Sunday, 13 June 2021

ఎన్ఎండీసీలో 80 ఇంజినీర్‌ పోస్టులు, ఇండియ‌న్ నేవీలో 50 ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్లు ఉద్యోగాలు, ఈసీఐఎల్‌లో 20 ప్రాజెక్ట్, అసిస్టెంట్‌ ఇంజినీర్లు ఉద్యోగాలు, ఎన్ఐడ‌బ్ల్యూఈలో 6 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.

ఎన్ఎండీసీలో 80 ఇంజినీర్‌ పోస్టులు


ప్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ అప్లికేష‌న్లు జూన్ 22 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 80 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఇందులో ఎగ్జిక్యూటివ్, సూప‌ర్‌వైజ‌ర్‌, ఎన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన‌వారిని మూడేండ్ల కాల‌ప‌రిమితిగాను నియ‌మిస్తారు.
మొత్తం పోస్టులు: 80
ఇందులో కొల్లియెరి ఇంజినీర్ 2, లిస‌నింగ్ ఆఫీస‌ర్ 2, మైనింగ్ ఇంజినీర్ 12, స‌ర్వేయ‌ర్ 2, ఎల‌క్ట్రిక‌ల్ ఓవ‌ర్‌మ్యాన్ 4, మైన్ వోవ‌ర్‌మ్యాన్ 24, మెకానిక‌ల్ ఓవ‌ర్‌మ్యాన్ 4, మైన్ సిర్దార్ 38 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హ‌త‌లు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. సంబంధిత రంగంలో అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూన్ 22
వెబ్‌సైట్‌: www.nmdc.co.in





-----------------------------------------------------------------------------------------------------------------------------

ఇండియ‌న్ నేవీలో 50 ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్లు  ఉద్యోగాలు

ఇండియ‌న్ నేవీ.. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి అవివాహిత పురుషుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

వివ‌రాలు..

* మొత్తం పోస్టుల సంఖ్య‌: 50

1) ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌ (ఎస్ఎస్‌సీ): 50 పోస్టులు

* ఎస్ఎస్‌సీ జ‌న‌ర‌ల్ స‌ర్వీస్ (జీఎస్‌/ ఎక్స్‌): 47

* హైడ్రో కేడ‌ర్‌: 03

కోర్సు ప్రారంభం: జ‌న‌వ‌రి 2022 (ఎస్‌టీ 22).

శిక్ష‌ణ కేంద్రం: ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ (ఐఎన్ఏ), ఎజిమ‌ళ‌, కేర‌ళ‌.

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

ఎంపిక విధానం: కోవిడ్‌-19 కార‌ణంగా ఇండియ‌న్ నేవీ ఎంట్ర‌న్స్ టెస్ట్ నిర్వ‌హించ‌కుండా అక‌డ‌మిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌కు ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 12.06.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 26.06.2021.

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఈసీఐఎల్‌లో 20 ప్రాజెక్ట్, అసిస్టెంట్‌ ఇంజినీర్లు ఉద్యోగాలు


 ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరింది. ఈ పోస్టులు ఈసీఈ, ఈఈఈ, ఈఐఈ, మెకానికల్ విభాగాల్లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 20
ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్లు 12, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత‌: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ క్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ క్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ డిప్లొమా చేసి ఉండాలి. సంబంధిత రంగంలో మూడేండ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
అభ్యర్థులు 30 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంట‌ర్వ్యూ ద్వారా

ఇంటర్వ్యూ ప్రదేశం: ECIL Regional Office,
H.No. 47-09-28,
Mukund Suvasa Apartments,
3rdLane Dwaraka Nagar,
Visakhapatnam, AP-530016
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 16
వెబ్‌సైట్‌: www.ecil.co.in
-----------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్ఐడ‌బ్ల్యూఈలో 6 ప్రాజెక్ట్ స్టాఫ్  ఉద్యోగాలు


భార‌త ప్ర‌భుత్వ నూత‌న‌, పున‌రుత్పాద‌క వ‌న‌రుల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన చెన్నైలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎన‌ర్జీ (ఎన్ఐడ‌బ్ల్యూఈ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 06

1) ప్రాజెక్ట్ అసిస్టెంట్ (గ్రేడ్‌-1, 2): 03

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

జీత‌భ‌త్యాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్‌-1 పోస్టుల‌కి నెల‌కి రూ.20,000  ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్‌-2 పోస్టుల‌కి నెల‌కి రూ.30,000 చెల్లిస్తారు.

2) ప్రాజెక్ట్ ఇంజినీర్‌: 03

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

ఎంపిక విధానం: టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 13.06.2021.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 03.07.2021

No comments:

Post a Comment