Friday, 25 March 2022

Telangana State Public Service Commission Recruitment 2022 Group I Exam 2022 – 503 Posts www.tspsc.gov.in

తెలంగాణలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. తెలంగాణలో 83,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ గ్రూప్‌-1 ఖాళీల భర్తీకి అనుమతులు ఇస్తూ ఆర్థిక శాఖ జీఓ విడుదల చేసింది.

త్వరలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అయితే.. చాలా ఏళ్ల తర్వాత గ్రూప్- 1 నోటిఫికేషన్ విడుదల అవుతుండడంతో భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వయో పరిమితిని కూడా సడలించడంతో లక్షల్లో అభ్యర్థులు పోటీ పడే అవకాశాలున్నాయి. వివరాల్లోకెళ్తే.


మొత్తం గ్రూప్‌ –1 పోస్టులు: 503

    జిల్లా బీసీ అభివద్ధి అధికారి– 2
    అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌– 40
    అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌– 38
    అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(వైద్యారోగ్యశాఖ)– 20
    డీఎస్పీ– 91
    జైల్స్‌ డిప్యూటీ సూపరిండెంట్‌– 2
    అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌– 8
    డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌– 2
    జిల్లా మైనారీటీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌– 6
    మునిసిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ (2) - 35
    ఎంపీడీవో- 121
    డీపీవో- 5
    కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌- 48
    డిప్యూటీ కలెక్టర్‌- 42
    అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌- 26
    జిల్లా రిజిస్ట్రార్‌- 5
    జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌- 3
    ఆర్టీవో- 4
    జిల్లా గిరిజన సంక్షేమాధికారి- 2 



TS TET 2022 Telangana State Teachers Eligibility Test Notification tstet.cgg.gov.in Last Date 12-04-2022

రేపటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు  నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగం పుంజుకొంటున్నది. టీచర్‌ పోస్టుల భర్తీకి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు సంబంధించిన నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. టెట్‌ను జూన్‌ 12న నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. శనివారం నుంచి ఏప్రిల్‌ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాలకు http://tstet.cgg.gov.in లో సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది. పాఠశాల విద్యాశాఖలో 13,086 కొలువులను భర్తీ చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అందులో 10 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టెట్‌ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017జులైలో టెట్‌ నిర్వహించారు. గతంలో టెట్‌ సర్టిఫికెట్‌కు ఏడు సంవత్సరాలు మాత్రమే విలువ ఉండేది. సవరించిన నిబంధనల ప్రకారం టెట్‌లో ఒక్కసారి అర్హత సాధిస్తే అది జీవితాంతం వర్తిస్తుంది. టెట్‌లో వచ్చిన మారులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు

పరీక్ష విధానం

టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. మల్టిపుల్‌ చాయిస్‌లో 150 ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ క్యాటగిరీ విద్యార్థులు కనీసం 90 మార్కులు (60%), బీసీలు 75 మార్కులు (50%), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 60 మార్కులు (40%) మార్కులు సాధించాల్సి ఉంటుంది. టెట్‌ను పేపర్‌-1, పేపర్‌-2గా నిర్వహిస్తారు. గతంలో పేపర్‌-1ను డీఈడీ అభ్యర్థులు, పేపర్‌-2న బీఈడీ అభ్యర్థులు రాసేవారు. ఇప్పుడు బీఈడీ అభ్యర్థులకు పేపర్‌-1 కూడా రాసే అవకాశం కల్పించారు. అయితే, ఎస్జీటీలుగా (1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు) ఎంపికైన బీఈడీ అభ్యర్థులు ఉద్యోగంలో చేరిన రెండేండ్లలో ప్రాథమిక విద్యా బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది



Wednesday, 2 March 2022

ఇండియన్‌ నేవీలో 1531 ట్రేడ్స్‌మెన్‌ పోస్టులు, ఆర్‌బీఐలో 950 అసిస్టెంట్ పోస్టులు, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)లో 756 ఉద్యోగాలు

ఇండియన్‌ నేవీలో 1531 ట్రేడ్స్‌మెన్‌ పోస్టులు

ఇండియన్‌ నేవీలో ట్రేడ్స్‌మెన్‌ స్కిల్డ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని ఇండయన్‌ నేవీ సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1531 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో గ్రూప్‌ సీ, నాన్‌ గెజెటెడ్‌ పోస్టులు ఉన్నాయి. పదో తరగతి పాసైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది.


మొత్తం పోస్టులు: 1531

అర్హతలు: పదో తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. ఇంగ్లిష్‌లో కనీస పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థులు 25 ఏండ్లలోపు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 22 నుంచి

దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఆర్‌బీఐలో 950 అసిస్టెంట్ పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్‌ బ్యాంక్, రెగ్యులేటరీ సంస్థ అయిన ముంబయి ప్రధాన కేంద్రంగా నడిచే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

పోస్టుల వారీగా వివరాలు

    అసిస్టెంట్లు: 950

    ఎంపిక ప్రక్రియ: రెండు దశల అర్హత పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్‌లైన్‌ (సీబీటీ) టెస్ట్, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 08, 2022
ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ఎగ్జామినేషన్‌ తేదీలు: 2022 మార్చి 26,27

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)లో 756 ఉద్యోగాలు


భువనేశ్వర్‌(ఒడిశా) ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. వివిధ డివిజన్లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 756

ఖాళీల వివరాలు: క్యారేజ్‌ రిపేర్‌ వర్క్‌షాప్‌–190, కుర్దా రోడ్‌ డివిజన్‌–237, వాల్తేర్‌ డివిజన్‌–263, సంబల్‌పూర్‌ డివిజన్‌–66.

ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వైర్‌మెన్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ జారీ చేసిన ఐటీఐ సర్టిఫికేట్‌ ఉండాలి.

వయసు: 07.03.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని డాక్యుమెంట్‌/సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ అనంతరం ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.03.2022

వెబ్‌సైట్‌: https://eastcoastrail.indianrailways.gov.in/

ఇండియన్‌ బ్యాంక్‌లో 202 పోస్టులు, ఇండియన్‌ నేవీ - 155 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు ఉద్యోగాలు, ఇండియన్‌ నేవీ-127 సివిలియన్‌ ఉద్యోగాలు

ఇండియన్‌ బ్యాంక్‌లో 202 పోస్టులు

చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్‌ బ్యాంక్‌.. దేశవ్యాప్తంగా సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 202

అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ (ఆర్మీ/నేవీ/ఎయిర్‌ ఫోర్స్‌) అయి ఉండాలి.

వయసు: 26 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌(ఆన్‌లైన్‌), టెస్ట్‌ ఆఫ్‌ లోకల్‌ లాంగ్వేజ్, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, వాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ పరీక్ష: ఈ పరీక్షని మొత్తం 40 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.03.2022

వెబ్‌సైట్‌: https://www.indianbank.in/

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఇండియన్‌ నేవీ - 155 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు ఉద్యోగాలు


భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఇండియన్‌ నేవీ 2023 జనవరి (ఎస్‌టీ 23) కోర్సు వివిధ విభాగాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ల భర్తీకి అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 155

బ్రాంచిల వారీగా ఖాళీలు: 

1) ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌: 93

విభాగాలు: జనరల్‌ సర్వీస్, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌, అబ్జర్వర్‌, పైలట్‌, లాజిస్టిక్స్‌.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్‌ నైపుణ్యాలు.

2) ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ (ఎడ్యుకేషన్): 17

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. 

3) టెక్నికల్ బ్రాంచ్‌: 45

విభాగాలు: ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ (జనరల్ సర్వీస్‌), ఎలక్ట్రికల్ బ్రాంచ్‌ (జనరల్‌ సర్వీస్‌)

అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.

వయసు: 02 జనవరి 1998 - 01 జులై 2003 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.02.2022.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 12.03.2022

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఇండియన్‌ నేవీ-127 సివిలియన్‌ ఉద్యోగాలు


భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ముంబయికి చెందిన ఇండియన్‌ నేవీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 127

పోస్టులు: ఫార్మసిస్ట్‌, ఫైర్‌మ్యాన్‌, పెస్ట్‌కంట్రోల్‌ వర్కర్‌.

అర్హత: 

1. ఫార్మసిస్ట్‌: మెట్రిక్యులేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత.

జీతభత్యాలు: నెలకు రూ.29200 చెల్లిస్తారు.

2. ఫైర్‌మ్యాన్‌: మెట్రిక్యులేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత.

జీతభత్యాలు: నెలకు రూ.19900 చెల్లిస్తారు.

3. పెస్ట్‌కంట్రోల్‌ వర్కర్‌: మెట్రిక్యులేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత.

