Wednesday, 14 July 2021

నేవీలో 45 ఆఫీసర్‌ ఐటీ ఉద్యోగాలు, ఇస్రోలో 43 గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌లు, పార్లమెంట్‌ ఆఫ్‌ ఇండియాలో 39 కన్సల్టెంట్ ఉద్యోగాలు.

నేవీలో 45 ఆఫీసర్‌ ఐటీ ఉద్యోగాలు

ఇండియన్‌ నేవీలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ ఐటీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టు: స్పెషల్‌ నేవల్‌ ఓరియంటేషన్‌ కోర్సు కింద ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచీ ఎస్‌ఎస్‌సీ -ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పోస్టులు.ఈ కోర్సు జనవరి 2022 నుంచి ప్రారంభమవుతుంది.

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ లేదా ఐటీ) లేదా ఎమ్మెస్సీ (కంప్యూటర్‌/ఐటీ), ఎంసీఏ, ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ). అవివాహిత పురుష అభ్యర్థులు అయి ఉండాలి.

మొత్తం ఖాళీలు: 45

వయస్సు: 1997, జనవరి 2 నుంచి 2002, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: కొవిడ్‌-19 కారణంగా నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించడం లేదు. అకడమిక్‌ మెరిట్‌ ద్వారా షార్ట్‌లిస్టింగ్‌ చేసిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలను ఆగస్టు 21 తర్వాత నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలను బెంగళూరు, భోపాల్‌, విశాఖపట్నం, కోల్‌కతాల్లో నిర్వహిస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలను ప్రకటిస్తారు.

ఉద్యోగ కాలపరిమితి: షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కింద ఎంపికైన అభ్యర్థులకు మొదట 10 ఏండ్ల కాలపరిమితికి తీసుకుంటారు. తర్వాత గరిష్ఠంగా నాలుగేండ్లు పొడిగిస్తారు.

శిక్షణ

కేరళ ఎజిమళలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో శిక్షణ ఇస్తారు.

నాలుగు నెలల ఎస్‌ఎస్‌సీ ఐటీ శిక్షణతోపాటు ప్రొఫెషనల్‌ ట్రెయినింగ్‌ను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తారు. శిక్షణ కాలంలో సబ్‌ లెఫ్టినెంట్‌ హోదా ఇస్తారు. ఎస్‌ఎస్‌సీ ఐటీ ఆఫీసర్‌ ప్రొబేషనరీ పీరియడ్‌ రెండేండ్లు

ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: జూలై 16

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------

ఇస్రోలో 43 గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌లు


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 22 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 43 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో డిప్లొమా టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు బెంగళూరులో అప్రెంటిస్‌ చేయాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 43

ఇందులో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ 13, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ 10, డిప్లొమా ఇన్‌ కమర్షియల్‌ ప్రాక్టీసెస్‌ 20 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: గ్రాడ్యుయేట్‌‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు ఇజినీరింగ్, డిప్లొమా అప్రెంటిస్‌ కర్షియల్‌ ప్రాక్టీసెస్‌లో డిప్లొమా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

స్టయిఫండ్‌: డిప్లొమా అప్రెంటిస్‌కు ప్రతినెల రూ.9000, మిగిలిన పోస్టులకు రూ.8000 అందిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ ఇయర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: జూలై 22

వెబ్‌సైట్‌: hqapprentice@isro.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------

పార్లమెంట్‌ ఆఫ్‌ ఇండియాలో 39 కన్సల్టెంట్ ఉద్యోగాలు

ప్లార్లమెంట్‌ ఆఫ్‌ ఇండియాకి చెందిన సంసద్‌ టెలివిజన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ఫైనాన్స్‌ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* కన్సల్టెంట్స్‌/  ప్రొఫెషనల్స్‌ (సంసద్‌ టెలివిజన్‌)

మొత్తం ఖాళీలు: 39

పోస్టులు:  హెచ్‌ఆర్‌ మేనేజర్‌, డిజిటల్‌ హెడ్‌, సీనియర్‌ ప్రొడ్యూసర్‌, యాంకర్‌/ ప్రొడ్యూసర్‌, అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌, గ్రాఫిక్స్‌ ప్రోమో జీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్ట్‌, గ్రాఫిక్స్‌ స్కెచ్‌ ఆర్టిస్ట్‌, ప్రోమో ఎడిటర్‌, స్విచర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/  బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు మీడియా నైపుణ్యాలు ఉండాలి.

వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు:  పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.45000 నుంచి రూ.150000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌: sansadtvadvt@gmail.com 

దరఖాస్తులకి చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి


No comments:

Post a Comment