Tuesday, 18 January 2022

ఏడబ్ల్యూఈఎస్‌ - 8700 టీచర్‌ పోస్టులు, బీఎస్‌ఎఫ్‌లో 2788 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు, నవోదయ విద్యాలయ సమితిలో 1925 వివిధ ఖాళీలు.

 ఏడబ్ల్యూఈఎస్‌ - 8700 టీచర్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో కింది టీచర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వివరాలు..

* టీచర్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 8700

పోస్టులు: పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), ప్రైమరీ టీచర్‌ (పీఆర్‌టీ).

అర్హత: 


1) పీజీటీ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత.

2) ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌, బీఈడీ ఉత్తీర్ణత.

3) ప్రైమరీ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌, రెండేళ్ల డిప్లొమా (ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌)/ బీఈడీ ఉత్తీర్ణత. 

వయసు: ఫ్రెష్‌ అభ్యర్థులు 01.04.2021 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి. ఐదేళ్లకు తగ్గకుండా టీచింగ్‌ అనుభవం ఉండాలి. అనుభవం ఉన్న అభ్యర్థులు 57 ఏళ్లు  మించకుండా ఉండాలి. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ఓఎస్‌టీ), ఇంటర్వ్యూ, టీచింగ్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో (ఎంసీక్యూ) ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.385 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తులకు చివరి తేది: 28.01.2022.

ఆన్‌లైన్‌లో అడ్మిట్‌ కార్డుల విడుదల తేది: 10.02.2022 నుంచి అందుబాటులో ఉంచుతారు.

స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీలు: 2022, ఫిబ్రవరి 19, 20

-----------------------------------------------------------------------------------------------------------------------------

బీఎస్‌ఎఫ్‌లో 2788 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకి చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ 2021-2022 సంవత్సరానికి గాను కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మెన్‌)

మొత్తం ఖాళీలు: 2788 (పురుషులు - 2651, మహిళలు-137)

1)  కాబ్లర్‌ - 91 (పురుషులు - 88, మహిళలు-03)

2) టైలర్‌: 49  (పురుషులు - 47, మహిళలు-02)

3) కుక్‌: 944 (పురుషులు - 897, మహిళలు - 47)

4) డబ్ల్యూ/సీ: 537 (పురుషులు - 510, మహిళలు - 27)

5) డబ్ల్యూ/ఎం: 356 (పురుషులు - 338, మహిళలు - 18)

6) బార్బర్‌: 130 (పురుషులు - 123, మహిళలు - 07)

7) స్వీపర్‌: 637 (పురుషులు - 617, మహిళలు - 20)

8) కార్పెంటర్‌: 13

9) పెయింటర్‌: 03

10) ఎలక్ట్రీషియన్‌: 04

11) డ్రాఫ్ట్స్‌మెన్‌: 01

12) వెయిటర్‌: 06

13) మాలి: 04

అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో రెండేళ్ల డిప్లొమా/ రెండేళ్ల పని అనుభవం ఉండాలి. నిర్ధిష్ఠ శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 

జీతభత్యాలు: నెలకి రూ. 21,700 నుంచి రూ.69,100 పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు అందజేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2022 జనవరి 15-21)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి

-----------------------------------------------------------------------------------------------------------------------------

నవోదయ విద్యాలయ సమితిలో 1925 వివిధ ఖాళీలు

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడా-ఉత్తరప్రదేశ్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పని చేయుటకు కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 1925

పోస్టులు: అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్ (సివిల్), స్టెనోగ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మహిళా స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ తదితరాలు.

అర్హత: 

1. అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-ఏ): మాస్టర్స్ డిగ్రీ హ్యుమానిటీస్/ సైన్స్/ కామర్స్‌ ఉత్తీర్ణత. 

మొత్తం ఖాళీలు: 05 

పని అనుభవం: కనీసం 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి. 

వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.

2. అసిస్టెంట్ కమిషనర్ (అడ్మిన్) (గ్రూప్ ఏ): గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత.

మొత్తం ఖాళీలు: 02 

వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.

3. మహిళా స్టాఫ్ నర్సు (గ్రూప్ బీ): ఇంటర్మీడియట్‌/ తత్సమానం/ B.Sc (నర్సింగ్) ఉత్తీర్ణత.

మొత్తం ఖాళీలు: 82 

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు. 

4. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (గ్రూప్ సీ): డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉత్తీర్ణత.

మొత్తం ఖాళీలు: 10 

వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి. 

5. ఆడిట్ అసిస్టెంట్ (గ్రూప్ సీ): బీకామ్‌ ఉత్తీర్ణత. 

మొత్తం ఖాళీలు: 11 

వయసు: 18 నుంచి  30 సంవత్సరాలు మధ్య ఉండాలి. 

6. జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ (గ్రూప్ బీ): డిప్లొమా/ పీజీ ఉత్తీర్ణత.  

మొత్తం ఖాళీలు: 04 

వయసు: 35 సంవత్సరాల వరకు ఉండాలి. 

7. జూనియర్ ఇంజినీర్ (సివిల్) (గ్రూప్ సీ):  డిప్లొమా/డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.

మొత్తం ఖాళీలు: 01 

వయసు: 35 సంవత్సరాల వరకు. 

8. స్టెనోగ్రాఫర్ (గ్రూప్ సీ): ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. షార్ట్‌హ్యాండ్ పరిజ్ఞానం ఉండాలి.

మొత్తం ఖాళీలు: 22 

వయసు: 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి.  

9. కంప్యూటర్ ఆపరేటర్ (గ్రూప్ సీ):  డిగ్రీ/ కంప్యూటర్ డిప్లొమా ఉత్తీర్ణత. 

మొత్తం ఖాళీలు: 04 

వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. 

10. క్యాటరింగ్ అసిస్టెంట్ (గ్రూప్ సీ): ఇంటర్మీడియట్‌, డిప్లొమా (కేటరింగ్) ఉత్తీర్ణత. 

మొత్తం ఖాళీలు: 87 

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.

11. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (గ్రూప్ సీ):  సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణత. టైప్ రైటింగ్ నాలెడ్జ్ ఉండాలి. 

మొత్తం ఖాళీలు: 630 

వయసు: 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. 

12. ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్ (గ్రూప్ సీ):  10వ తరగతి, ఐటీఐ (ఎలక్ట్రిషియన్ / వైర్‌మ్యాన్ / ప్లంబింగ్) ఉత్తీర్ణత.

మొత్తం ఖాళీలు: 273 

వయసు: 18 నుంచి 40 సంవత్సరాలు ఉండాలి.

13. ల్యాబ్ అటెండెంట్ (గ్రూప్ సీ):  10వ/ 12వ తరగతి (సైన్స్), డిప్లొమా (లేబొరేటరీ టెక్నిక్) ఉత్తీర్ణత.

మొత్తం ఖాళీలు: 142 

వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి.

14. మెస్ హెల్పర్ (గ్రూప్ సీ):  మెట్రిక్యులేషన్

మొత్తం ఖాళీలు: 629

వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి.

15. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గ్రూప్ సీ):  10వ తరగతి 

మొత్తం ఖాళీలు: 23

వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి.

వయోపరిమితి: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగులకు వయసు సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు: పోస్టును అనుసరించి నెలకు రూ.18000- రూ.209200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు పీజు: పోస్టును అనుసరించి రూ.750-రూ.1500 వరకు చెల్లించాలి.

దరఖాస్తు చివరి తేది: 10.02.2022

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: 09.03.2022-11.03.2022



సీఐఎస్‌ఎఫ్‌లో 249 హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 198 ఉద్యోగాలు, సెబీలో 120 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు.

 సీఐఎస్‌ఎఫ్‌లో 249 హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF) హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 249 కేసులను భర్తీ చేస్తున్నది. ఫిజికల్‌ టెస్ట్‌, ట్రయల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

మొత్తం పోస్టులు: 249

ఇందులో మహిళలకు 68, పురుషులకు 181 చొప్పున కేటాయించారు.

అర్హతలు: అభ్యర్థులు ఇంటర్‌ పాసై, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఏదైనా క్రీడాలో పాల్గొని ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఫిజిలక్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ట్రయల్‌ టెస్ట్‌, ప్రొఫిషియెన్సీ టెస్ట్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు: రూ.100

దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31

వెబ్‌సైట్‌: https://www.cisf.gov.in/

-----------------------------------------------------------------------------------------------------------------------------

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 198 ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్ బరోడా ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 198

1) క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం: 53

2) రిసీవబుల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం: 145

పోస్టులు: అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్, హెడ్‌ స్ట్రాటజీ, వెండర్‌ మేనేజర్‌, ఎంఐఎస్‌ మేనేజర్‌, ప్రాసెస్‌ మేనేజర్ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ సీఏ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు బ్యాంకింగ్‌, టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.01.2022.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.02.2022

-----------------------------------------------------------------------------------------------------------------------------

సెబీలో 120 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (SEBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్‌ గ్రేడ్‌-ఏ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు ఈ నెల 24 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 120 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు ఉన్నాయి. ఇవి జనరల్‌, లీగల్‌, ఇన్ఫర్మేషన్‌, రిసెర్చ్‌, అధికారిక భాష విభాగాల్లో ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నది.

