Friday, 6 August 2021

బీఎస్‌ఎఫ్‌లో 269 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు, ఐసీడీఎస్‌-నల్గొండలో 109 అంగన్‌వాడీ స్టాఫ్‌ ఉద్యోగాలు, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో 85 గ్రూప్‌–సీ సివిలియన్‌ ఉద్యోగాలు, ఏఐఈఎస్ఎల్‌ అకౌంట్స్‌లో 18 ఉద్యోగాలు, సీఎస్‌ఐఆర్‌-సీడీఆర్‌ఐలో 16 జూనియర్‌ అసిస్టెంట్లు ఉద్యోగాలు, ఎన్పీసీఐఎల్‌లో 16 క్లరికల్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు.

బీఎస్‌ఎఫ్‌లో 269 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వానికి చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌).. శాశ్వత ప్రాతిపదికన క్రీడా కోటా గ్రూప్‌ సీ కేటగిరీలో నాన్‌గెజిటెడ్, నాన్‌ మినిస్టేరియల్‌ పరిధిలోని కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs మొత్తం పోస్టుల సంఖ్య: 269

పోస్టుల వివరాలు: బాక్సింగ్‌–20, జూడో–16, స్విమ్మింగ్‌–16, క్రాస్‌ కంట్రీ–04, కబడ్డీ–10, వాటర్‌ స్పోర్ట్స్‌–16, వుషు–11, జిమ్నాస్టిక్స్‌–08, హాకీ–08, వెయిట్‌ లిఫ్టింగ్‌–17, వాలీబాల్‌–10, రెజ్లింగ్‌–22, హ్యాండ్‌బాల్‌–08, బాడీ బిల్డింగ్‌–06, ఆర్చరీ–20, తైక్వాండో–10, అథ్లెటిక్స్‌–45, గుర్రపుస్వారీ–02, షూటింగ్‌–06, బాస్కెట్‌బాల్‌–06, ఫుట్‌బాల్‌–08.


దరఖాస్తు ప్రారంభ తేది: 09.08.2021

దరఖాస్తులకు చివరి తేది: 22.09.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/ 

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఐసీడీఎస్‌-నల్గొండలో 109 అంగన్‌వాడీ స్టాఫ్‌ ఉద్యోగాలు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నల్గొండ జిల్లాకు చెందిన మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఐసీడీఎస్‌ కార్యాలయం పరిధిలోని ఖాళీల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  


వివరాలు...


* మొత్తం ఖాళీలు: 109


పోస్టుల వారీగా ఖాళీలు: 


1. అంగన్‌వాడీ టీచర్‌: 23


2. మినీ అంగన్‌వాడీ టీచర్‌: 09


3. సహాయకులు: 79


అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 


ఎంపిక విధానం: అకడెమిక్‌ మార్కులు, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2021.


దరఖాస్తు చివరి తేది: 16.08.2021

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో 85 గ్రూప్‌–సీ సివిలియన్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ శాశ్వత ప్రాతిపదికన గ్రూప్‌–సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs మొత్తం పోస్టుల సంఖ్య: 85

పోస్టుల వివరాలు: ఎల్‌డీసీ, కార్పెంటర్, పెయింటర్, మెస్‌ స్టాఫ్, ఎంటీఎస్, స్టోర్‌ కీపర్, హిందీ టైపిస్ట్, కుక్, డ్రైవర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్‌ లైసెన్స్, హిందీ, ఇంగ్లీష్‌ టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.

వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5ఏళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.


ఎంపిక విధానం: అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి.. ఆ తర్వాత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాతపరీక్షలో మొత్తం నాలుగు విభాగాలు జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా సంబంధిత ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో అందేలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://indianairforce.nic.in 

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఏఐఈఎస్ఎల్‌ అకౌంట్స్‌లో  18 ఉద్యోగాలు


భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.


వివ‌రాలు..


మొత్తం ఖాళీలు: 18


1. అకౌంట్స్‌ ఆఫీస‌ర్లు: 06


అర్హ‌త‌: ఇంట‌ర్ చార్ట‌ర్డ్ అకౌంటెంట్‌/ఇంట‌ర్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్/  ఎంబీఏ(ఫైనాన్స్‌) ఉత్తీర్ణ‌త‌.


వ‌య‌సు: 01.08.2021 నాటికి 30 ఏళ్లు మించ‌కూడదు.


జీత‌భ‌త్యాలు: నెల‌కి రూ.80,000 వ‌ర‌కు చెల్లిస్తారు.


2. అకౌంట్స్‌ అసిస్టెంట్లు: 12


అర్హ‌త‌: గ్రాడ్యుయేషన్‌లో కామర్స్‌ ఉత్తీర్ణత.


వ‌య‌సు: 01.08.2021 నాటికి 28 ఏళ్లు మించ‌కూడదు.


జీత‌భ‌త్యాలు: నెల‌కి రూ.25,000 వ‌ర‌కు చెల్లిస్తారు.


ఎంపిక విధానం: ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.


ప‌ని ప్ర‌దేశం: హైద‌రాబాద్‌, కోల్‌క‌తా, దిల్లీ, ముంబ‌యి. 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేయాలి.


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 23.08.2021


చిరునామా: AIESL, Personnel Department, 2nd Floor, CRA Building, Safdarjung Airport Complex, Aurbindo Marg, New Delhi – 110 003

-----------------------------------------------------------------------------------------------------------------------------

సీఎస్‌ఐఆర్‌-సీడీఆర్‌ఐలో 16 జూనియర్‌ అసిస్టెంట్లు ఉద్యోగాలు


సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్‌ డ్రగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీడీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా జూనియర్‌ సెక్రటేరియట్‌, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎంపికైనవారు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పనిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 16

ఇందులో జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జనరల్‌) 6, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఎఫ్‌ అండ్‌ ఏ) 4, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ (ఇంగ్లిష్‌ లేదా హిందీ) 2, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ అండ్‌ పీ) 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: ఇంటర్‌ పూర్తిచేసి, కంప్యూటర్‌పై నిర్ణీత స్పీడ్‌లో టైప్‌ చేయగలగాలి. అభ్యర్థులు 28 ఏండ్లలోపు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 30

వెబ్‌సైట్‌: https://www.cdri.res.in/

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్పీసీఐఎల్‌లో 16 క్లరికల్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు


న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్పీసీఐఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వచ్చే నెల 9 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 16 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో క్లరికల్‌ అసిస్టెంట్‌, ఆఫీస్ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 16

ఇందులో క్లరికల్‌ అసిస్టెంట్‌ 6, ఆఫీస్‌ అసిస్టెంట్‌ 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: డిగ్రీ చేసి ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ తప్పనిసరి. ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులవలి. అభ్యర్థులు 18 నుంచి 47 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్‌ ఫామ్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.

అడ్రస్‌: Manager (HR),

Jaitapur Nuclear Power project,

Liaison Office,

Near, Ratnagiri Railway Station,

Ratnagiri – 415639

దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 9

వెబ్‌సైట్‌: npcil.nic.in

No comments:

Post a Comment