యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 52 ప్రొఫెసర్ ఉద్యోగాలు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా యూనివర్సిటీ మొత్తం 52 పోస్టులను భర్తీ చేయనున్నది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://uohyd.ac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. డిసెంబర్ 31వ తేదీలో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పేర్కొన్నది.
పోస్టుల వివరాలు
ప్రొఫెసర్ పోస్టులు 16
అసోసియేట్ ప్రొఫెసర్ 31
అసిస్టెంట్ ప్రొఫెసర్ 5
దరఖాస్తు ఫీజు
బీసీలు, ట్రాన్స్జెండర్లకు రూ.1000
దివ్యాంగులకు రూ. 500
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తులను చెక్ లిస్ట్, ఎన్‌క్లోజర్స్‌తో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ సెల్ డిప్యూటీ రిజిస్ట్రార్‌కు చేరేలా పంపాలని తెలిపింది. వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 50 అసిస్టెంట్ కమాండెంట్లు ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ 02/ 2022 బ్యాచ్ కోసం వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన స్ర్తీ/ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* అసిస్టెంట్ కమాండెంట్లు (గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్)
మొత్తం ఖాళీలు: 50
1) జనరల్ డ్యూటీ (మేల్): 30
అర్హత: కనీసం 60శాతం మార్కులతో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌తో పాటు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 01.07.1997 నుంచి 30.06.2021 మధ్య జన్మించి ఉండాలి.
2) కమర్షియల్ పైలట్ ఎంట్రీ (సీపీఎల్ - ఎస్ఎస్ఏ) (మేల్/ ఫిమేల్): 10
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో) ఉత్తీర్ణతతో పాటు డీజీసీఏ జారీ చేసిన వాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉండాలి.
వయసు: 01.07.1997 నుంచి 30.06.2021 మధ్య జన్మించి ఉండాలి.
3) టెక్నికల్ (ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రికల్) (మేల్): 10
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 01.07.1997 నుంచి 30.06.2021 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ప్రిలిమినీ పరీక్ష, ఫైనల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష: మెంటల్ ఎబిలిటీ టెస్ట్/ కాగ్నిటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంగ్లిష్ భాషలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫైనల్ సెలక్షన్ ప్రక్రియకి ఎంపిక చేస్తారు. ఈ ఫైనల్ సెలక్షన్లో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్) ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.12.2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.12.2021
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ రైల్వేలో 45 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
భారతీయ రైల్వే ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (RLDA)లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చేనెల 23 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 పోస్టులను భర్తీ చేస్తున్నది. బీఈ, బీటెక్ చేసిన దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గేట్లో అర్హత సాధించాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 45
అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ చేసి గేట్లో అర్హత సాధించాలి. అభ్యర్థులు 21 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 23
వెబ్సైట్: rlda.indianrailways.gov.in.
-----------------------------------------------------------------------------------------------------------------------------
టీహెచ్ఎస్టీఐలో 23 వివిధ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన గురుగ్రామ్‌లోని ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్(టీహెచ్ఎస్టీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 23
పోస్టులు: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, రిసెర్చ్ ఆఫీసర్, క్వాలిటీ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డేటా మేనేజర్, స్టాటిస్టీషయిన్, క్వాలిటీ మోనిటర్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, నర్సింగ్ డిప్లొమా, బీఎస్సీ/డీఎంఎల్టీ, గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ డిగ్రీ, ఎమ్మెస్సీ, పీజీ, ఎంబీబీఎస్, పీహెచ్డీ/ఎండీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.20,000 నుంచి రూ.1,25,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.590, ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.236 చెల్లించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 21.12.2021.
No comments:
Post a Comment