ఐబీలో 150 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ.. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు గ్రేడ్–2(ఏసీఐఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 150
» పోస్టుల వివరాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–56, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్–94.
» అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్ గేట్ 2020/2021/2022 స్కోర్ కార్డు ఉండాలి.
» వయసు: 07.05.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
» జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: వాలిడ్ గేట్ 2020/2021/2022 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.05.2022
» వెబ్సైట్: https://www.mha.gov.in or www.ncs.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
సుప్రీంకోర్టులో 25 జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులు
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court ) జూనియర్ ట్రాన్స్‌లేటర్ (కోర్ట్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 25 పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష, టైప్ స్పీడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నది
మొత్తం ఖాళీలు: 25
ఇందులో జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఇంగ్లిష్ నుంచి తెలుగు 2, ఇంగ్లిష్ నుంచి అస్సామీ 2, ఇంగ్లిష్ నుంచి బెంగాలి 2, ఇంగ్లిష్ నుంచి గుజరాతి 2, ఇంగ్లిష్ నుంచి ఉర్దూ 2, ఇంగ్లిష్ నుంచి మరాఠా 2, ఇంగ్లిష్ నుంచి కన్నడ 2, ఇంగ్లిష్ నుంచి మలయాళం 2, ఇంగ్లిష్ నుంచి మణిపూరి 2, ఇంగ్లిష్ నుంచి ఒడియా 2, ఇంగ్లిష్ నుంచి పంజాబీ 2, ఇంగ్లిష్ నుంచి నేపాలి 1 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ చేసి రెండేండ్ల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 32 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, టైపింగ్ స్పీడ్ టెస్ట్, వైవా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 18
దరఖాస్తులకు చివరితేదీ: మే 14
వెబ్సైట్: www.sci.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్బీఐలో 8 స్పెషలిస్ట్ ఆఫీసర్లు
దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 28 వరకు ఆన్లైన్లో దరకాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఎనిమిది పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో మేనేజర్ 2, అడ్వయిజర్ 4, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 2 చొప్పున ఉన్నాయి
అర్హతలు: ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్, బీకామ్, బీఈ, బీటెక్, ఎంబీఏ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 28
వెబ్సైట్: www.sbi.co.in
No comments:
Post a Comment