బ్యాంక్ నోట్ ప్రెస్‌లో 81 జూనియర్ టెక్నీషియన్లు ఉద్యోగాలు
బ్యాంక్ నోట్ ప్రెస్‌లో (Bank Note Press) ఖాళీగా ఉన్న జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 28 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 81 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఈ ఉద్యోగాలు ఇంక్ ఫ్యాక్టరీ, ప్రింటింగ్, ఎలక్ట్రికల్ లేదా ఐటీ విభాగాల్లో ఉన్నాయి. ఎంపికైనవారు మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో పనిచేయాల్సి ఉంటుంది
మొత్తం పోస్టులు: 81
అర్హతలు: ఐటీఐలో డిప్యూటీ టెక్నాలజీ, పెయింట్ టెక్నాలజీ, పర్ఫేస్ కోటింట్ టెక్నాలజీ, ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, లిథో ఆఫ్సెట్ మెషిన్ మైండర్, లెటర్ ప్రెస్ మెషిన్ మైండర్, ఆఫ్సెట్ ప్రింటింగ్, ప్లేట్ మేకింగ్, ఎలక్ట్రో ప్లాటింగ్‌లో ఏదో ఒకటి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సువారై ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా
రాతపరీక్ష : మొత్తం125 మార్కులకు 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 120 నిముషాల పాటు పరీక్ష రాయవల్సి ఉంటుంది. టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల్లో ప్రశ్నలుంటాయి.
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు రూ.200.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
ఆన్లైన్ రాతపరీక్ష తేదీ: ఏప్రిల్/మే 2022
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 28
వెబ్సైట్: bnpdewas.spmcil.com
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 55 పోస్టులు
భారత ప్రభుత్వరంగానికి చెందిన నవరత్న సంస్థ అయిన అసోంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ కింది గ్రేడ్ బి, గ్రేడ్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 55
1) మేనేజర్: 01
2) సూపరింటెండింగ్ ఇంజినీర్: 02
3) సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్: 02
4) సీనియర్ మెడికల్ ఆఫీసర్: 01
5) సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్: 01
6) సీనియర్ ఆఫీసర్లు: 43
7) సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 05
విభాగాలు: ఎన్విరాన్మెంట్, రేడియాలజీ, సివిల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, పబ్లిక్ అఫైర్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంబీఏ, పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ/ డీఎన్బీ ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: గ్రేడ్ సీ పోస్టులకు నెలకి రూ.80000-220000, గ్రేడ్ బి పోస్టులకు నెలకి రూ.60000-180000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.03.2022.
-----------------------------------------------------------------------------------------------------------------------------
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 42 ఉద్యోగాలు
భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పంద/ రెగ్యులర్ విధానంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 42
1) సీనియర్ మేనేజర్లు: 27
2) మేనేజర్లు: 04
3) హెడ్/ డిప్యూటీ హెడ్: 11
విభాగాలు: రిస్క్ మేనేజ్మెంట్, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్, క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సీఏ/ ఎంబీఏ/ పీజీడీఎం/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 24 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.02.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.03.2022
-----------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ-29 ఉద్యోగాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 29
పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ కమ్యునికేషన్, యునాని.
అర్హత:
1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: డిగ్రీ(ఆర్ట్స్/ కామర్స్/ సైన్స్) ఉత్తీర్ణత.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
పని అనుభవం: కనీసం 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.\
2. అసిస్టెంట్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
వయసు: 45-50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.25
దరఖాస్తు చివరి తేది: 17.03.2022
No comments:
Post a Comment