Tuesday, 24 August 2021

బీఎస్‌ఎఫ్‌లో 269 జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ పోస్టులు,ఎయిర్‌ఫోర్స్‌లో 197 ఉద్యోగాలు,ఎయిర్‌ఫోర్స్‌లో 175 ఉద్యోగాలు,155 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్‌

బీఎస్‌ఎఫ్‌లో 269 జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ పోస్టులు

కేంద్ర హోం శాఖ ఆధీనంలోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ సోమవారం (ఆగస్టు 9) నుంచి ప్రారంభంకానుంది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవాలని బీఎస్‌ఎఫ్‌ కోరింది. మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 269

అర్హత: మెట్రిక్యుల్యేషన్‌ లేదా దానికి సమానమైన కోర్సు చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 23 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఎత్తు: పురుషులు- 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్లు

ఛాతీ: 85 సెంటీమీటర్లు

ఎంపిక ప్రక్రియ: శారీరక దారుఢ్యం, అకడమిక్‌ మార్కులు, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 9

దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్‌ 22

వెబ్‌సైట్‌: https://bsf.gov.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఎయిర్‌ఫోర్స్‌లో 197 ఉద్యోగాలు


ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పరిధిలోని వివిధ యూనిట్లలో గ్రూప్‌- సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు : 197

పోస్టులు : సూపరింటెండెంట్‌, ఎంటీఎస్‌, ఎల్‌డీసీ, కార్పెంటర్‌ తదితరాలు

అర్హతలు : పదోతరగతి, ఇంటర్‌, డిప్లొమా, ఐటీఐ, అనుభవం

ఎంపిక : రాతపరీక్ష, స్కిల్‌/ఫిజికల్‌ లేదా ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా

దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో

చివరితేదీ : ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌ (ఆగస్టు 7- 13) ప్రకటన విడుదలైన 30 రోజుల్లో పంపాలి.

నోట్ : వివిధ రాష్ర్టాల్లో ఉన్న సంబంధిత ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్ : https://indianairforce.nic.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఎయిర్‌ఫోర్స్‌లో 175 ఉద్యోగాలు

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వివిధ భాగాల్లో గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 175 పోస్టులు: ఎంటీఎస్‌, కార్పెంటర్‌, కుక్‌, ఎల్‌డీసీ, స్టోర్‌ కీపర్‌, సూపరింటెండెంట్‌ తదితరాలు

అర్హతలు: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీతోపాటు పని అనుభవం, టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ద్వారా

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో

చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌ (ఆగస్టు 21-27)లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లో పంపాలి.

వెబ్‌సైట్‌: https://indianairforce.nic.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

155 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్‌


కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈఎస్‌ఐసీతోపాటు కేంద్ర సాంస్కృతిక శాఖలో మొత్తం 155 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవలని సూచించింది. ఇందులో అసిస్టెంట్‌ కీపర్‌, డిప్యూటీ డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 2 వరకు అందుబాటులో ఉంటాయి.

మొత్తం పోస్టులు: 155

ఇందులో డిప్యూటీ డైరెక్టర్‌ 151 (కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని ఈఎస్‌ఐసీలో), అసిస్టెంట్‌ కీపర్‌ 2 (ఆంత్రపాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా), ఫిషరీష్‌ రిసెర్చ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ 1 (మినిస్ట్రీ ఆఫ్‌ ఫిషరీస్‌), ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌ 1 (మినిస్ట్రీ ఆఫ్‌ పోర్ట్స్‌) చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అయితే సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ చేసి ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్‌ 2

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


No comments:

Post a Comment