Saturday, 12 June 2021

యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామ్‌ 2021 నోటిఫికేష‌న్ 400 ఉద్యోగాలు, ఇండియ‌న్ కోస్ట్ గార్డులో 350 ఉద్యోగాలు, నిమ్‌హాన్స్‌లో 275 నర్సింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల నోటిఫికేష‌న్.

యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామ్‌ 2021 నోటిఫికేష‌న్ 400 ఉద్యోగాలు

ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామ్‌(2), 2021..

మొత్తం ఖాళీల సంఖ్య: 400

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(ఎన్‌డీఏ): 370(ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్‌ఫోర్స్‌ 120)

నేవల్‌ అకాడెమీ(ఎన్‌ఏ): 30(10+2 కేడెట్‌ ఎంట్రీ స్కీమ్‌)

అర్హత: ఆర్మీ విభాగం పోస్టులకు ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణత ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవల్‌ వింగ్స్‌ పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్మీడియెట్‌ ఫైనల్‌ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.

వ‌యసు: 2003 జనవరి 2 నుంచి 2006 జనవరి 1వ తేదీ మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వూ, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.06.2021

పరీక్ష తేది: 05.09.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఇండియ‌న్ కోస్ట్ గార్డులో 350 ఉద్యోగాలు


భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ ఇండియ‌న్ కోస్ట్ గార్డు, ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల్లో.. నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ), నావిక్‌(డొమెస్టిక్ బ్రాంచ్‌), యాంత్రిక్ 01/2022 బ్యాచ్‌ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 350

పోస్టులు-ఖాళీలు: 

1) నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ): 260

2) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌): 50

3) యాంత్రిక్ (మెకానిక‌ల్‌): 20

4) యాంత్రిక్ (ఎల‌క్ట్రిక‌ల్‌): 13

5) యాంత్రిక్ (ఎల‌క్ట్రానిక్స్‌): 07

అర్హ‌త‌, వ‌య‌సు:

1) నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ):  మ్యాథ్స్‌, ఫిజిక్స్ సబ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 18-22 ఏళ్ల మ‌ధ్య‌ ఉండాలి. 01 ఫిబ్ర‌వ‌రి 2000 - 31 జ‌న‌వ‌రి 2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

2) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌): గుర్తింపు పొందిన ఎడ్యుకేష‌న్ బోర్డుల నుండి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.

వ‌యసు: 18-22 ఏళ్ల మ‌ధ్య‌ ఉండాలి. 01 ఏప్రిల్‌ 2000 - 31 మార్చి 2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. 

3) యాంత్రిక్‌: గుర్తింపు పొందిన ఎడ్యుకేష‌న్ బోర్డుల నుండి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌తతో పాటు ఎల‌క్ట్రిక‌ల్‌/  మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్(రేడియో/ ప‌వ‌ర్‌) ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 18-22 ఏళ్ల మ‌ధ్య‌ ఉండాలి. 01 ఫిబ్ర‌వ‌రి 2000 - 31 జ‌న‌వ‌రి 2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

* ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం: దీనికి ఎంపిక విధానం వివిధ ద‌శ‌ల్లో ఉంటుంది. స్టేజ్ 1, 2, 3, 4 ద్వారా ఎంపిక ప్ర‌క్రియ‌ నిర్వ‌హిస్తారు.

* మొద‌టి ద‌శ‌(స్టేజ్-1‌):  స్టేజ్‌-1లో రాత‌ప‌రీక్ష ఉంటుంది. ఇందులో సెక్ష‌న్‌-1, 2, 3, 4, 5 ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. సంబంధిత పోస్టుల‌కు ఏ సెక్ష‌న్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు, దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణ‌త మార్కులు, సంబంధిత స‌బ్జెక్టుల సిల‌బ‌స్‌, ప‌రీక్షా స‌మ‌యం, వ‌చ్చే ప్ర‌శ్న‌ల‌ గురించి ప్ర‌క‌ట‌న‌లో స‌వివ‌రంగా ఇచ్చారు.

* రెండో ద‌శ‌(స్టేజ్‌-2):  మొద‌టి ద‌శ‌లో నిర్వ‌హించిన కంప్యూట‌ర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌లో ప్ర‌తిభ ఆధారంగా మెరిట్ జాబితా త‌యారు చేస్తారు. దీని ప్ర‌కారం స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. ఇందులో ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, రీ అసెస్‌మెంట్ టెస్ట్‌, తొలి మెడిక‌ల్ టెస్ట్ ఉంటాయి.

* మూడో ద‌శ (స్టేజ్‌-3): స్టేజ్‌-1, స్టేజ్‌-2లో ప్ర‌తిభ ఆధారంగా స్టేజ్‌-3కి ఎంపిక చేస్తారు. స్టేజ్‌-3లో డ్యాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌, ఫైన‌ల్ మెడిక‌ల్ టెస్ట్‌, ఒరిజిన‌ల్ డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, పోలీస్ వెరిఫికేష‌న్ ఉంటాయి.

* నాలుగో ద‌శ (స్టేజ్‌-4):  ఇందులో వివిధ ఎడ్యుకేష‌న్ బోర్డ్‌లు/ యూనివ‌ర్సిటీలు/ రాష్ట్ర‌ప్ర‌భుత్వం నుంచి పొందిన ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లు ఇండియ‌న్ కోస్టు గార్డ్ ముందు ఉంచాలి. స‌ర్టిఫికెట్లు ఒక‌వేళ కచ్చితంగా(జ‌న్యూన్‌) లేక‌పోతే ట‌ర్మినేట్ చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రుల‌కు రూ.250 (ఎస్సీ/ ఎస్టీల‌కు ఫీజు లేదు)

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 02.07.2021.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 16.07.2021

-----------------------------------------------------------------------------------------------------------------------------

నిమ్‌హాన్స్‌లో 275 నర్సింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల నోటిఫికేష‌న్


ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్ అండ్‌ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు ఈ నెల 28 వరకు అందుబాటులో ఉంటాయి. ఎంపికైనవారు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 275

ఇందులో నర్సింగ్‌ ఆఫీసర్‌ 266, స్పీచ్‌ థెరపిస్ట్‌ అండ్‌ ఆడియాలజిస్ట్‌ 3, సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్ ‌(న్యూరోమస్‌క్యులార్‌) 1, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్ 2, ఎంఆర్‌ చిల్డ్రన్ టీచర్‌ ‌(క్లినికల్‌ సైకాలజీ) 1, అసిస్టెంట్‌ డైటీషియన్ 1,

కంప్యూటర్‌ ప్రోగ్రామర్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హత‌లు: బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్, బీఎస్సీ (నర్సింగ్‌), స్పీచ్‌ పాథాలజీ, ఆడియాలజీ సబ్జెక్టుల్లో పీజీ, మెడికల్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లొమా, పోస్ట్‌ ఎండీ, ఎంబీబీఎస్‌, సైకాలజీ సబ్జెక్టుతో బీఏ, బీఎస్సీ, సైన్స్‌లో బీఎస్సీ డిగ్రీతోపాటు డైటిక్స్‌లో డిప్లొమా, లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్టుల్లో పీజీలో ఏదో ఒకటి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు పంపించాలి.

అడ్రస్‌: డైరెక్టర్, నిమ్‌హాన్స్, పోస్ట్‌ బాక్స్‌ నం. 2900, హోసూర్‌ రోడ్, బెంగళూరు 560029

దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 28

వెబ్‌సైట్‌: www.nimhans.ac.in


No comments:

Post a Comment