Wednesday, 2 March 2022

ఇండియన్‌ నేవీలో 1531 ట్రేడ్స్‌మెన్‌ పోస్టులు, ఆర్‌బీఐలో 950 అసిస్టెంట్ పోస్టులు, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)లో 756 ఉద్యోగాలు

ఇండియన్‌ నేవీలో 1531 ట్రేడ్స్‌మెన్‌ పోస్టులు

ఇండియన్‌ నేవీలో ట్రేడ్స్‌మెన్‌ స్కిల్డ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని ఇండయన్‌ నేవీ సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1531 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో గ్రూప్‌ సీ, నాన్‌ గెజెటెడ్‌ పోస్టులు ఉన్నాయి. పదో తరగతి పాసైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది.


మొత్తం పోస్టులు: 1531

అర్హతలు: పదో తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. ఇంగ్లిష్‌లో కనీస పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థులు 25 ఏండ్లలోపు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 22 నుంచి

దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఆర్‌బీఐలో 950 అసిస్టెంట్ పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్‌ బ్యాంక్, రెగ్యులేటరీ సంస్థ అయిన ముంబయి ప్రధాన కేంద్రంగా నడిచే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

పోస్టుల వారీగా వివరాలు

    అసిస్టెంట్లు: 950

    ఎంపిక ప్రక్రియ: రెండు దశల అర్హత పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్‌లైన్‌ (సీబీటీ) టెస్ట్, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 08, 2022
ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ఎగ్జామినేషన్‌ తేదీలు: 2022 మార్చి 26,27

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)లో 756 ఉద్యోగాలు


భువనేశ్వర్‌(ఒడిశా) ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. వివిధ డివిజన్లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 756

ఖాళీల వివరాలు: క్యారేజ్‌ రిపేర్‌ వర్క్‌షాప్‌–190, కుర్దా రోడ్‌ డివిజన్‌–237, వాల్తేర్‌ డివిజన్‌–263, సంబల్‌పూర్‌ డివిజన్‌–66.

ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వైర్‌మెన్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ జారీ చేసిన ఐటీఐ సర్టిఫికేట్‌ ఉండాలి.

వయసు: 07.03.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని డాక్యుమెంట్‌/సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ అనంతరం ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.03.2022

వెబ్‌సైట్‌: https://eastcoastrail.indianrailways.gov.in/

No comments:

Post a Comment