కోల్ ఇండియాలో 588 ఉద్యోగాలు
కోల్ ఇండియా లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 588
పోస్టులు : మేనేజ్మెంట్ ట్రెయినీలు
విభాగాల వారీగా ఖాళీలు : మైనింగ్-253, ఎలక్ట్రి-కల్-117, మెకానికల్-134, సివిల్-57, ఇండస్ట్రి-యల్ ఇంజినీరింగ్-15, జియాలజీ-12
అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంటెక్ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : సెప్టెంబర్ 9
వెబ్సైట్ : https://www.coalindia.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
యూబీఐలో 347 ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 347
పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్లు–60, మేనేజర్లు–141, అసిస్టెంట్ మేనేజర్లు–146.
విభాగాలు: రిస్క్, సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్ ఇంజనీర్, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్డ్ అకౌంటెంట్, టెక్నికల్ ఆఫీసర్లు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబం«ధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/సీఎస్ ఉత్తీర్ణతతోపాటు పనిలో అనుభవం, సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.
వయసు: సీనియర్ మేనేజర్ పోస్టులకు 30 నుంచి 40ఏళ్లు, మిగతా పోస్టులకు 25 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా సమయం 120 నిమిషాలు. –దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021
వెబ్సైట్: https://www.unionbankof india.co.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
నేవల్ షిప్ రిపేర్ యార్డ్‌లో 302 ట్రేడ్ అప్రెంటిస్‌లు
పోర్ట్ బ్లేయిర్‌లోని నేవల్ షిప్ రిపేర్ యార్డులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 302 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో డిసిగ్నేటెడ్ ట్రేడ్, నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్‌మెన్ పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ వెలువడిన 50 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ఎప్లాయ్మెంట్ న్యూస్ ఆగస్టు 20-27 ఎడిషన్‌లో ప్రచురితమైంది.
మొత్తం పోస్టులు: 302
ఇందులో మెషినిస్ట్ 16, ప్లంబర్/పైప్ ఫిట్టర్ 8, పెయింటర్ 7, టైలర్ 6, వెల్డర్ 20, మెకానిక్ ఎంటీఎం 7, వెల్డర్ షిప్ ఫిట్టర్ 3, షీట్ మెటల్ వర్కర్ 1 (డిజైన్డ్ పోస్టులు), ఎలక్ట్రానిక్ మెకానిక్ 46, ఎలక్ట్రిషన్ 29, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 8, ఫిట్టర్ 37, డీజిల్ మెకానిక్ 42, ఆర్ఈఎఫ్ అండ్ ఏసీ మెకానిక్ 11, షీట్ మెటల్ వర్కర్ 18, కార్పెంటర్ 33, మాసన్ 7, ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 (నాన్ డిజైన్డ్ పోస్టులు) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. అయితే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, పదో తరగతి పాసై ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 25 ఏండ్లలోపువారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
అడ్రస్: HE COMMODORE SUPERINTENDENT (FOR Oi/C RECRUITMENT CELL),
NAVAL SHIP REPAIR YARD (PBR),
POST BOX NO. 705, HADDO,
PORT BLAIR – 744102,
SOUTH ANDAMAN
దరఖాస్తులకు చివరితేదీ: నోటిఫికేషన్ విడుదలైన 50 రోజుల్లో
వెబ్సైట్: https://www.indiannavy.nic.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 282 ఉద్యోగాలు
భారతీయ వాయుసేన (IAF)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 282 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో కుక్, మెస్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్ వంటి పోస్టులు ఉన్నాయి. వచ్చేనెల 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో కూడా ఖాళీలు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 282
ఇందులో మెయింటైనెన్స్ కమాండ్, హెడ్‌క్వార్టర్ 153, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్, హెడ్‌క్వార్టర్ 32, సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్, హెడ్‌క్వార్టర్ 11, ఇండిపెండెంట్ యూనిట్స్ 1, కుక్ (ఆర్డినరీ గ్రేడ్) 1, మెస్ స్టాఫ్ 9, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 18, హౌస్ కీపింగ్ స్టాఫ్ 15, హిందీ టైపిస్ట్ 3, లోయర్ డివిజన్ క్లర్క్ 10, స్టోర్ కీపర్ 3, కార్పెంటర్ 3, పెయింటర్ 1, సూపరింటెండెంట్ (స్టోర్) 5, సివిలియన్ మెకానిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సూపరింటెండెంట్ పోస్టుకు డిగ్రీ, లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్ పోస్టులకు ఇంటర్, కుక్ పోస్టుకు మెట్రిక్యులేషన్, డిప్లొమా ఇన్ కేటరింగ్, ఇతర పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 18 నుంచి 25 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సండంధిత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరాలా పోస్టులో పంపించాలి. లో ఇవ్వాలి.
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 7
వెబ్సైట్: https://indianairforce.nic.in/
www.tspscinfo.com
ReplyDelete