Sunday, 13 June 2021
మజగాన్ డాక్ షిప్‌యార్డ్‌లో 1388 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో 121 ట్రేడ్ అప్రెంటిస్‌లు, ఐఎల్‌బీఎస్‌లో 90 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.
ఎన్ఎండీసీలో 80 ఇంజినీర్ పోస్టులు, ఇండియన్ నేవీలో 50 ఎస్ఎస్సీ ఆఫీసర్లు ఉద్యోగాలు, ఈసీఐఎల్‌లో 20 ప్రాజెక్ట్, అసిస్టెంట్ ఇంజినీర్లు ఉద్యోగాలు, ఎన్ఐడబ్ల్యూఈలో 6 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.
ఎన్ఎండీసీలో 80 ఇంజినీర్ పోస్టులు
ఇండియన్ నేవీలో 50 ఎస్ఎస్సీ ఆఫీసర్లు ఉద్యోగాలు
ఈసీఐఎల్‌లో 20 ప్రాజెక్ట్, అసిస్టెంట్ ఇంజినీర్లు ఉద్యోగాలు
ఎన్ఐడబ్ల్యూఈలో 6 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
Saturday, 12 June 2021
10,493 పోస్టులతో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్, సదరన్ రైల్వేలో 3378 అప్రెంటిస్ ఉద్యోగాలు, కోల్ ఇండియాలో 1086 సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు.
10,493 పోస్టులతో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (ఆర్ఆర్బీ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీగా పోస్టులను భర్తీ చేయనుంది. సుమారు 10,493 ఖాళీల్లో నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఆఫీసర్ స్కేల్-1 (పీఓ), ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్-2, 3 (ఆర్ఆర్బీ ఎక్స్) పోస్టులు ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియలో వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 43 ప్రాంతీయ బ్యాంకులు పాల్గొంటున్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (వరంగల్), ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ (కడప), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ (గుంటూరు), సప్తగిరి గ్రామీణ బ్యాంక్ (చిత్తూరు)లలో ఖాళీలు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 10,493 (సుమారుగా)
ఇందులో ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) 5076, ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) 4206, ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్, ఐటీ ఆఫీసర్, సీఏ) 1060, ఆఫీసర్ స్కేల్-3 పోస్టులు 156 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. స్థానిక భాష తప్పనిసరిగా మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి. అదేవిధంగా పోస్టును బట్టి డిగ్రీలో అగ్రికల్చర్ ఇంజినీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చురల్ మార్కెటింగ్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ అస్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ లేదా అకౌంటెన్సీ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 40 మధ్య ఉండాలి (పోస్టును బట్టి వేర్వేరుగా ఉన్నాయి).
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. క్లర్క్ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు మాత్రమే ఉంటాయి. పీఓ పోస్టుకు మాత్రం ఈ రెండింటితోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. కాగా, ఆఫీసర్ స్కేల్-2, 3 పోస్టులకు ఒకే పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
పరీక్ష ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 8
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 28
అడ్మిట్ కార్డు: జూలై లేదా ఆగస్టులో
ప్రిలిమ్స్ ఎగ్జామ్: ఆగస్టు 1 నుంచి 21 మధ్య
ఫలితాలు: సెప్టెంబర్‌లో
స్కేల్ 2, 3 రాతపరీక్ష: సెప్టెంబర్ 25
పీఓ మెయిన్స్ ఎగ్జామ్: సెప్టెంబర్ 25
క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్: అక్టోబర్ 3
ఆఫీసర్ స్కేల్-2, 3 ఇంటర్వ్యూ: అక్టోబర్ లేదా నవంబర్‌లో
వెబ్సైట్: www.ibps.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
సదరన్ రైల్వేలో 3378 అప్రెంటిస్ ఉద్యోగాలు
అప్రెంటిస్ మొత్తం ఖాళీల సంఖ్య: 3378
పనిచేసే ప్రదేశాలు: క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్, రైల్వే హాస్పిటల్, ఎలక్ట్రికల్ వర్క్‌షాప్, లోకోవర్క్స్, ఇంజనీరింగ్ వర్క్‌షాప్, చెన్నై డివిజన్.
విభాగాలు: ఫ్రెషర్ కేటగిరీ, ఎక్స్ ఐటీఐ, ఎంఎల్టీ.
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితరాలు.
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/బయాలజీ)ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 15ఏళ్లు నిండి ఉండాలి. 22/24ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియెట్ మార్కుల ప్రాతిపదికన తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://sr.indianrailways.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
కోల్ ఇండియాలో 1086 సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు
ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (ఈసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1086 సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనుంది. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించింది. ఎంపికైనవారిని జనరల్ మేనేజర్ ఆఫీసులు, సీనియర్ మేనేజర్ ఆఫీసుల ఈసీఎల్ పర్సనల్ డిపార్టమెంట్ వద్ద నియమిస్తారు.
మొత్తం పోస్టులు: 1086
ఇందులో జనరల్ 842, ఎస్సీ 163, ఎస్టీ 81 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు ఏడో తరగతి పాసవ్వాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి ఈ-మెయిల్ చేయాలి.
ఈ-మెయిల్: bhartiecl@gmail.com
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15
వెబ్సైట్: http://www.easterncoal.gov.in/
యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ ఎగ్జామ్ 2021 నోటిఫికేషన్ 400 ఉద్యోగాలు, ఇండియన్ కోస్ట్ గార్డులో 350 ఉద్యోగాలు, నిమ్హాన్స్లో 275 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్.
యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ ఎగ్జామ్ 2021 నోటిఫికేషన్ 400 ఉద్యోగాలు
ఎన్డీఏ, ఎన్ఏ ఎగ్జామ్(2), 2021..
మొత్తం ఖాళీల సంఖ్య: 400
నేషనల్ డిఫెన్స్ అకాడెమీ(ఎన్డీఏ): 370(ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్‌ఫోర్స్ 120)
నేవల్ అకాడెమీ(ఎన్ఏ): 30(10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్)
అర్హత: ఆర్మీ విభాగం పోస్టులకు ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణత ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవల్ వింగ్స్ పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్మీడియెట్ ఫైనల్ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
వయసు: 2003 జనవరి 2 నుంచి 2006 జనవరి 1వ తేదీ మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్ఎస్బీ టెస్ట్/ఇంటర్వూ, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.06.2021
పరీక్ష తేది: 05.09.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.upsc.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ కోస్ట్ గార్డులో 350 ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు, ఆర్మ్డ్ ఫోర్స్‌ల్లో.. నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ 01/2022 బ్యాచ్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 350
పోస్టులు-ఖాళీలు:
1) నావిక్ (జనరల్ డ్యూటీ): 260
2) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): 50
3) యాంత్రిక్ (మెకానికల్): 20
4) యాంత్రిక్ (ఎలక్ట్రికల్): 13
5) యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్): 07
అర్హత, వయసు:
1) నావిక్ (జనరల్ డ్యూటీ): మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. 01 ఫిబ్రవరి 2000 - 31 జనవరి 2004 మధ్య జన్మించి ఉండాలి.
2) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి పదో తరగతి ఉత్తీర్ణత.
వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. 01 ఏప్రిల్ 2000 - 31 మార్చి 2004 మధ్య జన్మించి ఉండాలి.
3) యాంత్రిక్: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్(రేడియో/ పవర్) ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. 01 ఫిబ్రవరి 2000 - 31 జనవరి 2004 మధ్య జన్మించి ఉండాలి.
* ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: దీనికి ఎంపిక విధానం వివిధ దశల్లో ఉంటుంది. స్టేజ్ 1, 2, 3, 4 ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
* మొదటి దశ(స్టేజ్-1): స్టేజ్-1లో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సెక్షన్-1, 2, 3, 4, 5 పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత పోస్టులకు ఏ సెక్షన్ పరీక్ష నిర్వహిస్తారు, దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణత మార్కులు, సంబంధిత సబ్జెక్టుల సిలబస్, పరీక్షా సమయం, వచ్చే ప్రశ్నల గురించి ప్రకటనలో సవివరంగా ఇచ్చారు.
* రెండో దశ(స్టేజ్-2): మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. దీని ప్రకారం స్టేజ్-2కి ఎంపిక చేస్తారు. ఇందులో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీ అసెస్మెంట్ టెస్ట్, తొలి మెడికల్ టెస్ట్ ఉంటాయి.
* మూడో దశ (స్టేజ్-3): స్టేజ్-1, స్టేజ్-2లో ప్రతిభ ఆధారంగా స్టేజ్-3కి ఎంపిక చేస్తారు. స్టేజ్-3లో డ్యాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ టెస్ట్, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ ఉంటాయి.
* నాలుగో దశ (స్టేజ్-4): ఇందులో వివిధ ఎడ్యుకేషన్ బోర్డ్‌లు/ యూనివర్సిటీలు/ రాష్ట్రప్రభుత్వం నుంచి పొందిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇండియన్ కోస్టు గార్డ్ ముందు ఉంచాలి. సర్టిఫికెట్లు ఒకవేళ కచ్చితంగా(జన్యూన్) లేకపోతే టర్మినేట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.250 (ఎస్సీ/ ఎస్టీలకు ఫీజు లేదు)
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.07.2021.
దరఖాస్తుకు చివరి తేది: 16.07.2021
-----------------------------------------------------------------------------------------------------------------------------
నిమ్హాన్స్లో 275 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్
ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆఫ్‌లైన్ దరఖాస్తులు ఈ నెల 28 వరకు అందుబాటులో ఉంటాయి. ఎంపికైనవారు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 275
ఇందులో నర్సింగ్ ఆఫీసర్ 266, స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ 3, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూరోమస్క్యులార్) 1, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 2, ఎంఆర్ చిల్డ్రన్ టీచర్ (క్లినికల్ సైకాలజీ) 1, అసిస్టెంట్ డైటీషియన్ 1,
కంప్యూటర్ ప్రోగ్రామర్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్, బీఎస్సీ (నర్సింగ్), స్పీచ్ పాథాలజీ, ఆడియాలజీ సబ్జెక్టుల్లో పీజీ, మెడికల్ సైన్సెస్‌లో పీహెచ్డీ, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లొమా, పోస్ట్ ఎండీ, ఎంబీబీఎస్, సైకాలజీ సబ్జెక్టుతో బీఏ, బీఎస్సీ, సైన్స్‌లో బీఎస్సీ డిగ్రీతోపాటు డైటిక్స్‌లో డిప్లొమా, లైఫ్ సైన్సెస్ సబ్జెక్టుల్లో పీజీలో ఏదో ఒకటి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: డైరెక్టర్, నిమ్హాన్స్, పోస్ట్ బాక్స్ నం. 2900, హోసూర్ రోడ్, బెంగళూరు 560029
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 28
వెబ్సైట్: www.nimhans.ac.in
తెలంగాణ పోలీస్ విభాగం-భరోసా సొసైటీలో 3 ఉద్యోగాలు, శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో 7 వివిధ ఉద్యోగాలు
తెలంగాణ పోలీస్ విభాగం-భరోసా సొసైటీలో 3 ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ పోలీస్ విభాగానికి చెందిన భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట్, వరంగల్ జిల్లాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
1) వరంగల్: 01
పోస్టు: లీగల్ సపోర్ట్ ఆఫీసర్
అర్హత: ఎల్ఎల్బీ/ ఎల్ఎల్ఎం ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35-55 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.22,000 చెల్లిస్తారు.
2) వికారాబాద్: 02
పోస్టులు: సపోర్ట్ పర్సన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్.
అర్హత: ఎంఏ సైకాలజీ/ ఎంఎస్‌డబ్ల్యూ, టాలీతో డిగ్రీ ఉత్తీర్ణత, ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్‌తో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: సపోర్ట్ పర్సన్ 22-35 ఏళ్ల మధ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ 20-35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: సపోర్ట్ పర్సన్-నెలకి రూ.18000, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్-నెలకి రూ.15000 చెల్లిస్తారు.
3) సూర్యాపేట్: 06
పోస్టులు: సెంటర్ కోఆర్డినేటర్ కమ్ సైకాలజిస్ట్, సపోర్ట్ పర్సన్, లీగల్ సపోర్ట్ ఆఫీసర్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్, రిసెప్షనిస్ట్.
అర్హత: పోస్టుని అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఎస్సీ(నర్సింగ్), ఎల్ఎల్బీ/ఎల్ఎల్ఎం, ఎంఎస్/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
4) సంగారెడ్డి: 01
పోస్టులు: లీగల్ సపోర్ట్ ఆఫీసర్
అర్హత: ఎల్ఎల్బీ/ ఎల్ఎల్ఎం ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35-55 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.22,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 28.06.2021.
చిరునామా: సంబంధిత జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి
-----------------------------------------------------------------------------------------------------------------------------
శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: ఫామ్ మేనేజర్–01, ల్యాబ్ అసిస్టెంట్–01, స్టెనోగ్రాఫర్–01, డ్రైవర్–02, అటెండర్–02.
ఫామ్ మేనేజర్: బ్యాచిలర్ డిగ్రీ(హార్టికల్చర్/అగ్రికల్చర్) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.34,800 వరకు చెల్లిస్తారు.
ల్యాబ్ అసిస్టెంట్: బ్యాచిలర్ డిగ్రీ(హార్టికల్చర్/అగ్రికల్చర్) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.34,800 వరకు చెల్లిస్తారు.
స్టెనోగ్రాఫర్: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.20,200 వరకు చెల్లిస్తారు.
డ్రైవర్లు: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,200 వరకు చెల్లిస్తారు.
అటెండర్: ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం నెలకు రూ.20,200 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 20.06.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.skltshu.ac.in
ఆర్మీలో 100 ఉమెన్ మిలిటరీ పోలీసు ఉద్యోగాలు, ఎన్ఎండీసీలో 89 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, ఎన్ఎల్సీఐఎల్లో 65 ఆపరేటర్ పోస్టులు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 46 ఉద్యోగాలు, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో 42 జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగాలు, పవర్‌గ్రిడ్‌లో 35 డిప్లొమా ట్రెయినీలు.
ఆర్మీలో 100 ఉమెన్ మిలిటరీ పోలీసు ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 100
* జనరల్ డ్యూటీ(ఉమెన్ మిలిటరీ పోలీస్)
అర్హత: 10వ తరగతి/ మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.
వయసు: 21 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక విధానం: కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చివరి తేది: 20.07.2021.
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్ఎండీసీలో 89 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
దేశంలో అగ్రశ్రేణి ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన ఎన్ఎండీసీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 22 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 89 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎగ్జిక్యూటివ్ గ్రేడ్, సూపర్వైజరీ గ్రేడ్, నాన్-ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులను జార్ఖండ్‌లోని టొకిసుడ్ నార్త్ కోల్‌మైన్‌లో నియమిస్తారు.
మొత్తం పోస్టులు: 89
ఇందులో మైన్ సిర్దార్ 38, మైన్ ఓవర్‌మ్యాన్ 25, మైనింగ్ ఇంజినీర్ 12, మెకానికల్ ఓవర్‌మ్యాన్ 4, ఎలక్ట్రికల్ ఓవర్‌మ్యాన్ 4, సర్వేయర్ 2, కొల్లిరి ఇంజినీర్ 2, లియాసొనింగ్ ఆఫీసర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఇంజినీరింగ్‌లో మెకానికల్, మైనింగ్ మెషినరీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మైనింగ్ ఇంజినీరింగ్‌లలో ఏదో ఒకటి చేసి ఉండాలి. మైనింగ్ సిర్దార్ పోస్టుకు పదో తరగతి పాసై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 22
వెబ్సైట్: www.nmdc.co.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్ఎల్సీఐఎల్లో 65 ఆపరేటర్ పోస్టులు
ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ లిగ్నైట్ అండ్ కోల్ ఇండియా లిమిటెడ్ (NLCIL) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 65 ఎస్ఎంఈ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 14 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారు తమిళనాడులోని నైవేలీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 65
ఇందులో జనరల్ 30, ఎస్సీ 12, ఓబీసీ 17, ఈడబ్ల్యూఎస్ 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి, ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ మెకానికల్, ఎలక్రికల్ ట్రేడ్లలో ఏదో ఒకటి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా. ఎంపిక చేసిన అభ్యర్థులను ప్రాక్టికల్ టెస్ట్‌కు ఆహ్వానిస్తారు. ఈ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 14
వెబ్సైట్: https://www.nlcindia.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 46 ఉద్యోగాలు
ప్రభుత్వరంగ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రొడక్షన్, మెకానికల్, సివిల్, మైనింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెటీరియల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రిసోర్స్, కంపెనీ సెక్రెటరీ, రాజ్‌భాష అధికారి, లీగల్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు తాండూర్, బొకజాన్, రాజ్బన్, కర్పొరేట్ ఆఫీస్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. వీరిని ఏడాది కాలపరిమితికే తీసుకోనున్నప్పటికీ.. మూడేండ్ల వరకు పొడిగించే అవకాశం ఉన్నది.
మొత్తం పోస్టులు: 46
ఇందులో ఇంజినీర్ 29, ఆఫీసర్ 17 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్, డీగ్రీ, పీజీ చేయాలి. అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్: http://www.cciltd.in/
-----------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో 42 జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగాలు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని నేషనల్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) ఇన్ మెడికల్ సైన్సెస్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 42
ఇందులో సీనియర్ అసిస్టెంట్ 8, జూనియర్ అసిస్టెంట్ 30, జూనియర్ అకౌంటెంట్ 4 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎన్బీఈ నిర్వహించే పరీక్షలో అర్హత సాధించాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ బేసిక్ సాఫ్ట్వేర్ (విండోస్/ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టం/ల్యాన్)పై అవగాహన ఉండాలి. అభ్యర్థులు 27 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ద్వారా
పరీక్షా విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
అప్లికేషన్ ఫీజు: రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులు ప్రారంభం: జూలై 15
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 14
సీబీటీ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 20
వెబ్సైట్: www.natboard.edu.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
పవర్‌గ్రిడ్‌లో 35 డిప్లొమా ట్రెయినీలు
భారత ప్రభుత్వరంగానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక పరిధిలోని సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* డిప్లొమా ట్రెయినీ
* మొత్తం ఖాళీలు: 35
సబ్జెక్టులు: ఎలక్ట్రికల్, సివిల్
1) డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్): 30
2) డిప్లొమా ట్రెయినీ (సివిల్): 05
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.06.2021.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 29.06.2021.
బీఐఎస్‌లో 28 సైంటిస్ట్ బీ ఉద్యోగాలు, నేషనల్ లైబ్రెరీలో 25 ఎల్ఐఎస్ ఇంటర్న్‌షిప్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో 21 ఎలక్ట్రిషన్ ఉద్యోగాలు, ఈసీఐఎల్‌లో 20 ప్రాజెక్ట్, అసిస్టెంట్ ఇంజినీర్లు ఉద్యోగాలు, ఎన్బీసీసీ(ఇండియా) లిమిటెడ్‌లో 7 ఉద్యోగాలు, ఎన్ఐటీఎంలో 5 డాటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ క్లర్క్ ఉద్యోగాలు.
బీఐఎస్‌లో 28 సైంటిస్ట్ బీ ఉద్యోగాలు
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సైటింస్ట్ బీ పోస్టుల భర్తీకిని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది. ఎంకైనవారు ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 28
ఇందులో సివిల్ ఇంజినీరింగ్ 13, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 2, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ 2, కెమిస్ట్రీ 7, టెక్స్టైల్ ఇంజినీరింగ్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: కెమిస్ట్రీ పోస్టుకు నేచురల్ సైన్సెస్‌లో పీజీ, మిగిలిన పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో బీటెక్ లేదా బీఈ చేసి ఉండాలి. అభ్యర్థులు 21 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 25
వెబ్సైట్: https://bis.gov.in/
-----------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ లైబ్రెరీలో 25 ఎల్ఐఎస్ ఇంటర్న్‌షిప్
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ లైబ్రెరీ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 16 నాటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందులో తెలుగు రెండు ఖాళీలు ఉన్నాయి. ఈ యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ఫ్రం లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (ఎల్ఐఎస్) ఇంటర్న్‌షిప్‌ను 2021-22 విద్యా సంవత్సరానిగాను అందిస్తున్నారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 25
ఇందులో తెలుగు 2, ఇంగ్లిష్, హిందీ 3 చొప్పున, ఒడియా, గుజరాతి, తమిళం, కన్నడం, మళయాలం, మరాథీ 2 చొప్పున, అస్సామీ, ఉర్దూ 1 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో పీజీ చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టును ఇంటర్ లేదా డిగ్రీలో తప్పనిసరిగా చదివి ఉండాలి. 2021, జూన్ 16 నాటికి 35 ఏండ్లలోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. అకడమిక్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 16
వెబ్సైట్: nationallibrary.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో 21 ఎలక్ట్రిషన్ ఉద్యోగాలు
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో (హెచ్‌సీఎల్)లో ఖాలీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్‌లైన్ దరఖాస్తులు జూలై 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనోటిఫికేషన్ ద్వారా 21 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎలక్ట్రిషన్ గ్రేడ్-2, ఎలక్ట్రిషన్ కమ్ లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు కోల్‌కతాలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 21
ఇందులో ఎలక్ట్రిషన్ 20, ఎలక్ట్రిషన్ కమ్ లైబ్రేరియన్ 1 చొప్పన ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఐఐటీలో ఎలక్ట్రిషన్ ట్రేడ్ చేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్ విధానం: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దానిని పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: Hindustan Copper Limited, Tamra Bhawan, 1, Ashutosh Chowdhary Avenue, Kolkata – 700019.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 15
వెబ్సైట్: https://www.hindustancopper.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఈసీఐఎల్‌లో 20 ప్రాజెక్ట్, అసిస్టెంట్ ఇంజినీర్లు ఉద్యోగాలు
ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరింది. ఈ పోస్టులు ఈసీఈ, ఈఈఈ, ఈఐఈ, మెకానికల్ విభాగాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 20
ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్లు 12, అసిస్టెంట్ ఇంజినీర్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ క్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ క్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిప్లొమా చేసి ఉండాలి. సంబంధిత రంగంలో మూడేండ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
అభ్యర్థులు 30 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ ప్రదేశం: ECIL Regional Office,
H.No. 47-09-28,
Mukund Suvasa Apartments,
3rdLane Dwaraka Nagar,
Visakhapatnam, AP-530016
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 16
వెబ్సైట్: www.ecil.co.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్బీసీసీ(ఇండియా) లిమిటెడ్‌లో 7 ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: మేనేజ్మెంట్ ట్రెయినీ(హెచ్ఆర్ఎం)–05, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్–02.
మేనేజ్మెంట్ ట్రెయినీ(హెచ్ఆర్ఎం):
వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి 29 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి 1,40,000 చెల్లిస్తారు.
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్:
వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 27ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం నెలకు రూ.24,640 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.06.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.nbccindia.com
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్ఐటీఎంలో 5 డాటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ క్లర్క్ ఉద్యోగాలు
భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ (ఎన్ఐటీఎం) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ క్లర్క్, డీఈఓ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైనవారు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 5
ఇందులో ల్యాబొరేటరీ సపోర్ట్ 3, డాటా ఎంట్రీ ఆపరేటర్ 1, జూనియర్ క్లర్క్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ చేసి ఉండాలి. అదేవిధంగా ఇంటర్లో సైన్స్ సబ్జెక్టుతోపాటు డీఎంఎల్టీ, కంప్యూటర్‌పై స్పీడ్ టెస్ట్ పాసై ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో. నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి, సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి ఈ-మెయిల్ ద్వారా పంపించాలి.
ఈ-మెయిల్: rect.nitm@gmail.com
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 13
వెబ్సైట్: www.icmrnitm.res.in