Saturday, 26 June 2021

ఇఫ్కోలో 28 డిప్లొమా అప్రెంటిస్‌లు, సీ-మెట్‌, హైదరాబాద్‌లో 25 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు, ఎస్‌బీఐలో 16 ఫైర్ ఇంజినీర్లు ఉద్యోగాలు, డిజిటల్ ఇండియా కార్పొరేష‌న్‌లో 16 ఉద్యోగాలు, ఎన్‌హెచ్‌పీసీలో 11 అప్రెంటిస్‌లు.

ఇఫ్కోలో 28 డిప్లొమా అప్రెంటిస్‌లు

ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫెర్టిలైజర్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌ (ఐఎఫ్‌ఎఫ్‌సీఓ-ఇఫ్కో) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చేనెల 31 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు ఉత్తరప్రదేశ్‌లోని ఔన్లా యూనిట్‌లో పనిచేయాలి.

మొత్తం ఖాళీలు: 28

ఇందులో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 6, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ 4, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ 3, సివిల్‌ ఇంజినీరింగ్‌ 2, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ కంట్రోల్ ఇంజినీరింగ్‌ 2, కెమికల్ ఇంజినీరింగ్‌ 6, సెక్రటేరియల్‌ ప్రాక్టీస్‌ 5 చొప్పున ఉన్నాయి.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్‌ లేదా టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణులవాలి. అభ్యర్థులు 18 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31

వెబ్‌సైట్‌: www.mhrdnats.gov.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

సీ-మెట్‌, హైదరాబాద్‌లో 25 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు


భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ (సీ-మెట్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


వివరాలు..


* మొత్తం ఖాళీలు: 25


పోస్టులు: సీనియర్‌ ఇన్‌ఛార్జ్‌, షిప్ట్‌ ఇన్‌ఛార్జ్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ స్టాఫ్, జూనియర్‌ ప్రాజెక్ట్‌ స్టాఫ్‌, ఎలక్ట్రీషియన్‌,  హెల్పర్‌, సీనియర్‌ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీర్‌, ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీర్‌, ఇనుస్ట్రుమెంటేషన్ స్టాఫ్‌, జూనియర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌, అనలిస్ట్‌, జూనియర్‌ ఆఫీస్‌ స్టాఫ్‌.


అర్హత: పోస్టుని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బీఈ/  బీటెక్‌, బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.


వయసు: పోస్టుల్ని అనుసరించి 32 ఏళ్లు, 35 ఏళ్లు మించకుండా ఉండాలి.


జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.13000 నుంచి రూ.30000 వరకు చెల్లిస్తారు.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తుకు చివరి తేది: 14.07.2021


చిరునామా: Director, Centre for Materials for Electronics Technology (C-MET), IDA Phase-III, HCL (PO), Cherlapally, Hyderabad – 500 051.

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఎస్‌బీఐలో 16 ఫైర్ ఇంజినీర్లు ఉద్యోగాలు


 దేశంలోని అగ్ర‌గామి బ్యాంకుల్లో ఒక‌టైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫైర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగినవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఎలాంటి రాత‌ప‌రీక్ష లేకుండా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తున్న‌ది. గ‌తంలో అప్ల‌య్ చేసుకున్న‌వారు మ‌రోమారు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని వెల్ల‌డించింది.

మొత్తం పోస్టులు: 16

అర్హ‌త‌లు: నేష‌న‌ల్ ఫైర్ స‌ర్వీస్ కాలేజీ నుంచి బీఈ (ఫైర్‌) లేదా బీటెక్‌, బీఈలో సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్‌, ఫైర్ టెక్నాల‌జీ అండ్ సేఫ్టీ ఇంజినీరింగ్‌, బీఎస్సీ ఫైర్ కోర్సుల్లో ఏదో ఒక‌టి చేసి ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ద‌ర‌ఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూల‌కు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కుల‌కు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

అప్లికేష‌న్ ఫీజు: రూ.750

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: జూన్‌ 15

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూన్ 28

వెబ్‌సైట్‌: sbi.co.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

డిజిటల్ ఇండియా కార్పొరేష‌న్‌లో 16 ఉద్యోగాలు


భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్ (డీఐసీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.


