Friday, 10 May 2019

హాల్‌లో 826 అప్రెంటిస్‌లు, కాకతీయ దూరవిద్య డిగ్రీ ప్రవేశాలు, సీపీసీబీలో జేఆర్‌ఎఫ్‌లు, బీహెచ్‌ఈఎల్‌లో జాబ్స్, ఇర్కాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో జాబ్స్.

హాల్‌లో 826 అప్రెంటిస్‌లు,
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ఎయిర్‌క్రాఫ్ట్ నాసిక్ కేంద్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
HAL
-మొత్తం ఖాళీల సంఖ్య-826

విభాగాలవారీగా ఖాళీలు:
-ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్-561 ఖాళీలు (ఫిట్టర్-279, టర్నర్-32, కార్పెంటర్-5, మెషినిస్ట్-30, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-14, ఎలక్ట్రీషియన్-85, మెకానిక్ (మోటార్ వెహికిల్)-7, డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానికల్)-7, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-4, పెయింటర్ (జనరల్)-12, పాసా-75, మెషినిస్ట్ (గ్రైండర్)-6, షీట్ మెటల్ వర్కర్-5)
-టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటిస్-25 ఖాళీలు (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్-2, అసిస్టెంట్ (ఆఫీస్ మేనేజ్‌మెంట్)-15, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్)-5, హౌస్‌కీపర్-3)
-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-103 ఖాళీలు (ఏరోనాటికల్-10, కంప్యూటర్-5, సివిల్-1, ఎలక్ట్రికల్-14, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్-18, మెకానికల్-53, ప్రొడక్షన్-2)
-టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్-137 ఖాళీలు (సివిల్-2, ఎలక్ట్రికల్-25, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్-19, మెకానికల్-86, కంప్యూటర్ సైన్స్-5)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తయి మూడేండ్లు మించరాదు. టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు డిప్లొమా హోల్డర్స్ మాత్రమే అర్హులు. ట్రేడ్ అప్రెంటిస్‌లకు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. ఒకేషనల్ అప్రెంటిస్‌లకు ఇంటర్ (ఒకేషనల్) పూర్తిచేసి ఉండాలి.
-స్టయిఫండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.4984, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.3542, ఒకేషనల్ అప్రెంటిస్‌లకు రూ.2758, ట్రేడ్ అప్రెంటిస్‌లకు నిబంధనల ప్రకారం స్టయిఫండ్ చెల్లిస్తారు.
-ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగాఎంపిక చేసి రాతపరీక్ష/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. అర్హులైనవారు మొదట www.mhrdnats.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. దీని ద్వారా యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత హాల్ అప్రెంటిస్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: మే 15
-వెబ్‌సైట్: www.hal-india.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కాకతీయ దూరవిద్య డిగ్రీ ప్రవేశాలు,

వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా విధానంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎలిజిబిలిటీ టెస్ట్ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది.
kakatiya-university
-కోర్సులు: బీఏ, బీకాం (జనరల్/కంప్యూటర్స్) 
-అర్హతలు: బీఏ, బీకాం కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత. లేదా యూనివర్సిటీ నిర్వహించే ఎలిజిబిలిటీ టెస్ట్ ఉత్తీర్ణులై ఉండాలి. 
-ఈ పరీక్ష రాయడానికి ఎటువంటి విద్యార్హతలు లేకున్నా 2019, మే 31 నాటికి 18 ఏండ్లు నిండి ఉంటే సరిపోతుంది. గతంలో విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారు నేరుగా ప్రవేశాలు పొందవచ్చు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 400/-
-దరఖాస్తు: ఆన్‌లైన్/వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా ఎస్‌డీఎల్‌సీఈ స్టడీ సెంటర్ల నుంచి పొందవచ్చు.
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 3
-ప్రవేశ పరీక్ష: జూన్ 23 ఉదయం 11 నుంచి 1 గంట వరకు.
-వెబ్‌సైట్: www.sdlceku.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీపీసీబీలో జేఆర్‌ఎఫ్‌లు,
ఢిల్లీలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ)లో జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
CPCB
-పోస్టు: జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)
-మొత్తం ఖాళీలు: 26
-జీతభత్యాలు: రూ. 25,000+హెచ్‌ఆర్‌ఏ
-వయస్సు: 28 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: పీజీలో కెమిస్ట్రీ/ఆర్గానిక్ కెమిస్ట్రీ/ అనలిటికల్ కెమిస్ట్రీ లేదా బయాలజీ/జువాలజీ లేదా లైఫ్ సైన్సెస్‌తోపాటు డాటా మేనేజ్‌మెంట్, నెట్‌లో అర్హత సాధించి ఉండాలి. లేదా సివిల్/ఈసీఈ, కెమికల్/సీఎస్/ఐటీలో ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. 
-పనిచేసే ప్రదేశం: ఢిల్లీ లేదా దేశంలోని ఏదైనా ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేయాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: మే 3
-వెబ్‌సైట్: www.cpcb.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీహెచ్‌ఈఎల్‌లో జాబ్స్,

హైదరాబాద్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్/సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BHEL-TURBENS
-మొత్తం ఖాళీలు: 27
-ఇంజినీర్-9 ఖాళీలు (సివిల్-6, ఎలక్ట్రికల్-3)
-అర్హత: సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-సూపర్‌వైజర్-18 ఖాళీలు (సివిల్-9, ఎలక్ట్రికల్-9)
-అర్హత: సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా. 
-వయస్సు: 2019 ఏప్రిల్ 1 నాటికి 35 ఏండ్లకు మించరాదు. 
-పే స్కేల్: ఇంజినీర్‌కు రూ.66,000/-, సూపర్‌వైజర్‌కు రూ.36,850/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 14
-ఇంటర్వ్యూతేదీ: మే 29
-వెబ్‌సైట్: https://web.bhelhyd.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇర్కాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో జాబ్స్.

