Sunday, 13 June 2021

మజగాన్‌ డాక్‌ షిప్‌యార్డ్‌లో 1388 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు, న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో 121 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు, ఐఎల్‌బీఎస్‌లో 90 టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు.

మజగాన్‌ డాక్‌ షిప్‌యార్డ్‌లో 1388 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు

మజగాన్‌ డాక్‌ షిప్‌యార్డ్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 4 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నెటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1388 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులైన ఏసీ మెకానిక్‌, కంప్రెషర్‌ అటెండెంట్‌, చిప్పర్‌ గ్రైండర్‌, కాంపోసిట్‌ వెల్డర్‌, జూనియర్‌ డ్రాట్స్‌మ్యాన్‌, ఫిట్టర్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 1388
ఇందులో ఏసీ, రిఫ్రిజిరేటర్‌ మెకానిక్‌ 5, కంప్రెషర్‌ అటెండెంట్‌ 5, కార్పెంటర్‌ 81, చిప్పర్‌ గ్రైండర్ 13‌, కాంపోసిట్‌ వెల్డర్ 132‌, డీజిల్ క్రేన్‌ ఆపరేటర్‌ 5, డీజిల్ కమ్‌ మోటార్‌ మెకానిక్‌ 4, జూనియర్‌ డ్రాట్స్‌మ్యాన్ 54‌, ఎలక్ట్రిషియన్‌ 204, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ 55, ఫిట్టర్‌ 119, జూనియర్‌ క్యూసీ ఇన్‌స్పెక్టర్‌ 13, గ్యాస్‌ కట్టర్‌ 38, మెషినిస్ట్‌ 28, మిల్‌వ్రైట్‌ మెకానిక్‌ 10, పెయింటర్‌ 100, పైప్‌ ఫిట్టర్‌ 140, రిగ్గర్‌ 88, స్ట్రక్చురల్‌ ఫ్యాబ్రికేటర్‌ 125, స్టోర్‌ కీపర్‌ 10, యుటిలిటీ హ్యాండ్‌ 14, ప్లానర్‌ ఎస్టిమేటర్‌ 8, పారామెడిక్స్‌ 2, యుటిలిటీ హ్యాండ్‌ 135 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. కనీసం 8 నుంచి 10 తరగతి వరకు చదివి ఉండాలి. సంబంధిత అంశంలో సర్టిఫికెట్‌ తప్పనిసరి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతీపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 4
వెబ్‌సైట్‌: https://mazagondock.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో 121 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు


 కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌)లో ట్రేడ్‌ అప్రెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులు వచ్చేనెల 15 లోపు పంపిచాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ విభాగాల్లోని 121 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఎంపికైనవారు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 121
ఇందులో ఎలక్ట్రిషన్‌ 32, ఫిట్టర్‌ 32, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ 12, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ 12, పాసా, వెల్డర్‌, టర్నర్‌ 7 చొప్పున, మెషినిస్ట్‌ 6, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ మెకానిక్‌ 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. 14 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్‌: Nuclear Power Corporation of India Limited, Anumala-394651, Ta. Vyara, Dist. Tapi, Gujarat
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 15
వెబ్‌సైట్‌: https://www.npcil.nic.in/

-----------------------------------------------------------------------------------------------------------------------------
ఐఎల్‌బీఎస్‌లో 90 టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు


న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ అండ్ బిలియ‌రీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది ఫ్యాక‌ల్టీ, నాన్ ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 90

1) టీచింగ్ పోస్టులు: 26

పోస్టులు: ప్రొఫెస‌ర్‌, అడిష‌న‌ల్ ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌.

విభాగాలు: అనెస్తీషియా, నెఫ్రాల‌జీ, న్యూరాల‌జీ, ప‌ల్మన‌రీ మెడిసిన్‌, ఆంకాల‌జీ, లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జ‌రీ, రీన‌ల్ ట్రాన్స్‌ప్లాంట్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో మెడిక‌ల్ పీజీ డిగ్రీ(ఎండీ/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్‌) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌ని అనుభ‌వం ఉండాలి.

2) నాన్ టీచింగ్ పోస్టులు: 64

పోస్టులు: సీనియ‌ర్ ఫెలో, అసిస్టెంట్ ల్యాబ్ మేనేజ‌ర్‌, హెడ్ ఆప‌రేష‌న్స్‌, మేనేజ‌ర్, డిప్యూటీ మేనేజ‌ర్‌, న్యూట్రిష‌నిస్ట్‌, ఎగ్జిక్యూటివ్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ(న‌ర్సింగ్‌), బీకాం, పీజీ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ/ రాత ప‌రీక్ష‌/ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.07.2021.

నోటిఫికేష‌న్: https://www.ilbs.in/?page=hrjobs_listing

1 comment: