Tuesday, 16 November 2021

ఐఓసీఎల్‌లో 527 అప్రెంటిస్‌ పోస్టులు, ఐఓసీఎల్‌లో 1968 పోస్టులు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 15 స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు ఉద్యోగాలు, న్‌టీపీసీలో 15 ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులు, బామర్‌ లారీలో జూనియర్‌ ఆఫీసర్లు ఉద్యోగాలు.


ఐఓసీఎల్‌లో 1968 పోస్టులు


ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌).. రిఫైనరీస్‌ విభాగంలో ట్రేడ్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీల సంఖ్య: 1968

ట్రేడులు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సెక్రటేరియల్‌ అసిస్టెంట్, అకౌంటెంట్, డీఈఓ.

ఖాళీలున్న రిఫైనరీలు: గువహటి, బరౌనీ, గుజరాత్, హల్డియా, మథురా, పానిపట్, డిగ్బాయ్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతి, ఇంటర్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఏ/బీఎస్సీ/బీకాం ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 31.10.2021 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: రాతపరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 12.11.2021


రాతపరీక్ష తేది: 21.11.2021


వెబ్‌సైట్‌: https://www.iocl.com/

-----------------------------------------------------------------------------------------------------------------------------


 ఐఓసీఎల్‌లో 527 అప్రెంటిస్‌ పోస్టులు


ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌),ఈస్టర్న్‌ రీజియన్, కోల్‌కతా... వివిధ ట్రేడులు/విభాగాల్లో ట్రేడ్‌ అప్రెంటిస్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీల సంఖ్య: 527

ట్రేడులు/విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులు/విభాగాల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 31.10.2021 నాటికి 18–24 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు. ఈ పరీక్షని ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 04.12.2021


వెబ్‌సైట్‌: https://iocl.com/


-----------------------------------------------------------------------------------------------------------------------------

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 15  స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు ఉద్యోగాలు


భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో కింది టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 15


1) డైటా సైంటిస్ట్‌: 09


అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.


వయసు: 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.


2) డేటా ఇంజినీర్‌: 06


అర్హత: కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవం ఉండాలి.


వయసు: 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 225 మార్కులకి నిర్వహిస్తారు. 150 ప్రశ్నలకి గాను పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.11.2021.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 06.12.2021

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్‌టీపీసీలో 15  ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులు


భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకి చెందిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


వివరాలు..


* ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు (హైడ్రో)


మొత్తం ఖాళీలు: 15


1) ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (హైడ్రో) మెకానికల్‌: 05


అర్హత: కనీసం 60శాతం మార్కులతో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. 


వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.


జీతభత్యాలు: నెలకి రూ.60000 చెల్లిస్తారు.


2) ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (హైడ్రో) సివిల్‌: 10


అర్హత: 60శాతం మార్కులతో సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవం ఉండాలి.


వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.


జీతభత్యాలు: నెలకి రూ.60000 చెల్లిస్తారు.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్‌/ షార్ట్‌లిస్టింగ్‌/ సెలక్షన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకి ఫీజు లేదు.


ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.11.2021


ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 30.11.2021

-----------------------------------------------------------------------------------------------------------------------------

బామర్‌ లారీలో జూనియర్‌ ఆఫీసర్లు ఉద్యోగాలు


భారత ప్రభుత్వ పెట్రోలియ, సహజ వాయువు మంత్రిత్వశాఖకి చెందిన కోల్‌కతాలోని బామర్‌ లారీ కంపెనీ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


వివరాలు..


* జూనియర్‌ ఆఫీసర్లు (ట్రావెల్‌)


మొత్తం ఖాళీలు: 07


అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ట్రేడ్‌ డిప్లొమా (ఐఏటీఏ/ యూఎఫ్‌టీఏ) చేసి ఉండాలి. ఫ్రెషర్స్‌ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.11.2021.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021

Friday, 12 November 2021

మహిళా, శిశు సంక్షేమ విభాగంలో 275 ఆఫీసర్‌ ఉద్యోగాలు, RINL వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో 150 డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు, టీహెచ్‌డీసీలో 100 ఐటీఐ అప్రెంటిస్‌లు, నాల్కోలో 86 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.