రైల్వేశాఖ పరిధిలోని ఇర్కాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
infra
-మొత్తం పోస్టులు: 5 (జనరల్-4, ఓబీసీ-1)
-పోస్టు పేరు: సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్
-అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: 90, 000/-
-ఎంపిక: ఇంటర్వ్యూద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 14
-వెబ్‌సైట్: www.irconisl.com

Tuesday, 30 April 2019

ఐఐఐటీ బాసరలో బీటెక్ పోగ్రామ్ ప్రవేశాలు, సీసీఐలో మేనేజర్లు ఉద్యోగాలు, ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు, హెచ్‌ఎంటీలో ఉద్యోగాలు, టీసీఐఎల్‌లో ఉద్యోగాలు.

ఐఐఐటీ బాసరలో బీటెక్ పోగ్రామ్ ప్రవేశాలు,

నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) 2019-20 విద్యా సంవత్సరానికిగాను ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
IIIT
-కోర్సు పేరు: ఇంటిగ్రేటెడ్ బీటెక్
-విభాగాలు: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్
-మొత్తం సీట్ల సంఖ్య: 1000
-అర్హత: 2018-19 విద్యాసంవత్సరం జరిగిన పరీక్షల్లో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులైన తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థులు.
-మొత్తం సీట్లలో 85 శాతంతెలంగాణ ప్రాంతానికి (లోకల్), మిగతా 15 శాతం సీట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థులకు కేటాయించారు.
-వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 18 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: పదోతరగతి అకడమిక్ మార్కుల (ప్రతి సబ్జెక్టులోని గ్రేడ్ పాయింట్ యావరేజ్) ఆధారంగా.
-అప్లికేషన్ ఫీజు: రూ.200/- (ఎస్సీ/ఎస్టీలకు రూ.150/-).
గమనిక: అప్లికేషన్ ఫీజును టీఎస్ ఆన్‌లైన్ ్ల చెల్లించాలి.
-నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల జీపీఏకు 0.4 డిప్రైవేషన్ స్కోర్ కలుపుతారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్ హార్డ్‌కాపీ డౌన్‌లోడ్ చేసుకొని దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి రిజిస్టర్/స్పీడ్‌పోస్ట్‌లో సంబంధిత ఆర్‌జీయూకేటీ బాసర కన్వీనర్ లేదా పర్సనల్ అధికారికి పంపాలి.
-చిరునామా:
The Convener, RGUKT
Basar, Nirmal District,
Telangana State - 504107
-దరఖాస్తులకు చివరితేదీ: మే 24
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: మే 31
-ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి: జూన్ 10
-వెబ్‌సైట్: www.rgukt.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీసీఐలో మేనేజర్లు ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
cci-ltd
-మొత్తం ఖాళీలు: 19
-విభాగాలవారీగా.. మేనేజర్ (డిప్యూటీ మేనేజర్ (మెకానికల్/ఎలక్ట్రికల్/మార్కెటింగ్/ఎంఎం)-5, (పొడక్షన్/మెకానికల్)-2, ఇంజినీర్-3, ఆఫీసర్ (హెచ్‌ఆర్)-3, ఆఫీసర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్)-3, అకౌంట్స్ ఆఫీసర్-3 ఖాళీలు ఉన్నాయి
-విద్యార్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా, మూడేండ్ల డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి. 
-వయస్సు: పోస్టులను బట్టి 35- 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే10
-వెబ్‌సైట్: https://cciltd.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు,
రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెస్టర్న్ రీజియన్ పరిధిలోని వివిధ సబ్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ICG
-మొత్తం ఖాళీలు: 18
-పనిచేసే ప్రదేశాలు: రత్నగిరి, గోవా, కొచ్చి, ముంబై, డామన్, 
-విభాగాలవారీగా ఖాళీలు: డ్రాఫ్ట్స్‌మెన్-1, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్-4, ఇంజిన్ డ్రైవర్-3, సారంగ్ లస్కర్-2, లస్కర్-8
-అర్హతలు: పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో కాంపిటెన్సీ సర్టిఫికెట్, డిప్లొమా, డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి.
-వయస్సు: 18-30 ఏండ్ల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 30
-వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌ఎంటీలో ఉద్యోగాలు,

బెంగళూరులోని హెచ్‌ఎంటీ మెషిన్ టూల్స్ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
HMT
-మొత్తం ఖాళీలు: 38
-పోస్టులు ఖాళీల వివరాలు: జాయింట్ జనరల్ మేనేజర్ (ప్రొడక్షన్)-5, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)-1, రీజినల్ మేనేజర్ (మార్కెటింగ్) -10, ఏజీఎం (ఫైనాన్స్)-5, ఆఫీసర్ (ఫైనాన్స్)-5, ఏజీఎం (హెచ్‌ఆర్)-6, మెడికల్ సూపరింటెండెంట్-1, మెడికల్ ఆఫీసర్-5 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎంబీఏ, పీజీడీఎం, సీఎంఏ, సీఏ, ఐసీడబ్యూఏ ఉత్తీర్ణత.
-ఎంపిక: దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: మే 14
-వెబ్‌సైట్: www.hmtindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీసీఐఎల్‌లో ఉద్యోగాలు.

టెలీకమ్యూనికేషన్స్ కన్సెల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
tcil
పోస్టుల వివరాలు:
-జనరల్ మేనేజర్ (టెలికం/ఐటీ)-4, మేనేజర్ (ఫైనాన్స్)-3, డిప్యూటీ మేనేజర్ (టెలికం/ఐటీ)-6, డిప్యూటీ మేనేజర్ (సివిల్)-4, అసిస్టెంట్ మేనేజర్ (టెలికం/ఐటీ)-4, అసిస్టెంట్ మేనేజర్ (సివిల్)-10 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: మే 14
-వెబ్‌సైట్: www.tcil-india.com

సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ప్రవేశాలు, ఫిషరీస్ సైన్స్‌లో డిగ్రీ ప్రవేశాలు, ఐఎంటెక్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఐసీటీలో ప్రవేశాలు .

సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ప్రవేశాలు,

విజయనగరం జిల్లాలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదలైంది.
tribal-university
ఎగ్జామ్: ఆల్ ఇండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్
నిర్వహించే సంస్థ: ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ, అమర్‌కంటక్.
పీజీ/ఇంటిగ్రేటెడ్ కోర్సులు:
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (మెడికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు: బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)+ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (మెడికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్), బీబీఏ+ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్.
నోట్: పై రెండు ఇంటిగ్రేటెడ్ కోర్సులకు డిగ్రీ తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో పీజీ డిప్లొమా/డిప్లొమా కోర్సులు:
-కంప్యూటర్ అప్లికేషన్, సైబర్ సెక్యూరిటీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ హార్టికల్చర్. నోట్: పీజీ డిప్లొమా/డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుల ఎంపికకు ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు)
-చివరితేదీ, ఫీజు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
వెబ్‌సైట్: www.igntu.ac.in / www.andhrauniversity.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫిషరీస్ సైన్స్‌లో డిగ్రీ ప్రవేశాలు,
కొచ్చిలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ & ఇంజినీరింగ్ ట్రెయినింగ్ (సీఐఎఫ్‌ఎస్‌ఈటీ) 2019కిగాను కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
-బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (నాటికల్ సైన్స్)-నాలుగేండ్లు
అర్హత: పీసీబీ/పీసీఎం సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
-వెజెల్ నావిగేటర్ కోర్సు (వీఎన్‌సీ)/మెరైన్ ఫిట్టర్ కోర్సు (ఎంఎఫ్‌సీ)-రెండేండ్లు
అర్హత: మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులతో కనీసం 40 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత.
ఎంపిక: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా
వయస్సు: 2019 ఆగస్టు 1 నాటికి 17-20 (ఎంఎఫ్‌సీ కోర్సుకు 15-20) ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 16
వెబ్‌సైట్:www.cifnet.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఎంటెక్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు,
చండీగఢ్‌లోని సీఎస్‌ఐఆర్- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ (ఐఎంటెక్) ఆగస్టు 2019కిగాను పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
IMTECH
-ఈ పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ఐఎంటెక్, అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రిసెర్చ్ (AcSIR) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
కోర్సు పేరు: పీహెచ్‌డీ (ఆగస్టు 2019)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో లైఫ్ సైన్సెస్/బయోటెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ (ఎమ్మెస్సీ/ఎంటెక్, ఎంఫార్మసీ) లేదా బీఈ/బీటెక్ (ఐటీ/కంప్యూటర్ సైన్స్/బయాలజికల్ సైన్సెస్) లేదా బీఫార్మసీ/ఎంబీబీఎస్‌లో కనీసం 55 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్/డీబీటీ జేఆర్‌ఎఫ్, డీఎస్‌టీ ఇన్‌స్పైర్ ఫెలోషిప్, ఐసీఎంఆర్ జేఆర్‌ఎఫ్, గేట్ జేఆర్‌ఎఫ్ స్కోర్ కార్డ్ కలిగి ఉండాలి. పీజీ ఫైనల్ ఇయర్ పూర్తిచేయనున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
వయస్సు: 19 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 23
వెబ్‌సైట్: www.imtech.res.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీటీలో ప్రవేశాలు .

ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ) 2019-20కిగాను సైన్స్ అండ్ టెక్నాలజీలో పీజీ/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
University
-డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో భాగంగా పనిచేస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీని 1933 అక్టోబర్1న ఏర్పాటుచేశారు.
-మాస్టర్స్ డిగ్రీ
బ్రాంచీలు: ఎంటెక్, మాస్టర్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్, ఎంఫార్మసీ, ఎంఈ, ఎమ్మెస్సీ
-పీహెచ్‌డీ (సైన్స్, టెక్నాలజీ)
అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ పీజీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. 
ఫీజు: రూ. 1000/-ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ. 500/-
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: పీజీ కోర్సులకు మే 15, పీహెచ్‌డీ కోర్సులకు మే 20
వెబ్‌సైట్: www.ictmumbai.edu.in

ఇండియన్ ఆర్మీలో సోల్జర్ జాబ్స్, సీఐఎంఎఫ్‌ఆర్‌లో జాబ్స్, జీఎస్‌ఐలో 37 జాబ్స్, బిట్స్‌లో ప్రొఫెసర్లు జాబ్స్, ఐఐఆర్‌ఆర్‌లో జాబ్స్, బార్క్‌లో డిప్లొమా కోర్సు.

ఇండియన్ ఆర్మీలో సోల్జర్ జాబ్స్,

ఇండియన్ ఆర్మీ ఉమెన్ మిలిటరీ పోలీస్ విభాగంలో సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
army
-మొత్తం ఖాళీలు:100
-పోస్ట్ పేరు: సోల్జర్ (జనరల్ డ్యూటీ)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి కనీసం 45 శాతం మార్కులతో పదోతరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలతోపాటు వైద్యపరంగా ఫిట్‌గా ఉండాలి. ఎత్తు 142 సెం.మీ. ఉంటే సరిపోతుంది.
-వయస్సు: 17 1/2 నుంచి 21 ఏండ్ల మధ్య ఉండాలి. 1998 అక్టోబర్ 1 నుంచి 2002 ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి. 
-కేంద్రాలు: అంబాలా, లక్నో, జబల్‌పూర్, బెంగళూరు, షిల్లాంగ్.పీఎఫ్‌టీ ర్యాలీలో
-1.6 కిలోమీటర్లను 7 నిమిషాల 30 సెకండ్లలో (గ్రూప్1), 8 నిమిషాల్లో (గ్రూప్2) పూర్తిచేయాలి.
-లాంగ్‌జంప్:10 ఫీట్లు, హై జంప్: 3 ఫీట్లు (ఈ రెండు కూడా కేవలం అర్హత పరీక్షలు మాత్రమే)
-ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-అప్లికేషన్ ఫీజు లేదు.
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 8

-వెబ్‌సైట్: www.indanarmy.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఐఎంఎఫ్‌ఆర్‌లో జాబ్స్,

సీఎస్‌ఐఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్ (సీఐఎంఎఫ్‌ఆర్) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
CIMFR
-పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్
-మొత్తం ఖాళీలు-49 (లెవల్ I -34, లెవల్ II -15)
-అర్హత: ఇంజినీరింగ్‌లో డిప్లొమా, బీఎస్సీ( జియాలజీ/కెమిస్ట్రీ), బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ (జియాలజీ/కెమిస్ట్రీ/ఫిజిక్స్), ఎంసీఏ ఉత్తీర్ణత.
-వయస్సు: లెవల్‌Iకు 28 ఏండ్లు, లెవల్‌IIకు 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవల్ 1, 2లకు జీతం రూ.15,000/-, రూ. 25,000/- ఇస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు
-వెబ్‌సైట్ : www.cimfr.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జీఎస్‌ఐలో 37 జాబ్స్,
హైదరాబాద్‌లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ పరిధిలో ఖాళీగా ఉన్న ఆర్డినరీ గ్రేడ్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
GSI
-మొత్తం ఖాళీలు-37 (జనరల్-18, ఓబీసీ-9, ఈడబ్ల్యూఎస్-3,ఎస్సీ-5, ఎస్టీ-2)
-ప్రాంతాలవారీగా ఖాళీలు: తెలంగాణ-8, రీజినల్ హెడ్‌క్వార్టర్-1, కర్ణాటక అండ్ గోవా-10, ఏపీ-10, తమిళనాడు అండ్ పుదుచ్చేరి-4, కేరళ-4.
-వయస్సు: 2019 జూన్ 22 నాటికి 25 ఏండ్లకు మించరాదు.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
-అర్హతలు: మెట్రిక్యులేషన్/పదోతరగతి ఉత్తీర్ణత. ఎల్‌ఎంవీ, హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు మూడేండ్లపాటు డ్రైవింగ్ రంగంలో అనుభవం ఉండాలి.
-పేస్కేల్: రూ. 19,900-63,200/-
-ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: ది అడిషనల్ డైరెక్టర్ జనరల్, సర్వే ఆఫ్ ఇండియా, సదరన్ రీజియన్, జీఎస్‌ఐ కాంప్లెక్స్, బండ్లగూడ,హైదరాబాద్-500068
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (ఏప్రిల్ 27- మే 3)లో వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి.
-వెబ్‌సైట్: www.gsi.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బిట్స్‌లో ప్రొఫెసర్లు జాబ్స్,
రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) మెకానికల్ విభాగంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకిప్రకటన విడుదల చేసింది.
Birla
-పోస్టు పేరు: ప్రొఫెసర్ 
-మొత్తం పోస్టులు: 7 (ప్రొఫెసర్-1, అసోసియేట్ ప్రొఫెసర్-1, అసిస్టెంట్ ప్రొఫెసర్-5)
-అర్హత: సంబంధిత విభాగం నుంచి 60 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు పీహెచ్‌డీ . టీచింగ్/రిసెర్చ్/ఇండస్ట్రీలో అనుభవం ఉండాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: మే 15
- వెబ్‌సైట్: www.bitmesra.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఆర్‌ఆర్‌లో జాబ్స్,

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ (ఐఐఆర్‌ఆర్) ఖాళీగా ఉన్న 
జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IIRR
-ఎస్‌ఆర్‌ఎఫ్/జేఆర్‌ఎఫ్ 
-అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతోపాటు అనుభవం ఉండాలి. నెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
-పే స్కేల్ : ఎస్‌ఆర్‌ఎఫ్ రూ. 28,000, జేఆర్‌ఎఫ్- రూ. 25,000. అదనంగా హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్, రాజేంద్రనగర్, హైదరాబాద్. 
-ఇంటర్వ్యూ తేదీ: మే 6
-వెబ్‌సైట్: www.iirr.org.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బార్క్‌లో డిప్లొమా కోర్సు.

ముంబైలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) రేడియాలజికల్ ఫిజిక్స్‌లో డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
barc
-డిప్లొమా ఇన్ రేడియాలజికల్ ఫిజిక్స్ 
-మొత్తం సీట్లసంఖ్య: 30 (నాన్ స్పాన్సర్డ్-25, స్పాన్సర్డ్-5)
-అర్హత: ఎమ్మెస్సీ ఫిజిక్స్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిగ్రీ స్థాయిలోని బీఎస్సీ ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో తప్పనిసరిగా 60 శాతం మార్కులు సాధించాలి.
-వయస్సు: 2019 ఆగస్టు 1 నాటికి 26 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: కామన్ ఎంట్రెన్స్, ఇంటర్వ్యూ
-స్టయిఫండ్: రూ. 25,000
-అప్లికేషన్ ఫీజు: రూ.500/-ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ/మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 25
-కామన్ ఎంట్రెన్స్ టెస్ట్: జూన్ 23
-వెబ్‌సైట్: www.barc.gov.in

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 323 ఉద్యోగాలు, ఎన్‌డీఆర్‌ఐలో ఎస్‌ఆర్‌ఎఫ్‌లు ఉద్యోగాలు, ఎన్‌ఐఎఫ్‌ఎంలో ప్రవేశాలు, బీపీఆర్‌ఎల్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు, ఐఐఎంఆర్‌లో ఉద్యోగాలు.

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 323 ఉద్యోగాలు,
భారత హోం మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న కేంద్ర సాయుధ పోలీస్ బలగాల (సీఏపీఎఫ్)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించే సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్-2019కు సంబంధించిన నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది.
CAPF
-ఈ కామన్ ఉమ్మడి పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ) తదితర విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ ఏ) పోస్టులను భర్తీచేస్తారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 323
-విభాగాలవారీగా ఖాళీలు: సీఆర్‌పీఎఫ్-100, బీఎస్‌ఎఫ్-100, ఎస్‌ఎస్‌బీ-66, సీఐఎస్‌ఎఫ్-28, ఐటీబీపీ-21
-అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి 20 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు: పురుషులు- 165 సెం.మీ., ఛాతీ: 81 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి. మహిళలు- 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, పీఈటీ/పీఎస్‌టీ, పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ.
-800 మీటర్ల పరుగు పందెంను పురుషులు 3 నిమిషాల 45 సెకండ్లు, మహిళలు 4 నిమిషాల 45 నిమిషాల్లో, 100 మీటర్ల పరుగు పందెంను పురుషులు 16 సెకండ్లు, మహిళలు 18 సెకండ్లు పూర్తి చేయాలి.
-లాంగ్‌జంప్‌ను పురుషులు-3.5 మీటర్లు, మహిళలు-3.0 మీటర్లు (మూడు పర్యాయాల్లో), షాట్‌పుట్ (7.26 కేజీలు) పురుషులు 4.5 మీటర్ల దూరం వేయాలి.
-రాతపరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. పేపర్-1లో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ నుంచి ఆబ్జెక్టివ్ విధానంలో 250 మార్కులు, పేపర్-2లో జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్ సంబంధిత అంశాల్లో 200 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
-పేపర్-1లో అర్హత సాధించినవారు మత్రమే పేపర్-2 పరీక్ష రాయడానికి అర్హులు.
-పేపర్-1లో నెగెటివ్ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల కోత విధిస్తారు.
-పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ 150 మార్కులకు ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తు ఫీజు: రూ.200/-(ఎస్సీ/ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
-దరఖాస్తులకు చివరితేదీ: మే 20
-పరీక్ష తేదీ: ఆగస్టు 18
-వెబ్‌సైట్: www.upsconline.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌డీఆర్‌ఐలో ఎస్‌ఆర్‌ఎఫ్‌లు ఉద్యోగాలు,
నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌డీఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆర్‌ఏ, జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్ తదితర ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NDRI-BUILDING
-మొత్తం పోస్టులు: 18
-విభాగాలవారీగా ఖాళీలు: రిసెర్చ్ అసోసియేట్-4, జేఆర్‌ఎఫ్-3, ఎస్‌ఆర్‌ఎఫ్-6, యంగ్ ప్రొఫెషనల్స్ (గ్రేడ్2)-3, ప్రాజెక్టు అసిస్టెంట్-2
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్/ఎంవీఎస్సీ, పీజీ డిగ్రీ, ఎంసీఏ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి నేరుగా సంబంధిత పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
-చిరునామా: National Dairy Research Institute, Karnal-132001
-ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 26, 27, మే 2 
-వెబ్‌సైట్: www.ndri.res.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఎఫ్‌ఎంలో ప్రవేశాలు,

ఫరీదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఎస్‌ఐఎఫ్‌ఎం) 2019-21కిగాను పీజీడీఎం (ఎఫ్‌ఎం) ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 
NIFM
-కోర్సు పేరు: పీజీడీఎం (ఎఫ్‌ఎం)
-కోర్సు వ్యవధి: రెండేండ్లు 
-మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో పనిచేస్తున్న ఈ సంస్థ ఈ కోర్సును ఫుల్‌టైమ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది.
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతోపాటు క్యాట్/ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఆప్టిట్యూట్ టెస్ట్‌లో అర్హత సాధించాలి. సంబంధిత రంగంలో మూడేండ్లపాటు అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 20
-వెబ్ సైట్: www.nifm.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీపీఆర్‌ఎల్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు,
బీపీసీఎల్ అనుబంధంగా పనిచేస్తున్న భారత్ పెట్రోరిసోర్సెస్ లిమిటెడ్ (బీపీఆర్‌ఎల్) ఖాళీగా ఉన్న మిడ్‌లెవల్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టులు - ఖాళీలు
-జియాలజిస్ట్-2, జియోఫిజిసిస్ట్-1, పెట్రోఫిజిసిస్ట్-1, రిజర్వాయర్ ఇంజినీర్-1, డ్రిల్లింగ్ ఇంజినీర్-2, ప్రొడక్షన్ ఇంజినీర్-1, ఫెసిలిటీస్ ఇంజినీర్-1, ఫైనాన్స్-3, ఇంటర్నల్ ఆడిట్-2, బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ఎంఐఎస్-1
-అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15
-వెబ్‌సైట్: http//bharatpetroresources.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎంఆర్‌లో ఉద్యోగాలు.

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ (ఐఐఎంఆర్) ఖాళీగా ఉన్న ఎస్‌ఆర్‌ఎఫ్/ఆర్‌ఏ కోసం ప్రకటన విడుదల చేసింది. 

-పోస్టు పేరు: ఎస్‌ఆర్‌ఎఫ్/ఆర్‌ఏ
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: మే 31
-వెబ్‌సైట్: www.millets.res.in

ఇండియన్ ఆయిల్‌లో రిసెర్చ్ ఆఫీసర్లు, ఇర్కాన్‌లో మేనేజర్లు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్లు, ఎయిర్ ఇండియాలో అకౌంటెంట్ పోస్టులు, భారత స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ క్రాఫ్ట్స్‌మన్ ట్రెయినింగ్.

ఇండియన్ ఆయిల్‌లో రిసెర్చ్ ఆఫీసర్లు,
ఫరీదాబాద్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)లో రిసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Indian-Oil

-పోస్టు: రిసెర్చ్ ఆఫీసర్లు
-ఖాళీల సంఖ్య: 25
విభాగాల వారీగా ఖాళీలు-అర్హతలు:
-ఫ్యూయల్స్&అడిటివ్స్-4
-అర్హత: కనీసం 65 శాతం మార్కులతో యూజీ, పీజీతోపాటు ఫుల్‌టైం పీహెచ్‌డీ కెమిస్ట్రీ (ఆర్గానిక్/ఇనార్గానిక్ లేదా ఫిజికల్/అనలిటికల్ లేదా తత్సమాన సబ్జెక్టులు)
-అనలిటికల్ టెక్నిక్స్&క్యారెక్టరైజేషన్-2
-ఫ్యూయల్స్ సెల్స్-1
-అర్హతలు: పై రెండు పోస్టులకు ఫుల్‌టైం పీహెచ్‌డీ కెమిస్ట్రీ (ఆర్గానిక్/ఇనార్గానిక్ లేదా ఫిజికల్ లేదా తత్సమాన)తోపాటు డిగ్రీ, యూజీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-బ్యాటరీస్-1
-అర్హత: ఎలక్ట్రో-కెమిస్ట్రీలో పీహెచ్‌డీ
-క్యాటలిస్ట్స్-3
-అర్హత: క్యాటలిసిస్/మెటీరియల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ
-పెట్రోకెమికల్స్&పాలీమర్స్-3
-అర్హతలు: ఆర్గానిక్/ఆర్గానో-మెటలిక్స్ లేదా పాలీమర్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ
-నానోటెక్నాలజీ-5
-ప్రొడక్ట్ డెవలప్‌మెంట్-5
-అర్హతలు: పై రెండు పోస్టులకు ఫుల్‌టైం పీహెచ్‌డీ కెమిస్ట్రీ (ఆర్గానిక్/ఇనార్గానిక్ లేదా ఫిజికల్ లేదా తత్సమాన)తోపాటు డిగ్రీ, యూజీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-చీఫ్ రిసెర్చ్ మేనేజర్-1
-అర్హత: పీహెచ్‌డీలో బయోటెక్నాలజీ/మైక్రోబయాలజీ/మాలిక్యులర్ బయాలజీ
-వయస్సు: పై పోస్టులన్నింటికి 2019, మార్చి 31 నాటికి 32 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: రిసెర్చ్ ఆఫీసర్ పోస్టుకు రూ.60,000-1,80,000/-
-అప్లికేషన్ ఫీజు: రూ.300/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 21
-వెబ్‌సైట్: www.iocl.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇర్కాన్‌లో మేనేజర్లు,
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-పోస్టులు-ఖాళీలు: డిప్యూటీ జనరల్ మేనేజర్ (ట్రాక్ ఈ4)-5, మేనేజర్ (ట్రాక్ ఈ3)-1, డిప్యూటీ మేనేజర్ (ఈ2)-3, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాక్ ఈ1)-2, సైట్ ఇంజినీర్ (ట్రాక్ ఎన్‌ఈ-8)-4, డిప్యూటీ జనరల్ మేనేజర్/సిగ్నల్ ఈ4 -1, మేనేజర్/సిగ్నల్ ఈ3-1, డిప్యూటీ మేనేజర్/సిగ్నల్ ఈ2-1 ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 13
-వెబ్‌సైట్: www.ircon.org

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్లు,
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పరిధిలోని కారిడైట్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ordinance
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-40 ఖాళీలు
-విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-4, మెకానికల్ ఇంజినీరింగ్-10, కెమికల్ ఇంజినీరింగ్-10, సివిల్ ఇంజినీరింగ్-5, ఇన్‌స్ట్రుమెంటేషన్&కంట్రోల్ ఇంజినీరింగ్-2, ఎన్విరాన్‌మెంటల్&పొల్యూషన్ ఇంజినీరింగ్-2, కంప్యూటర్ ఇంజినీరింగ్-1, కంప్యూటర్‌సైన్స్ &ఇంజినీరింగ్-4, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-1 ఖాళీలు ఉన్నాయి.
-స్టయిఫండ్: నెలకు రూ. 4,984/-
-శిక్షణ కాలం: ఏడాది
-అర్హతలు: సంబంధిత అంశంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఇంజినీరింగ్/టెక్నాలజీ డిగ్రీ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత. 
-టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్-50 ఖాళీలు
-విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-5, మెకానికల్ ఇంజినీరింగ్-20, కెమికల్ ఇంజినీరింగ్-10, సివిల్ ఇంజినీరింగ్-5, ఇన్‌స్ట్రుమెంటేషన్&కంట్రోల్ ఇంజినీరింగ్-2, ఎన్విరాన్‌మెంటల్&పొల్యూషన్ ఇంజినీరింగ్-3, కంప్యూటర్ ఇంజినీరింగ్-5 ఖాళీలు ఉన్నాయి.
-స్టయిఫండ్: నెలకు రూ.3542/-
-శిక్షణ కాలం: ఏడాది
-అర్హతలు: రాష్ట్ర కౌన్సిల్/సాంకేతిక విద్యాశాఖ బోర్డు గుర్తించిన ఇంజినీరింగ్/టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: సంబంధిత బ్రాంచీ/విభాగాల్లో అభ్యర్థులకు వచ్చిన అకడమిక్ మార్కుల ఆధారంగా చేస్తారు. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-నోట్: మొదట నేషనల్ అప్రెంటిస్ పోర్టల్‌లో మే 6లోగా రిజిస్టర్ కావాలి. తర్వాత కింద పేర్కొన్న వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
-చివరితేదీ: మే 8
-షార్ట్‌లిస్ట్ చేసిన జాబితా ప్రకటన తేదీ: మే 16
-సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ: మే 23
-వెబ్‌సైట్: http://www.boat-srp.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్ ఇండియాలో అకౌంటెంట్ పోస్టులు,
ఎయిర్ ఇండియాలో కాంట్రాక్టు ప్రాతిపదికన అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
airindia
-పోస్టు: అకౌంటెంట్స్ ఎగ్జిక్యూటివ్
-ఖాళీల సంఖ్య- 25. 
-అర్హతలు: సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఎంబీఏ ఫైనాన్స్ (ఫుల్‌టైం)తోపాటు కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
-పోస్టు: అకౌంట్స్ క్లర్క్
-ఖాళీలు: 36. 
-అర్హతలు: సీఏ ఇంటర్/ఐసీడబ్ల్యూ ఇంటర్ లేదా బీకాంతోపాటు రెండేండ్ల అనుభవం 
-నోట్: మొదట ఐదు సంవత్సరాల కాలపరిమితికి నియామకాలు చేపడుతారు.
-అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు- న్యూఢిల్లీ- మే 3న ఉదయం 10 నుంచి 12.30 మధ్య హాజరుకావాలి. ముంబై- మే 10న హాజరుకావాలి.
-అకౌంట్స్ క్లర్క్- న్యూఢిల్లీ - మే 4న, ముంబై- మే 11న.
-జీతం: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్‌లకు నెలకు రూ.45,000/-, అకౌంట్స్ క్లర్క్‌లకు నెలకు రూ.25,200/- ఇస్తారు.
-వెబ్‌సైట్: http://www.airindia.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
భారత స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ క్రాఫ్ట్స్‌మన్ ట్రెయినింగ్.

భారత స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ క్రాఫ్ట్స్‌మన్ ట్రెయినింగ్ జూలై సెషన్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-కోర్సు: క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ ట్రెయినింగ్
-అర్హత: ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ (ట్రేడ్ విభాగంలో సర్టిఫికెట్) లేదా డిప్లొమా, టెక్నికల్ విభాగంలో డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 30
-పరీక్ష తేదీ: జూన్ 1
-ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు రూ.300, ఇతరులకు రూ.500/-
-వెబ్‌సైట్: http://dgt.gov.in

Tuesday, 23 April 2019

ఫుడ్ టెక్నాలజీ ప్రవేశాలు, ఎయిర్‌ఇండియాలో ఖాళీలు, ఐఐఎంసీలో పీజీ డిప్లొమాప్రవేశాలు, ఐఏసీఎస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, జేఎన్‌యూలో ఫ్యాకల్టీలు.

ఫుడ్ టెక్నాలజీ ప్రవేశాలు,

హరియణాలోని భారత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐఎఫ్‌టీఈఎం) 2019-20 కిగాను యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో
ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
NIFTIM
-నాలుగేండ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (బీటెక్) -199 సీట్లు
-అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. జేఈఈ మెయిన్ 2019లో అర్హత సాధించాలి.
-ఎంపిక: జేఈఈ మెయిన్-2019 ర్యాంక్ ద్వారా
-రెండేండ్ల పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఎంటెక్)-105 సీట్లు
-విభాగాలు: ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఫుడ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ప్లాంట్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్.
-అర్హత: సంబంధిత విభాగాల్లో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత గమనిక: సంబంధిత విభాగంలో/ కోర్సులో 21 చొప్పున ఐదింటికి మొత్తం 105 సీట్లు ఉంటాయి.
-ఎంపిక: గేట్ ర్యాంక్/నిఫ్టెమ్ ప్రవేశపరీక్ష
-రెండేండ్ల మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)-33 సీట్లు
-అర్హత: సంబంధిత విభాగం/సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-ఎంపిక: క్యాట్/మ్యాట్ స్కోర్ లేదా నిఫ్టెమ్ ప్రవేశ పరీక్ష , గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
-పీహెచ్‌డీ-20 సీట్లు
-విభాగాలు: అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, బేసిక్ అండ్ అప్లయిడ్ సైన్స్, ఫుడ్ ఇంజినీరింగ్, ఫుడ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
-అర్హత: సంబంధిత విభాగాల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక: రిసెర్చ్ ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా, జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రవేశపరీక్షలో మినహాయింపు ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 25
-వెబ్‌సైట్: http://niftem.ac.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్‌ఇండియాలో ఖాళీలు,

న్యూఢిల్లీలోని ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
AIR-INDIA
-ట్రెయినీ కంట్రోలర్-25 ఖాళీలు (జనరల్-10, ఈడబ్ల్యూఎస్-2, ఓబీసీ-3, ఎస్సీ-6, ఎస్టీ-4) 
-అర్హత: మూడేండ్ల ఇంజినీరింగ్‌లో డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా తత్సమాన స్థాయిలో ఉత్తీర్ణత. ఎయిర్‌లైన్ షెడ్యూలింగ్ (ఫైలట్/క్యాబిన్ క్రూ రోస్టరింగ్)లో అనుభవం ఉండాలి.
-డాటాఎంట్రీ ఆపరేటర్-54 ఖాళీలు (జనరల్-24, ఈడబ్ల్యూఎస్-5, ఓబీసీ-14, ఎస్సీ-8, ఎస్టీ-3) 
-అర్హత: ఇంటర్/తత్సమాన పరీక్ష లేదా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు డాటా ఎంట్రీ ఆపరేటర్‌లో ప్రావీణ్యం ఉండాలి. ఎయిర్‌లైన్ షెడ్యూలింగ్ (క్రూ రోస్టరింగ్, మూమెంట్ కంట్రోల్)లో అనుభవం ఉండాలి.
-పేస్కేల్: ట్రెయినీ కంట్రోలర్‌కు రూ. 25,000/-డాటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ. 21,000/-
-ఫీజు: ట్రెయినీ కంట్రోలర్‌కు రూ. 1000/-, డాటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ. 500/-
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 30, మే 2
-వెబ్‌సైట్: www.airindia.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎంసీలో పీజీ డిప్లొమాప్రవేశాలు,

న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) 2019-20కిగాను పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. 
IIMC-LOGO
-పీజీ డిప్లొమా
-విభాగాలు: ఇంగ్లిష్ జర్నలిజం, హిందీ జర్నలిజం, రేడియో అండ్ టీవీ జర్నలిజం, అడ్వైర్టెజింగ్ అండ్ పీఆర్, ఉర్దూ జర్నలిజం, ఒడియా జర్నలిజం, మరాఠీ, మలయాళ జర్నలిజం.
-ప్రాంతీయ ప్రాంగణాలు: ఢెంకనాల్ (ఒడిశా), ఐజ్వాల్ (మిజోరం), అమరావతి (మహారాష్ట్ర), జమ్ము, కొట్టాయం (కేరళ)
-అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్/బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత
-వయస్సు: 24 ఏండ్లకు మించకూడదు
-ఎంపిక విధానం: రాతపరీక్ష, బృంద చర్చలు, ఇంటర్వ్యూ ద్వారా
-పరీక్ష తేదీ: మే 25, 26
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 12 
-వెబ్‌సైట్: www.iimc.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఏసీఎస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్,
జాదవ్‌పూర్‌లోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (ఐఏసీఎస్)లో ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
IACS-LOGO
- కోర్సులు: ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్-మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇన్ సైన్స్, మాస్టర్స్/ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్-పీహెచ్‌డీ ప్రోగ్రామ్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (ఆటమ్ సెమిస్టర్).
- అర్హతలు, వయస్సు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- వెబ్‌సైట్: http://www.iacs.res.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జేఎన్‌యూలో ఫ్యాకల్టీలు.

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. 
JNU
-పోస్టుపేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
-మొత్తం ఖాళీల సంఖ్య: 97 (జనరల్-36, ఈడబ్ల్యూఎస్-10, ఓబీసీ-26, ఎస్సీ-14, ఎస్టీ-8) 
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ /తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. పీహెచ్‌డీ, యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్/స్లెట్‌లో అర్హతతోపాటు సంబంధిత రిసెర్చ్/టీచింగ్ విభాగంలో అనుభవం ఉండాలి.
-పేస్కేల్: రూ. 57,700-1,82,400/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేది: ఏప్రిల్ 29
-వెబ్‌సైట్: www.jnu.ac.in