Saturday, 26 June 2021

ఎన్‌సీపీఓఆర్‌లో 85 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, టాటా మెమోరియల్‌ సెంటర్‌లో 64 ఉద్యోగాలు, హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో 53 మేనేజర్‌, ఆఫీసర్‌ ఉద్యోగాలు, నరోరా అటామిక్‌ పవర్‌ స్టేషన్‌లో 50 అప్రెంటిస్ ఖాళీలు, పవర్‌గ్రిడ్‌లో 35 డిప్లొమా ట్రెయినీ ఉద్యోగాలు.

ఎన్‌సీపీఓఆర్‌లో 85 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు


మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలోని స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తిహోదా క‌లిగిన సంస్థ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ పోలార్ అండ్ ఓషియ‌న్ రిసెర్చ్ (ఎన్‌సీపీఓఆర్‌) ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 85 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్‌, ఆఫీస‌ర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాత‌ప‌రీక్ష లేకుండా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేయ‌నుంది. ఎంపికైనవారు గోవాలో ప‌నిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 85

ఇందులో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌-I- 42, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌-II – 21, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌-III – 3, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 4, ఆఫీస‌ర్ 5, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. మెరెయిన్ సైన్స్‌, మైక్రోబ‌యాల‌జీలో బీఈ లేదా బీటెక్ చేయాల్సి ఉంది.

ఎంపిక ప్ర‌క్రియ‌: ఇంట‌ర్వ్యూ ద్వారా. ద‌ర‌ఖాస్తుల ఆధారంగా ఎంపిక‌చేసిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూకి ఆహ్వానిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూలై 15

వెబ్‌సైట్‌: website www.ncpor.res.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

టాటా మెమోరియల్‌ సెంటర్‌లో 64 ఉద్యోగాలు


మొత్తం పోస్టుల సంఖ్య: 64

విభాగాలు: బయో కెమిస్ట్రీ, ఆంకాలజీ, హెమటోపాథాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్, పాథాలజీ, మైక్రోబయాలజీ, రేడియేషన్‌ ఆంకాలజీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, ఎండీ/డీఎన్‌బీ/పీజీ, ఎండీఎస్, ఎంఎస్‌/ఎంసీహెచ్‌ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 45ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఆయా కేటగిరీని అనుసరించి 3 నుంచి 10ఏళ్ల వరకూ వయసులో సడలింపు లభిస్తుంది.

వేతనం: మెడికల్‌ ఆఫీసర్లకు నెలకు రూ.84,000; ఫెలోకు నెలకు రూ.89,000; సీనియర్‌ రెసిడెంట్లకు నెలకు రూ.1,01,000 వరకు చెల్లిస్తారు.


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ్య ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://tmc.gov.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో 53 మేనేజర్‌, ఆఫీసర్‌ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 53 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మేనేజర్‌, ఆఫీసర్‌, కన్సల్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్‌ విధానంలో, శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్టులు: 53

ఇందులో జనరల్‌ మేనేజర్‌ 1, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ 1, డీజీఎం 3, సీనియర్‌ మేనేజర్‌ 4, మేనేజన్‌ 8, డిప్యూటీ మేనేజర్‌ 1 (శాశ్వత ప్రాతిపదికన), డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ 2, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ 1, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ 28 (ఎఫ్‌టీసీ), సీనియర్‌ కన్సల్టెంట్ 3, కన్సల్టెంట్‌ 1 (ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ బేసిస్‌) చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: సంబంధిత డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం తప్పనిసరి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు: రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజులేదు.

దరఖాస్తులకు చివరితేదీ: శాశ్వత పోస్టులకు జూలై 20, ఎఫ్‌టీసీ పోస్టులకు ఆగస్టు 10, కాంట్రాక్ట్‌ పోస్టులకు ఆగస్టు: 30

వెబ్‌సైట్‌: https://www.hslvizag.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

నరోరా అటామిక్‌ పవర్‌ స్టేషన్‌లో 50 అప్రెంటిస్ ఖాళీలు


మొత్తం ఖాళీల సంఖ్య: 50

ట్రేడుల వారీగా ఖాళీలు: ఫిట్టర్‌–20, ఎలక్ట్రీషియన్‌–13, ఎలక్ట్రానిక్స్‌–12, మెషినిస్ట్‌–05.

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయసు: 07.07.2021 నాటికి 14–24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.


ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఒకవేళ ఐటీఐ మా ర్కులు ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఉంటే.. వారి వయసును ప్రామాణికంగా తీసుకుంటారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్‌( హెచ్‌ఆర్‌ఎం), నరోరా అటామిక్‌ పవర్‌ స్టేషన్, ప్లాంట్‌ సైట్, నరోరా,బులందసహార్‌–203389(ఉత్తరప్రదేశ్‌) చిరునామాకు పంపించాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.07.2021

దరఖాస్తు హార్ట్‌కాపీలను పంపడానికి చివరి తేది: 21.07.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.npcil.nic.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

పవర్‌గ్రిడ్‌లో 35 డిప్లొమా ట్రెయినీ ఉద్యోగాలు


మొత్తం పోస్టుల సంఖ్య: 35;

సబ్జెక్టులు: ఎలక్ట్రికల్, సివిల్‌. డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్‌)–30, డిప్లొమా ట్రెయినీ(సివిల్‌)–05.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.06.2021


పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.powergrid.in


No comments:

Post a Comment