Friday, 6 August 2021

ఐడీబీఐలో 920 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు, మజ్‌గావ్‌డాక్‌ షిప్‌బిల్డర్స్‌లో 425 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు, యూపీఎస్సీ సీడీఎస్‌ఈ ఎగ్జామ్‌–2021 339 ఉద్యోగాలు,తెలంగాణ పోలీస్‌ విభాగంలో 8 వివిధ ఖాళీలు

ఐడీబీఐలో 920 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు


ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ)... ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs పోస్టు: ఎగ్జిక్యూటివ్‌

పోస్టుల సంఖ్య: 920

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 01.07.2021 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పరీక్ష మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు మూడు విభాగాల్లో నిర్వహిస్తారు. టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, టెస్ట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, టెస్ట్‌ ఆఫ్‌ క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు.


ముఖ్య సమాచారం..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 18.08.2021

పరీక్ష తేది: 05.09.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.idbibank.in/

-----------------------------------------------------------------------------------------------------------------------------

మజ్‌గావ్‌డాక్‌ షిప్‌బిల్డర్స్‌లో 425 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు


ముంబైలోని భారత ప్రభుత్వ రంగానికి చెందిన మజ్‌గావ్‌డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs మొత్తం ఖాళీల సంఖ్య: 425

ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్‌ ఫిట్టర్, స్ట్రక్చరల్‌ ఫిట్టర్, వెల్డర్, కోపా.

అర్హత: ఆయా గ్రూపులను అనుసరించి ఎనిమిది, పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: గ్రూప్‌ ఏ 19 ఏళ్లు, గ్రూప్‌ బీ 21 ఏళ్లు, గ్రూప్‌ సీ అభ్యర్థులు 18 ఏళ్లు మించకుండా ఉండాలి.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆయా గ్రూపులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.


పరీక్షా కేంద్రాలు: ముంబై, నాగ్‌పూర్, పుణె, ఔరంగాబాద్‌.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.08.2021

పరీక్ష తేది: 2021 ఆగస్ట్‌ 4వ వారంలో ఉండొచ్చు.


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://mazagondock.in 

-----------------------------------------------------------------------------------------------------------------------------

యూపీఎస్సీ సీడీఎస్‌ఈ ఎగ్జామ్‌–2021 339 ఉద్యోగాలు


యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ)... కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీడీఎస్‌ఈ) (2), 2021కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Jobs కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీడీఎస్‌ఈ) (2), 2021..

మొత్తం ఖాళీల సంఖ్య: 339

అర్హత: డిగ్రీ, ఇంజనీరింగ్, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేది: 24.08.2021


పరీక్ష తేది: 14.11.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/ 


--------------------------------------------------------------------------------------------------------------------------

తెలంగాణ పోలీస్‌ విభాగంలో 8 వివిధ ఖాళీలు

తెలంగాణ ప్రభుత్వ పోలీస్‌ విభాగానికి చెందిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 08

పోస్టుల వివరాలు: సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–07, ల్యాబ్‌ టెక్నీషియన్‌–01.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ప్రారంభ తేది: 26.07.2021


దరఖాస్తులకు చివరి తేది: 08.08.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.tspolice.gov.in 




No comments:

Post a Comment