మొత్తం పోస్టులు: 120

ఇందులో జనరల్‌ విభాగంలో 80, లీగల్‌ 16, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 14, రిసెర్చ్‌ 7, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హత: లా, ఇంజినీరింగ్‌లో డిగ్రీ, పీజీ, సీఏ, సీఎఫ్‌ఏ, సీఎస్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో, హిందీలో పీజీ చేసి ఉండాలి. అభ్యర్థులు 30 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.100

దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 24

వెబ్‌సైట్‌: www.sebi.gov.in

బీఓబీలో 58 హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్లు ఉద్యోగాలు, సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే, కోల్‌కతాలో 21 స్పోర్ట్స్‌ కోటా పోస్టులు, నార్తర్న్‌ రైల్వేలో 21 స్పోర్ట్స్‌ కోటా పోస్టులు.

బీఓబీలో 58 హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్లు ఉద్యోగాలు

దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB) హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ పోస్టలను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ను విస్తృతం చేయడంలో భాగంగా 58 పోస్టుల భర్తీ చేపట్టింది. ఇందులో ఎన్‌ఆర్‌ఐ వెల్త్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారిని ఐదేండ్ల కాలపరిమితితో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తున్నారు. అభ్యర్థులు పనితీరునుబట్టి పదవీకాలాన్ని పొడిగిస్తారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మొత్తం పోస్టులు: 58

ఇందులో ఎన్‌ఆర్‌ఐ వెల్త్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌ 1, ప్రోడక్ట్‌ మేనేజర్‌ 31, ఇన్వెస్ట్‌మెంట్‌ రిసెర్చ్‌ మేనేజర్‌ 4, గ్రూప్‌ సేల్స్‌ హెడ్‌ 22 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

ఎంపిక ప్రక్రియ: పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్ ద్వారా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీలకు రూ.100

దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 27

వెబ్‌సైట్‌: www.bankofbarodacoin/careers.htm.

-----------------------------------------------------------------------------------------------------------------------------

సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే, కోల్‌కతాలో 21 స్పోర్ట్స్‌ కోటా పోస్టులు

కోల్‌కతాలోని సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే(ఎస్‌ఈఆర్‌).. స్పోర్ట్స్‌ కోటా పరిధిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21

క్రీడలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, కబడ్డీ, స్విమ్మింగ్‌ తదితరాలు.

అర్హత: ఇంటర్మీడియట్‌/డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు, సంబంధిత క్రీడా విభాగంలో జాతీయ స్థాయిలో అర్హత సాధించాలి.

వయసు: కనీసం 18 ఏళ్లు ఉండాలి.

జీతం: సంబంధిత క్రీడ, అకడమిక్‌ విద్యను అనుసరించి 6, 7వ జాతీయ పేకమిషన్‌ నిబంధనల ప్రకారం జీతం చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్పోర్ట్స్‌ నైపుణ్యాలకు 50 మార్కులు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు 40 మార్కులు, అకడమిక్‌ క్వాలిఫికేషన్‌కు 10 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్, బంగ్లా నెం:12ఏ, గార్డెన్‌ రీచ్, కోల్‌కతా–700043 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 02.02.2022

వెబ్‌సైట్‌: https://ser.indianrailways.gov.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

నార్తర్న్‌ రైల్వేలో 21 స్పోర్ట్స్‌ కోటా పోస్టులు

న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న నార్తర్న్‌ రైల్వే(ఎన్‌ఆర్‌), రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21

క్రీడలు: అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్‌ బాల్, చెస్‌ తదితరాలు.

అర్హత: వివిధ స్థాయిలను అనుసరించి ఇంటర్మీడియట్‌/తత్సమాన, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ఒలింపిక్స్‌/వరల్డ్‌కప్‌/వరల్డ్‌ చాంపియన్‌షిప్‌/చాంఫియన్స్‌ ట్రోఫీ/కామన్‌వెల్త్‌ చాంపియన్‌షిప్స్‌/యూనివర్శిటీ గేమ్స్‌లో పాల్గొని ఉండాలి.

వయసు: 01.01.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: గేమ్‌ స్కిల్, ఫిజికల్‌ ఫిట్‌నెస్, ఫీల్డ్‌ ట్రయల్స్,సంబంధిత క్రీడలో సాధించిన విజయాలు,విద్యార్హతల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.01.2022

వెబ్‌సైట్‌: http://www.rrcnr.org/