ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 120 జూనియర్ అసిస్టెంట్లు ఉద్యోగాలు
భారత ప్రభుత్వరంగానికి చెందిన నవరత్న కంపెనీ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్)
* మొత్తం ఖాళీలు: 120 (ఎస్సీ-08, ఎస్టీ-14, ఓబీసీ-32, ఈడబ్ల్యూఎస్-12, అన్రిజర్వ్డ్-54)
అర్హత: కనీసం 40% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణతతో పాటు కనీసం 6 నెలల వ్యవధితో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా సర్టిఫికెట్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్‌పాయింట్, ఎంఎస్ ఎక్స్ఎల్లో మంచి నాలెడ్జ్ ఉండాలి.వయసు: 15.08.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.26,600 - రూ. 90,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 100% మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. అందులో 1) ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్/ అవేర్నెస్, ఆయిల్ ఇండియా మీద ప్రశ్నలు ఉంటాయి. దీనికి 20% మార్కులు కేటాయిస్తారు. 2) రీజనింగ్, అర్తమేటిక్/ న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. దీనికి 20% మార్కులు కేటాయిస్తారు. 3) డొమైన్/ సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్ (సంబంధిత పోస్టు విద్యార్హతల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి). దీనికి 60% మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు. పరీక్ష ఇంగ్లిష్, అస్సామీ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండు గంటలు ఉంటుంది. తుది ఎంపిక రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.200 చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.08.2021.
--------------------------------------------------------------------------------------------------------------------------------
ఐటీబీపీలో 65 కానిస్టేబుల్ ఉద్యోగాలు
ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 65 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవన్నీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.
మొత్తం పోస్టులు: 65
ఇందులో రెజ్లింగ్, కరాటే, వుషు, తైక్వాండో, జూడో, జిమ్నాస్టిక్స్ (పురుషులు), స్కీ, బాక్సింగ్, ఆర్చరీ, కబడ్డీ, ఐస్ హాకీ (పురుషులు) కేటగిరీలో పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: మెట్రిక్యులేషన్ (పదో తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బహుమతి గెలుచుకొని, 18 నుంచి 23 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల పరిశీలన, ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: జూలై 5
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 2
వెబ్సైట్: recruitment.itbpolice.nic.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
బీడీఎల్, హైదరాబాద్‌లో 46 ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 46
పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్–01, డిప్యూటీ జనరల్ మేనేజర్–03, మెడికల్ ఆఫీసర్–02, అసిస్టెంట్ మేనేజర్–03, మేనేజ్మెంట్ ట్రెయినీ–37.
విభాగాలు: హెచ్ఆర్, న్యూప్రాజెక్ట్స్, సేఫ్టీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఆప్టిక్స్, బిజినెస్ డెవలప్మెంట్, ఫైనాన్స్, హెచ్ఆర్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ/పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్/ఎంఎస్/ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: జనరల్ మెడిసిన్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఇంటర్వూ్య ఆధారంగా; మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులకు రాతపరీక్ష(కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్), ఇంటర్వూ్య ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.07.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 27.07.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://bdl-india.in
No comments:
Post a Comment