Thursday, 28 April 2022

ఎస్సై 587, కానిస్టేబుల్‌ 16,027 తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) 16,614 పోలీసు పోస్టుల నోటిఫికేషన్‌ విడుదల tslprb.in

ఎస్సై 587, కానిస్టేబుల్‌ 16,027 

తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) 16,614 పోలీసు పోస్టుల నోటిఫికేషన్‌ విడుదల

tslprb.in


కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు


    కానిస్టేబుల్‌(సివిల్‌): 4965
    కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423
    కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100
    కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
    కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390
    ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610
    వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136
    వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10
    కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262
    కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21
    కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100
    మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు: 16,027

ఎస్సై పోస్టుల వివరాలు


    సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(సివిల్‌): 414
    సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఆర్‌): 66
    సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌)(పురుషులు): 5
    సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
    సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)(పురుషులు): 12
    స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌(డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 26
    డిప్యూటీ జైలర్‌(పురుషులు): 8
    సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 22
    సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌)(పురుషులు): 3
    సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో): 8
    మొత్తం ఎస్సై పోస్టులు: 587


నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
మే 2 నుంచి 20 వరకు tslprb.inలో దరఖాస్తు
అర్హులైన అభ్యర్థులకు యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌
28 ఏండ్ల వరకూ జనరల్‌ క్యాటగిరీకి అవకాశం

ఎస్సై ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనేందుకు గతంలో గరిష్ఠ వయోపరిమితి 25 ఏండ్లు ఉండగా, ఇప్పుడు 28 ఏండ్ల వరకు కూడా జనరల్‌ క్యాటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు గరిష్ఠ వయో పరిమితిని సైతం 22 ఏండ్ల నుంచి 25 ఏండ్లకు పెంచారు.

 తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మరోమారు భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖలు కొలువుల భర్తీకి చర్యలు ప్రారంభించాయి. మొదటగా పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో 16,614 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో ఎస్సై పోస్టులు 587 కాగా, కానిస్టేబుల్‌ పోస్టులు 16,027 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండో అతిభారీ నోటిఫికేషన్‌ కావడం గమనార్హం. 2018లో 18వేల పైచిలుకు పోలీసు పోస్టులు భర్తీ చేయగా, మరోమారు దాదాపు అదేస్థాయిలో 16,614 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎస్సై పోస్టుల్లో 414 సివిల్‌ కాగా, కానిస్టేబుల్‌ పోస్టుల్లో అత్యధికంగా టీఎస్‌ఎస్పీలో 5,010, సివిల్‌లో 4,965, ఏఆర్‌లో 4,423 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అర్హతలున్న అభ్యర్థులను ఆన్‌లైన్‌లో ఎంపికచేసి ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించనున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు.

మే 2 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మే 2 నుంచి ప్రారంభం అవుతుందని టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. మే 20 వరకు అర్హులైన అభ్యర్థులు ‘www.tslprb.in’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పే ర్కొన్నారు. దరఖాస్తు చేసుకొనే అర్హులైన అభ్యర్థులకు ఒక యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ కేటాయిస్తారు. ప్రక్రియ పూర్తయ్యేవరకు అదే యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుంది.

వయోపరిమితి పెంపుతో కొత్త ఆశలు
అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం మూడేండ్లు పెంచింది. దీంతో పోలీస్‌ ఉద్యోగార్థుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తున్నది. ఎస్సై ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనేందుకు గతంలో గరిష్ఠ వయోపరిమితి 25 ఏండ్లు ఉండగా ఇప్పుడు 28 ఏండ్ల వరకు కూడా జనరల్‌ క్యాటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా జనరల్‌ క్యాటగిరీలో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 22 ఏండ్ల నుంచి 25 ఏండ్లకు పెంచింది. ఇక రిజర్వేషన్లు వర్తించే వారికి (ఎస్సీ, ఎస్టీ, బీసీ) మరింత అదనపు వయోపరిమితి వర్తిస్తుంది


No comments:

Post a Comment