ఆర్మీలో 100 ఉమెన్ మిలిటరీ పోలీసు ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 100
* జనరల్ డ్యూటీ(ఉమెన్ మిలిటరీ పోలీస్)
అర్హత: 10వ తరగతి/ మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.
వయసు: 21 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక విధానం: కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చివరి తేది: 20.07.2021.
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్ఎండీసీలో 89 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
దేశంలో అగ్రశ్రేణి ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన ఎన్ఎండీసీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 22 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 89 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎగ్జిక్యూటివ్ గ్రేడ్, సూపర్వైజరీ గ్రేడ్, నాన్-ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులను జార్ఖండ్‌లోని టొకిసుడ్ నార్త్ కోల్‌మైన్‌లో నియమిస్తారు.
మొత్తం పోస్టులు: 89
ఇందులో మైన్ సిర్దార్ 38, మైన్ ఓవర్‌మ్యాన్ 25, మైనింగ్ ఇంజినీర్ 12, మెకానికల్ ఓవర్‌మ్యాన్ 4, ఎలక్ట్రికల్ ఓవర్‌మ్యాన్ 4, సర్వేయర్ 2, కొల్లిరి ఇంజినీర్ 2, లియాసొనింగ్ ఆఫీసర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఇంజినీరింగ్‌లో మెకానికల్, మైనింగ్ మెషినరీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మైనింగ్ ఇంజినీరింగ్‌లలో ఏదో ఒకటి చేసి ఉండాలి. మైనింగ్ సిర్దార్ పోస్టుకు పదో తరగతి పాసై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 22
వెబ్సైట్: www.nmdc.co.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్ఎల్సీఐఎల్లో 65 ఆపరేటర్ పోస్టులు
ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ లిగ్నైట్ అండ్ కోల్ ఇండియా లిమిటెడ్ (NLCIL) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 65 ఎస్ఎంఈ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 14 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారు తమిళనాడులోని నైవేలీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 65
ఇందులో జనరల్ 30, ఎస్సీ 12, ఓబీసీ 17, ఈడబ్ల్యూఎస్ 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి, ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ మెకానికల్, ఎలక్రికల్ ట్రేడ్లలో ఏదో ఒకటి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా. ఎంపిక చేసిన అభ్యర్థులను ప్రాక్టికల్ టెస్ట్‌కు ఆహ్వానిస్తారు. ఈ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 14
వెబ్సైట్: https://www.nlcindia.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 46 ఉద్యోగాలు
ప్రభుత్వరంగ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రొడక్షన్, మెకానికల్, సివిల్, మైనింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెటీరియల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రిసోర్స్, కంపెనీ సెక్రెటరీ, రాజ్‌భాష అధికారి, లీగల్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు తాండూర్, బొకజాన్, రాజ్బన్, కర్పొరేట్ ఆఫీస్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. వీరిని ఏడాది కాలపరిమితికే తీసుకోనున్నప్పటికీ.. మూడేండ్ల వరకు పొడిగించే అవకాశం ఉన్నది.
మొత్తం పోస్టులు: 46
ఇందులో ఇంజినీర్ 29, ఆఫీసర్ 17 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్, డీగ్రీ, పీజీ చేయాలి. అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్: http://www.cciltd.in/
-----------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో 42 జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగాలు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని నేషనల్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) ఇన్ మెడికల్ సైన్సెస్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 42
ఇందులో సీనియర్ అసిస్టెంట్ 8, జూనియర్ అసిస్టెంట్ 30, జూనియర్ అకౌంటెంట్ 4 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎన్బీఈ నిర్వహించే పరీక్షలో అర్హత సాధించాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ బేసిక్ సాఫ్ట్వేర్ (విండోస్/ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టం/ల్యాన్)పై అవగాహన ఉండాలి. అభ్యర్థులు 27 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ద్వారా
పరీక్షా విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
అప్లికేషన్ ఫీజు: రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులు ప్రారంభం: జూలై 15
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 14
సీబీటీ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 20
వెబ్సైట్: www.natboard.edu.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
పవర్‌గ్రిడ్‌లో 35 డిప్లొమా ట్రెయినీలు
భారత ప్రభుత్వరంగానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక పరిధిలోని సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* డిప్లొమా ట్రెయినీ
* మొత్తం ఖాళీలు: 35
సబ్జెక్టులు: ఎలక్ట్రికల్, సివిల్
1) డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్): 30
2) డిప్లొమా ట్రెయినీ (సివిల్): 05
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.06.2021.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 29.06.2021.
No comments:
Post a Comment