ఐఐటీఎంలో 156 ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
కేంద్ర ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియోలజీ (ఐఐటీఎం) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 1 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 156 పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇందులో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రోగ్రామ్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ హెడ్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు మహారాష్ట్రలోని పుణెలో పనిచేయాల్సి ఉంటుంది
మొత్తం పోస్టులు: 156
ఇందులో ప్రాజెక్ట్ సైంటిస్ట్ 55, ప్రాజెక్ట్ మేనేజర్ 2, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ 1, ఎగ్జిక్యూటివ్ హెడ్ 1, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 33, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 5, ట్రైనింగ్ కోఆర్డినేటర్ 1, ప్రాజెక్ట్ అసోసియేట్ 24, టెక్నికల్ అసిస్టెంట్ 8, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 9, ఫీల్డ్ వర్కర్ 2, సైంటిఫిక్ అడ్మనిస్ట్రేటివ్ అసిస్టెంట్ 3, యూడీసీ 9, సెక్షన్ ఆఫీసర్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. అయితే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ చేసి ఉండాలి. నెట్, సీఎస్ఐఆర్ యూజీజీ, గేట్, ఏదైన జాతీయ స్థాయి పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 1
వెబ్సైట్: http://www.tropment.res.in/Careers
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఐటీ డిపార్ట్మెంట్లో 155 ఎంటీఎస్, ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఆదాయ పన్ను (ఐటీ) శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 25 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150కిపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇందులో ఎంటీఎస్, ట్యాక్స్ అసిస్టెంట్, ఇన్‌కం ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇవి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.
మొత్తం పోస్టులు: 155
ఇందులో ఎంటీఎస్ 64, ట్యాక్స్ అసిస్టెంట్ 83, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎంటీఎస్ పోస్టుకు పదో తరగతి, మిగిలిన పోస్టులకు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో, యూనివర్సిటీ స్థాయి టోర్నమెంట్లు, రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ జట్టులో సభ్యుడై జాతీయ క్రీడల్లో ఏదో ఒకటి పాల్గొని ఉండాలి. అదేవిధంగా 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉన్నవారై ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత అవసరమైతే ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 25
వెబ్సైట్: incometaxmumbai.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
పోలీస్ శాఖలో 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలు
తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 151 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి మల్టీజోన్ పోస్టులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 151
మల్టీ జోన్-1లో 68 పోస్టులు (జనరల్ 27, బీసీ-ఏ 5, బీసీ-బీ 5, బీసీ-సీ 1, బీసీ-డీ 5, బీసీ-ఈ 2, ఎస్సీ 10, ఎస్టీ 4, ఈడబ్ల్యూఎస్ 7, ఇతరులు 2)
మల్టీ జోన్-2లో 83 (జనరల్ 32, బీసీ-ఏ 7, బీసీ-బీ 7, బీసీ-సీ 1, బీసీ-డీ 5, బీసీ-ఈ 3, ఎస్సీ 12, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్ 8, ఇతరులు 2) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎల్ఎల్బీ లేదా బీఎల్ చేసి, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. అదేవిధంగా అభ్యర్థులు 2021, జూలై 1 నాటికి 34 ఏండ్ల లోపువారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
పరీక్ష విధానం: మొత్తం రెడు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్లో 200 బహుళైచ్చిక ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కుల చొప్పున కేటాయించారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండో పేపర్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750
వెబ్సైట్: www.tslprb.in