జీతభత్యాలు: నెలకు రూ.18000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిషికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* అబ్సార్‌ప్షన్‌ ప్రాతిపదికన నియామకం చేపట్టనున్నారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌, వెస్టర్న్‌ నావెల్‌ కమాండ్‌, బాల్లాడ్‌ పీర్‌, టైగర్‌ గేట్‌, ముంబయి 400001.

దరఖాస్తు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి

బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌లో 81 జూనియర్‌ టెక్నీషియన్లు ఉద్యోగాలు, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో 55 పోస్టులు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 42 ఉద్యోగాలు, యూపీఎస్సీ-29 ఉద్యోగాలు/

బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌లో 81 జూనియర్‌ టెక్నీషియన్లు ఉద్యోగాలు

బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌లో (Bank Note Press) ఖాళీగా ఉన్న జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు వచ్చే నెల 28 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 81 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఈ ఉద్యోగాలు ఇంక్‌ ఫ్యాక్టరీ, ప్రింటింగ్‌, ఎలక్ట్రికల్‌ లేదా ఐటీ విభాగాల్లో ఉన్నాయి. ఎంపికైనవారు మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో పనిచేయాల్సి ఉంటుంది

మొత్తం పోస్టులు: 81

అర్హతలు: ఐటీఐలో డిప్యూటీ టెక్నాలజీ, పెయింట్‌ టెక్నాలజీ, పర్ఫేస్‌ కోటింట్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ ఇంక్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, లిథో ఆఫ్‌సెట్‌ మెషిన్‌ మైండర్, లెటర్‌ ప్రెస్‌ మెషిన్‌ మైండర్‌, ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌, ప్లేట్‌ మేకింగ్‌, ఎలక్ట్రో ప్లాటింగ్‌లో ఏదో ఒకటి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సువారై ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా


రాతపరీక్ష : మొత్తం125 మార్కులకు 100 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. 120 నిముషాల పాటు పరీక్ష రాయవల్సి ఉంటుంది. టెక్నికల్‌/ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాల్లో ప్రశ్నలుంటాయి.

అప్లికేషన్‌ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు రూ.200.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

ఆన్‌లైన్‌ రాతపరీక్ష తేదీ: ఏప్రిల్/మే 2022

దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 28

వెబ్‌సైట్: bnpdewas.spmcil.com


-----------------------------------------------------------------------------------------------------------------------------

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో 55 పోస్టులు


భారత ప్రభుత్వరంగానికి చెందిన నవరత్న సంస్థ అయిన అసోంలోని ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ కింది గ్రేడ్‌ బి, గ్రేడ్‌ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 55

1) మేనేజర్‌: 01

2) సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌: 02

3) సూపరింటెండింగ్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 02

4) సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 01

5) సీనియర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌: 01

6) సీనియర్‌ ఆఫీసర్లు: 43

7) సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌: 05

విభాగాలు: ఎన్విరాన్‌మెంట్‌, రేడియాలజీ, సివిల్, ఎలక్ట్రికల్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, పబ్లిక్‌ అఫైర్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఎండీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: గ్రేడ్‌ సీ పోస్టులకు నెలకి రూ.80000-220000, గ్రేడ్‌ బి పోస్టులకు నెలకి రూ.60000-180000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, గ్రూప్‌ టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.03.2022.

-----------------------------------------------------------------------------------------------------------------------------

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 42 ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒప్పంద/ రెగ్యులర్‌ విధానంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 42

1) సీనియర్‌ మేనేజర్లు: 27

2) మేనేజర్లు: 04

3) హెడ్‌/ డిప్యూటీ హెడ్‌: 11

విభాగాలు: రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, క్రెడిట్‌ రిస్క్ మేనేజ్‌మెంట్ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సీఏ/ ఎంబీఏ/ పీజీడీఎం/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 24 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.02.2022.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.03.2022


-----------------------------------------------------------------------------------------------------------------------------

యూపీఎస్సీ-29 ఉద్యోగాలు


యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 29

పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.

విభాగాలు: బ్యూరో ఆఫ్‌ అవుట్‌ రీచ్‌ కమ్యునికేషన్‌, యునాని.

అర్హత: 

1. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌: డిగ్రీ(ఆర్ట్స్‌/ కామర్స్‌/ సైన్స్‌) ఉత్తీర్ణత.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

పని అనుభవం: కనీసం 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.\

2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

వయసు: 45-50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.25

దరఖాస్తు చివరి తేది: 17.03.2022