచ్చి ఉండాలి. మిగిలిన పోస్టుల‌కు డిగ్రీ పూర్తిచేయాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

అప్లికేష‌న్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యూఎస్‌, పీహెచ్ అభ్య‌ర్థుల‌కు రూ.450

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూన్ 30

వెబ్‌సైట్‌: www.becil.com, https://becilregistration.com


-----------------------------------------------------------------------------------------------------------------------------

ఏఎస్సీ సెంటర్‌(సౌత్‌)–2 ఏటీసీలో 100 ఉద్యోగాలు



మొత్తం పోస్టుల సంఖ్య: 100

పోస్టుల వివరాలు: సివిల్‌ మోటార్‌ డ్రైవర్‌–42, క్లీనర్‌–40, కుక్‌–15, సివిలియన్‌ కేటరింగ్‌ ఇన్‌స్పెక్టర్‌–03.

అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడులో ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్‌/డిప్లొమా అర్హత ఉండాలి. అనుభవం తప్పనిసరి.

వయసు: 18–25ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/ఫిజికల్‌/ప్రాక్టికల్‌/టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.


పరీక్షా విధానం: మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఇందులో 25 మార్కులకు జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, 50 మార్కులకు జన రల్‌ అవేర్‌నెస్, 50 మార్కులకు జనరల్‌ ఇంగ్లిష్, 25 మార్కులకు న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా సమయం 2 గంటలు.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిసైడింగ్‌ ఆఫీసర్, సివిలియన్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్, సీహెచ్‌క్యూ, ఏఎస్సీ సెంటర్‌(సౌత్‌)–ఏటీసీ, అగ్రాం,బెంగళూరు చిరునామాకు పంపించాలి.


దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.indianarmy.nic.in/home

No comments:

Post a Comment