Saturday, 12 June 2021

తెలంగాణ పోలీస్ విభాగం-భ‌రోసా సొసైటీలో 3 ఉద్యోగాలు, శ్రీ కొండా లక్ష్మణ్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీలో 7 వివిధ ఉద్యోగాలు

 తెలంగాణ పోలీస్ విభాగం-భ‌రోసా సొసైటీలో 3 ఉద్యోగాలు

తెలంగాణ ప్ర‌భుత్వ పోలీస్ విభాగానికి చెందిన భరోసా సొసైటీ ఫ‌ర్ ప్రొటెక్ష‌న్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్ర‌న్ సంగారెడ్డి, వికారాబాద్‌, సూర్యాపేట్‌, వ‌రంగ‌ల్ జిల్లాల్లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింద పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

1) వ‌రంగ‌ల్‌: 01

పోస్టు: లీగ‌ల్ స‌పోర్ట్ ఆఫీస‌ర్‌

అర్హ‌త‌: ఎల్ఎల్‌బీ/ ఎల్ఎల్ఎం ఉత్తీర్ణ‌త‌తో పాటు రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 35-55 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కి రూ.22,000 చెల్లిస్తారు.

2) వికారాబాద్‌: 02

పోస్టులు: స‌పోర్ట్ ప‌ర్స‌న్‌, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ క‌మ్ అకౌంటెంట్‌.

అర్హ‌త‌: ఎంఏ సైకాల‌జీ/ ఎంఎస్‌డ‌బ్ల్యూ, టాలీతో డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్‌తో పాటు రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: స‌పోర్ట్ ప‌ర్స‌న్ 22-35 ఏళ్ల మ‌ధ్య‌, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ క‌మ్ అకౌంటెంట్ 20-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

జీత‌భ‌త్యాలు: స‌పోర్ట్ ప‌ర్స‌న్‌-నెల‌కి రూ.18000, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ క‌మ్ అకౌంటెంట్-నెల‌కి రూ.15000 చెల్లిస్తారు.

3) సూర్యాపేట్‌: 06

పోస్టులు: సెంట‌ర్ కోఆర్డినేట‌ర్ క‌మ్ సైకాల‌జిస్ట్‌, స‌పోర్ట్ ప‌ర్స‌న్‌, లీగ‌ల్ స‌పోర్ట్ ఆఫీస‌ర్‌, మల్టీప‌ర్ప‌స్ హెల్త్ వ‌ర్క‌ర్ ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ క‌మ్ అకౌంటెంట్‌, రిసెప్ష‌నిస్ట్‌.

అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్, డిగ్రీ, బీఎస్సీ(న‌ర్సింగ్‌), ఎల్ఎల్‌బీ/ఎల్ఎల్ఎం, ఎంఎస్‌/ ఎంఎస్‌డ‌బ్ల్యూ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌.

4) సంగారెడ్డి: 01

పోస్టులు: లీగ‌ల్ స‌పోర్ట్ ఆఫీస‌ర్‌

అర్హ‌త‌: ఎల్ఎల్‌బీ/ ఎల్ఎల్ఎం ఉత్తీర్ణ‌త‌తో పాటు రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 35-55 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కి రూ.22,000 చెల్లిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 28.06.2021.

చిరునామా: సంబంధిత జిల్లాల సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాల‌యాలకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

-----------------------------------------------------------------------------------------------------------------------------

శ్రీ కొండా లక్ష్మణ్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీలో వివిధ ఉద్యోగాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 07

పోస్టుల వివరాలు: ఫామ్‌ మేనేజర్‌–01, ల్యాబ్‌ అసిస్టెంట్‌–01, స్టెనోగ్రాఫర్‌–01, డ్రైవర్‌–02, అటెండర్‌–02.

ఫామ్‌ మేనేజర్‌: బ్యాచిలర్‌ డిగ్రీ(హార్టికల్చర్‌/అగ్రికల్చర్‌) ఉత్తీర్ణులవ్వాలి.

వేతనం: నెలకు రూ.34,800 వరకు చెల్లిస్తారు.

ల్యాబ్‌ అసిస్టెంట్‌: బ్యాచిలర్‌ డిగ్రీ(హార్టికల్చర్‌/అగ్రికల్చర్‌) ఉత్తీర్ణులవ్వాలి.

వేతనం: నెలకు రూ.34,800 వరకు చెల్లిస్తారు.

స్టెనోగ్రాఫర్‌: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

వేతనం: నెలకు రూ.20,200 వరకు చెల్లిస్తారు.

డ్రైవర్లు: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.

వేతనం: నెలకు రూ.20,200 వరకు చెల్లిస్తారు.

అటెండర్‌: ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.

వేతనం నెలకు రూ.20,200 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.06.2021

పూర్తి వివరాల‌కు వెబ్‌సైట్‌: www.skltshu.ac.in

No comments:

Post a Comment