వివ‌రాలు..


* మొత్తం ఖాళీలు: 16


1) సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్: 03


విభాగాలు: పీహెచ్‌పీ, అన‌లిటిక్స్‌, మొబైల్‌.


అర్హ‌త‌: బీఈ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.


జీత‌భ‌త్యాలు: నెల‌కి రూ.1,20,000 చెల్లిస్తారు. 


2) డెవ‌ల‌ప‌ర్‌: 06


విభాగాలు: పీహెచ్‌పీ, మొబైల్‌, వెబ్‌-ఎస్ఈఓ అండ్ డిజిటల్ మార్కెటింగ్‌, వెబ్ సెక్యూరిటీ.


అర్హ‌త‌: బీఈ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.


జీత‌భ‌త్యాలు: నెల‌కి రూ.60,000 చెల్లిస్తారు. 


3) డిజైన‌ర్‌: 02


విభాగాలు: వెబ్‌/ యూఐ, గ్రాఫిక్స్‌.


అర్హ‌త‌: బ్యాచిల‌ర్ డిగ్రీతో పాటు గ్రాఫిక్ డిజైనింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.


జీత‌భ‌త్యాలు: నెల‌కి రూ.60000 చెల్లిస్తారు. 


4) సాఫ్ట్‌వేర్ టెస్టర్ క‌మ్ డెవ‌ల‌ప‌ర్: 02


అర్హ‌త‌: బీఈ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.


జీత‌భ‌త్యాలు: నెల‌కి రూ.60000 చెల్లిస్తారు. 


5) సిస్టం అడ్మినిస్ట్రేట‌ర్ (క్లౌడ్ స‌ర్వీస్ మేనేజ్‌మెంట్‌): 01


అర్హ‌త‌: బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.


జీత‌భ‌త్యాలు: నెల‌కి రూ.60000 చెల్లిస్తారు. 


6) కంటెంట్ మేనేజ‌ర్/ రైట‌ర్‌: 02


అర్హ‌త‌: బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.


జీత‌భ‌త్యాలు: నెల‌కి రూ.50,000 చెల్లిస్తారు.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ (విద్యార్హ‌త‌లు, వ‌య‌సు, అక‌డ‌మిక్ రికార్డ్‌, అనుభ‌వం), ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.


ఈమెయిల్‌: dicadmin-hr@digitalindia.gov.in


ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 01.07.2021.


చిరునామా: Shri R.A. Dhawan, Sr. General Manager (Admin. /HR), Digital India Corporation, Electronics Niketan Annexe, 6 CGO Complex Lodhi Road, New Delhi – 110003.

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్‌హెచ్‌పీసీలో 11 అప్రెంటిస్‌లు


నేష‌న‌ల్ హైడ్రో ప‌వ‌ర్ కంపనీ (ఎన్‌హెచ్‌పీసీ) లిమిటెడ్ ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ది. అస‌క్తి, అర్హ‌త క‌లిగిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేనెల 15 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది.

మొత్తం పోస్టులు: 11

ఇందులో ఎల‌క్ట్రిష‌న్ 5, ప్లంబ‌ర్ 1, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 3, స్టెనోగ్రాఫ‌ర్ అండ్ సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: ప‌దో త‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణుల‌వాల్సి ఉంటుంది.

ఎంపిక ప్ర‌క్రియ‌: మెరిట్ ఆధారంగా. ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. నిర్ణీత న‌మూనాలో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను పూర్తిగా నింపి ఈ-మెయిల్ చేయాలి.

ఈ-మెయిల్‌: nbpshr@nhpc.nic.in

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూలై 15

వెబ్‌సైట్‌: http://www.nhpcindia.com


No comments:

Post a Comment