స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) 3603 పోస్టులకు నోటిఫికేషన్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ).. మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవల్దార్(సీబీఐసీ అండ్ సీబీఎన్) పోస్టులకు పరీక్షను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్–టెక్నికల్)–ఖాళీల వివరాలు తర్వాత వెల్లడిస్తారు.
హవల్దార్(సీబీఐసీ అండ్ సీబీఎన్)–3603.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్(పదో తరగతి) పరీక్ష/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: వివిధ విభాగాలను అనుసరించి 01.01.2022 నాటికి 18–25 ఏళ్లు, 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష (పేపర్–1, పేపర్–2), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ)/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1 ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పేపర్–2 డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ సబ్జెక్టులు ఉంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
పేపర్–2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇది 50 మార్కులకు ఉంటుంది.షార్ట్ ఎస్సే/లెటర్ ఇన్ ఇంగ్లిష్ రాయాల్సి ఉంటుంది. పరీక్షా సమయం 45 నిమిషాలు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.04.2022
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(టైర్–1): జూలై 2022
టైర్–2 (డిస్క్రిప్టివ్ పేపర్): తేది వెల్లడించాల్సి ఉంది.
వివరాలకు వెబ్సైట్: https://ssc.nic.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
బీఈసీఐఎల్ లో 378 ఉద్యోగాలు
నోయిడాలోని బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్).. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ(డీడీఏ)లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 378
పోస్టుల వివరాలు: ఆఫీస్ అసిస్టెంట్లు–200, డేటాఎంట్రీ ఆపరేటర్లు–178
ఆఫీస్ అసిస్టెంట్లు:
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష (ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్), కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటరాక్షన్/డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
డేటాఎంట్రీ ఆపరేటర్లు:
అర్హత: ఇంటర్మీడియట్(10+2)/ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.04.2022
వెబ్సైట్: https://www.becil.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
బీఐఎస్లో 337 ఉద్యోగాలు
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 9 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 337 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, పర్సనల్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ రాపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు
మొత్తం పోస్టులు: 337
ఇందులో డైరెక్టర్ 1, అసిస్టెంట్ డైరెక్టర్ 3, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 47, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 61, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 100, సీనియర్ టెక్నీషియన్ 25, పర్సనల్ అసిస్టెంట్ 28, అసిస్టెంట్ 2, టెక్నికల్ అసిస్టెంట్ 47, మెకానికల్ 19, కెమికల్ 18, మైక్రోబయాలజీ 10, స్టెనోగ్రాఫర్ 22, హార్టికల్చ్ సూపర్వైజర్ 1 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ, పీజీ డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 19
దరఖాస్తులకు చివరితేదీ: మే 9
వెబ్సైట్: www.bis.gov.in
No comments:
Post a Comment