 మహిళా, శిశు సంక్షేమ విభాగంలో 275 ఆఫీసర్‌ ఉద్యోగాలు,

తెలంగాణ రాష్ట్రం, వరంగల్‌ ప్రాంత పరిధిలో మహిళా, శిశు సంక్షేమ విభాగం.. ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టుల సంఖ్య: 275

జోన్ల వారీగా ఖాళీలు: జోన్‌–01: కాళేశ్వరం–56,  జోన్‌–02: బాసర–68, జోన్‌–03: రాజన్న–72, జోన్‌–04: భద్రాద్రి–79.

అర్హత: నిబంధనల ప్రకారం–అభ్యర్థులు ఎస్సెస్సీ, డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అంగన్‌వాడీ టీచర్లు(మెయిన్, మినీ)/కోఆర్డినేటర్లు/ఇన్‌స్ట్రక్టర్లు(అంగన్‌వాడీ ట్రెయినింగ్‌ సెంటర్లు/మిడిల్‌ లెవల్‌ ట్రెయినింగ్‌ సెంటర్లు)/కాంట్రాక్ట్‌ సూపర్‌వైజర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 50 ఏళ్లు మించకూడదు.


ఎంపిక విధానం: రాతపరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు: ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేది: 27.11.2021


వెబ్‌సైట్‌: https://wdcw.tg.nic.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

RINL వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో 150 డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు,

రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగం లిమిటెడ్‌ (RINL) పరిధిలోని విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (Vizag Steel plant) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేస్తున్నది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అన్‌లైన్ అప్లికేషన్లు ఈనెల 18 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. బీటెక్‌ లేదా డిప్లొమా చేసినవారు అర్హులని వెల్లడించింది. ఈనోటిఫికేషన్‌ ద్వారా 150 పోస్టులను భర్తీ చేస్తున్నది.

మొత్తం ఖాళీలు: 150

ఇందులో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ 110, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ 40 చొప్పున ఉన్నాయి.

అర్హత: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెటల్లర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సివిల్, కెమికల్‌ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్‌ మార్కుల ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: నవంబర్‌ 11

దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్‌ 18

వెబ్‌సైట్‌: vizagsteel.com

-----------------------------------------------------------------------------------------------------------------------------

టీహెచ్‌డీసీలో 100 ఐటీఐ అప్రెంటిస్‌లు,


ప్రభుత్వరంగంలోని మినీరత్న కంపెనీ హోదా కలిగిన టీహెచ్‌డీసీ (THDC) ఐటీఐ ఉత్తీర్ణులైనవారికి అప్రెంటిస్‌షిప్‌ (apprentice) ట్రైనింగ్‌ అందిస్తున్నది. దీనికి అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌, ఎలక్ట్రిసియన్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అకడమిక్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. ఎంపికైనవారికి ఏడాదిపాటు శిక్షణ అందిచనుంది.

మొత్తం అప్రెంటిస్‌లు: 100

ఇందులో కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ 26, స్టెనోగ్రాఫర్‌ 26, వైర్‌మెన్‌ 5, ఫిట్టర్‌ 5, ఎలక్ట్రిషియన్‌ 19, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌ 4, వెల్డర్‌ 2, మెకానిక్‌ 11 చొప్పున ఉన్నాయి.

అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి, 18 నుంచి 30 లోపు వయస్సు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. వెబ్‌సైట్‌లో నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తిగానింపి, అవసరమైన సర్టిఫికెట్లు జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.

అడ్రస్‌: DGM (HR & A), THDC India limited, Administrative Building, Bhagirathipuram, Tehri Garhwal-249124

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 29

వెబ్‌సైట్‌: www.thdc.co.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

నాల్కోలో 86 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.


నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ (నాల్కో)... వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టుల సంఖ్య: 86

పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్, జనరల్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ తదితరాలు.

విభాగాలు: సిస్టమ్స్, సివిల్, లా, ఫైనాన్స్, మైనింగ్, కెమిస్ట్రీ, జియాలజీ, మార్కెటింగ్, మెటీరియల్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి డిగ్రీ, ఇంజనీరింగ్‌తోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవంతోపాటు టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.12.2021


వెబ్‌సైట్‌: https://nalcoindia.comఐఏఎఫ్‌లో 80 సివిలియన్‌ పోస్టులు,సెంట్రల్‌ సిల్క్‌ బోర్డులో 60 ట్రైనీలు,ఐటీఐ లిమిటెడ్ 41 చీఫ్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు,ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 06 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఉద్యోగాలు.

ఐఏఎఫ్‌లో 80 సివిలియన్‌ పోస్టులు,


భారత వాయుసేన (ఐఏఎఫ్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-సి సివిలియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులు ఈ నెల 29 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిపికేషన్‌ ద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఎల్‌డీసీ, ఎంటీఎస్‌, సీఎంటీడీ వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

మొత్తం పోస్టులు: 80

ఇందులో సూపరింటెండెంట్‌ (స్టోర్‌) 1, ఎల్‌డీసీ 10, కుక్‌ 4, కార్పెంటర్‌ 1, సివిలియన్‌ మెకానికల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్‌ 45, ఫైర్‌మ్యాన్‌ 1, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ 18 చొప్పున ఉన్నాయి.

అర్హత: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అయితే అభ్యర్థులు డిగ్రీ, మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవాలి. 18 నుంచి 25 ఏండ్ల వయస్సు కలిగినవారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ లేదా ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో నోటిఫికేషన్‌ (అక్టోబర్‌ 30- నవంబర్‌ 5 సంచిక) ప్రచురితమైన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్‌ 29

వెబ్‌సైట్‌: indianairforce.nic.in


-----------------------------------------------------------------------------------------------------------------------------

సెంట్రల్‌ సిల్క్‌ బోర్డులో 60 ట్రైనీలు,


సెంట్రల్‌ సిల్క్‌ బోర్డులో (CSB) ట్రైనర్‌, ట్రెయినింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నవంబర్‌ 17 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 60 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు కర్ణాటకలోని బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 60

ఇందులో ట్రెయినర్‌ 30, ట్రెయినింగ్‌ అసిస్టెంట్‌ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ చేసి సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: నవంబర్‌ 8

దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్‌ 17

వెబ్‌సైట్‌: rond.csb@nic.in


-----------------------------------------------------------------------------------------------------------------------------

ఐటీఐ లిమిటెడ్ 41 చీఫ్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు,


ఐటీఐ లిమిటెడ్‌.. చీఫ్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టుల సంఖ్య: 41

విభాగాలు: డేటాసెంటర్, నెట్‌వర్క్, సెక్యూరిటీ, డేటాసెంటర్‌ అండ్‌ సేల్స్‌ మార్కెటింగ్, అర్‌ అండ్‌ డీ.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: చీఫ్‌ మేనేజర్‌ పోస్టులకు 45ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 40ఏళ్లు మించకుండా ఉండాలి.

వేతనం: చీఫ్‌ మేనేజర్‌ పోస్టులకు నెలకు రూ.80,240(బేసిక్‌+డీఏ+హెచ్‌ఆర్‌ఏ), డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు నెలకు రూ.65,195(బేసిక్‌+డీఏ+హెచ్‌ఆర్‌ఏ) చెల్లిస్తారు.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్‌–హెచ్‌ఆర్, ఐటీఐ లిమిటెడ్, ఐటీఐ భవన్, దూరవాణి నగర్, బెంగళూరు–560016 చిరునామకు పంపించాలి.ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 29.11.2021


వెబ్‌సైట్‌: https://www.itiltd.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 06 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఉద్యోగాలు.


నోయిడా(యూపీ)లోని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌)కు చెందిన రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌).. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టుల సంఖ్య: 06

పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(కెమికల్‌)–02, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (కెమికల్‌ ల్యాబ్‌)–02, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(హెచ్‌ఆర్‌)–01, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(వెల్ఫేర్‌)–01.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.11.2021


వెబ్‌సైట్‌: https://www.nationalfertilizers.com/