స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6100 అప్రెంటీస్ ఉద్యోగాలు
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు చెందిన ముంబయిలోని సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం... దేశవ్యాప్తంగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం పోస్టుల సంఖ్య: 6100
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 225 (ఆంధ్రప్రదేశ్‌లో 100, తెలంగాణలో 125).
ట్రైనింగ్ పిరియడ్ : ఒక సంవత్సరం.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 31.10.2020 నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
స్టయిపెండ్: అప్రెంటిస్ శిక్షణ కాలం ఏడాది పాటు నెలకు రూ.15000 స్టయిపెండ్ లభిస్తుంది. ఇతర ఎలాంటి అలవెన్సులు/ప్రయోజనాలు ఉండవు.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
రాత పరీక్ష ఇలా: ఎస్బీఐ అప్రెంటిస్ రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు.. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్–25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ ఇంగ్లిష్–25 ప్రశ్నలు–25 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్–25 ప్రశ్నలు–25 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్–25 ప్రశ్నలు–25 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట(60 నిమిషాలు). ప్రతి విభాగానికి 15 నిమిషాలు కేటాయించారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత ఉంటుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.07.2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bank.sbi/web/careers, https://apprenticeshipindia.org
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఐబీపీఎస్-సీఆర్పీ XI 5830 క్లర్క్ ఉద్యోగాలు
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్(సీఆర్పీ)-XI నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* క్లరికల్ కేడర్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 5830
1. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు: 263
2. తెలంగాణలో ఖాళీలు: 263
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితరాలు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
* ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్‌లో ప్రశ్నలు అడుగుతారు.
* పరీక్ష సమయం 60 నిమిషాలు.
* మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
* జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో ప్రశ్నలు వస్తాయి.
* సమయం 160 నిమిషాలు కేటాయిస్తారు.
* ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షకు తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.07.2021 నుంచి.
దరఖాస్తు చివరి తేది: 01.08.2021.
ప్రిలిమినరీ పరీక్ష తేది: 28, 29.08.2021, 04.09.2021.
మెయిన్ పరీక్ష తేది: 31.10.2021
-----------------------------------------------------------------------------------------------------------------------------
838 పోస్టులకు యూపీఎస్సీ–కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2021 నోటిఫికేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. 838 పోస్టుల భర్తీకి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021
మొత్తం పోస్టుల సంఖ్య: 838
పోస్టుల వివరాలు..
కేటగిరీ–1: సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లో జూనియర్ స్కేల్ పోస్టులు– 349.
కేటగిరీ–2: రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్–300. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్–05. –జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 (ఈడీఎంసీ, ఎన్డీఎంసీ, ఎస్డీఎంసీ)–184.
అర్హతలు: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.08.2021 నాటికి 32ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.07.2021
రాత పరీక్ష తేది: 21.11.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.upsc.gov.in
No comments:
Post a Comment