Friday, 2 July 2021

ఐటీబీపీలో 65 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు, ఇండియ‌న్ నేవీలో 45 ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్లు ఉద్యోగాలు, ఈసీఐఎల్‌లో 50 జూనియర్‌ ఆర్టిసన్‌ ఉద్యోగాలు.

 ఐటీబీపీలో 65 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు


మొత్తం పోస్టుల సంఖ్య: 65

విభాగాలు: రెజ్లింగ్, కబడ్డీ, ఆర్చెరీ, జూడో తదితరాలు.

వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ప్రారంభ తేది: 05.07.2021

దరఖాస్తులకు చివరి తేది: 02.09.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.recruitment.itbpolice.nic.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఇండియ‌న్ నేవీలో 45 ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్లు ఉద్యోగాలు

ఇండియ‌న్ నేవీ.. స్పెషల్‌ నావల్‌ ఓరియంటేషన్‌ కోర్సు (జనవరి 2022 ఎస్‌టీ 22) కింద ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి అవివాహిత పురుషుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: 45

* ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌ - ఎస్ఎస్‌సీ X (ఐటీ)

కోర్సు ప్రారంభం: జనవరి 2022 (ఎస్‌టీ 22)

శిక్ష‌ణ కేంద్రం: ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ (ఐఎన్ఏ), ఎజిమ‌ళ‌, కేర‌ళ‌.

అర్హ‌త‌: కనీసం 60% మార్కులతో కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ ఐటీలో బీఈ/  బీటెక్‌ (లేదా) ఎమ్మెస్సీ (కంప్యూటర్/ ఐటీ)/ ఎంసీఏ/ ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ) ఉత్తీర్ణత.  నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

ఎంపిక విధానం: కోవిడ్‌-19 కార‌ణంగా ఇండియ‌న్ నేవీ ఎంట్ర‌న్స్ టెస్ట్ నిర్వ‌హించ‌కుండా అక‌డ‌మిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌కు ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. 

ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ షెడ్యూల్‌: 2021 ఆగస్టు నుంచి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 02.07.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 16.07.2021

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఈసీఐఎల్‌లో 50  జూనియర్‌ ఆర్టిసన్‌ ఉద్యోగాలు


నగరంలోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఆసక్తి, అర్మత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందులో సైంటిఫిక్ అసిస్టెంట్‌-ఏ, జూనియర్‌ ఆర్టిసన్‌ పోస్టులు ఉన్నాయి. మొత్తం 50 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎంపికైనవారు కర్ణాటకలోని మైసూరులో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తిగా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది.

మొత్తం పోస్టులు: 50

ఇందులో సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-ఏ 8 (కెమికల్‌ 6, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 1, ఎలక్ట్రికల్ 1), జూనియర్‌ ఆర్టిసన్‌ 42 (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 8, ఎలక్ట్రికల్‌ 11, ఫిట్టర్‌ 5, కెమికల్‌ ప్లాంట్‌ ఆపరేటర్‌ 18) చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-ఏ పోస్టుకు.. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ప్రాసెస్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి. కెమికల్‌ డిసిప్లేన్స్‌ కోసం.. డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్టు చేయాలి.

జూనియర్‌ ఆర్టిసన్‌ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేయాలి. కెమికలల్‌ ప్లాంట్‌ ఆపరేటర్‌ కోసం ఇంటర్‌లో ఎంపీసీ చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ద్వారా

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో ఉన్న దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి పరీక్ష రోజున నేరుగా హాజరవ్వాలి.

పరీక్ష తేదీ: జూలై 7

వెబ్‌సైట్‌: http://www.ecil.co.in/

No comments:

Post a Comment