Friday, 6 August 2021

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌ల్లో కానిస్టేబుల్‌ 25271 ఉద్యోగాలు, నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1664 అప్రెంటిస్‌లు, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 1110 అప్రెంటిస్‌లు.

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌ల్లో కానిస్టేబుల్‌ 25271 ఉద్యోగాలు


భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్‌ గ్రీవెన్సెస్, పెన్షన్స్‌ మంత్రిత్వ శాఖ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)... వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs Images మొత్తం పోస్టుల సంఖ్య: 25271

పోస్టుల వివరాలు: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌ల్లో కానిస్టేబుల్‌ పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్‌.


విభాగాల వారీగా ఖాళీలు: బీఎస్‌ఎఫ్‌–7545, సీఐఎస్‌ఎఫ్‌–8464, ఎస్‌ఎస్‌బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్‌–3785, ఎస్‌ఎస్‌ఎఫ్‌–240


జీతభత్యాలు: పేస్కేల్‌–3 ప్రకారం–రూ.21700–రూ.69100


అర్హత: 01.08.2021 నాటికి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.


వయసు: 01.08.2021 నాటికి 18–23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.


ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష(సీబీఈ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ సాండర్ట్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), మెడికల్‌ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.


కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 25 ప్రశ్నలు–25 మార్కులకు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు–25 మార్కులకు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ 25 ప్రశ్నలు–25 మార్కులకు, ఇంగ్లిష్‌/హిందీ 25ప్రశ్నలు–25 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:


    ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.

    తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.


ముఖ్య సమాచారం..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.07.2021


దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1664 అప్రెంటిస్‌లు


నార్త్‌ సెంట్రల్‌ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. ప్రయాగ్‌రాజ్‌ ప్రధాన కేంద్రంగా వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs మొత్తం ఖాళీల సంఖ్య: 1664

ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్‌మెన్, ప్లంబర్‌ తదితరాలు.

అర్హత: 10+2 విధానంలో పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వెల్డర్‌(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), వైర్‌మెన్, కార్పెంటర్‌ పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 01.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 02.08.2021

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 01.09.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.rrcpryi.org 

-----------------------------------------------------------------------------------------------------------------------------

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 1110 అప్రెంటిస్‌లు


కేంద్ర విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) భారీగా అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పీజీ డిప్లొమా, ఐటీఐ చేసిన వారు అప్రెంటిస్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1110 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో హైదరాబాద్‌ రీజియన్‌లో 76 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 20వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా సంబంధిత కోర్సులో సాధించిన మార్కుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

మొత్తం ఖాళీలు: 1110

ఇందులో సౌథర్న్‌ రీజియన్‌-1 హైదరాబాద్‌ 76, సౌథర్న్‌ రీజియన్‌-2 బెంగళూరు 114, కార్పొరేట్‌ సెంటర్‌ (గురుగ్రామ్‌) 44, నార్తర్న్‌ రీజియన్‌ 313, ఈస్టర్న్‌ రీజియన్‌ 156, నార్తీస్టర్న్‌ రీజియన్‌ 127, ఒడిశా ప్రాజెక్ట్‌ 53, వెస్టర్న్‌ రీజియన్‌ 227 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: ఐటీఐ అప్రెంటిస్‌ కోసం ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, డిప్లొమా అప్రెంటిస్‌ కోసం సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ కోసం బీఈ, బీటెడ్‌, బీఎస్సీ ఇంజినిరింగ్‌లలో ఏదో ఒక కోర్సు చేసి ఉండాలి. అభ్యర్థులు 18 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: సంబంధిత కోర్సులో సాధించిన మార్కుల ఆధారంగా

స్టయిఫండ్‌: ప్రతి నెల రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకు ఇస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: జూలై 21

దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 20

వెబ్‌సైట్‌: https://www.powergridindia.com/



1 comment: