బార్డర్ రోడ్స్ వింగ్‌లో 354 వివిధ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బార్డర్ రోడ్స్ వింగ్ ఆధ్వర్యంలోని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పరిధిలోని జనరల్ రిజర్వు ఇంజినీర్ ఫోర్స్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 354
పోస్టులు- ఖాళీలు:
1. మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్: 33
2. మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్: 12
3. వెహికిల్ మెకానిక్: 293
4. డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్: 16
అర్హత: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు ఉండాలి.
* ఎంపిక విధానం, దరఖాస్తు చివరి తేది, వయసు, జీతభత్యాలు మొదలగు అంశాలను సంబంధిత వెబ్సైట్లో పొందుపరచనున్నారు
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్‌ఫోర్స్‌లో 317 ఉద్యోగాలు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 2023 సంవత్సరానికి సంబంధించి అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 317
(బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు: ఫ్లయింగ్–77, గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్)–129, గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నికల్)–111)
అర్హత
ఫ్లయింగ్ బ్రాంచ్: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి.
గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్): కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి.
విభాగాలు: ఏరోనాటికల్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్, మెకానికల్).
గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నికల్): కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్.
వయసు: ఫ్లయింగ్ బ్రాంచి: 20 నుంచి 24 ఏళ్లు మధ్య ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ బ్రాంచి: 20నుంచి 26ఏళ్లు మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 30.12.2021
వెబ్సైట్: https://afcat.cdac.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
సెంట్రల్ బ్యాంక్‌లో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉద్యోగాలు
ప్రభుత్వరంగ బ్యాంకు అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 115 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఐటీ ఆఫీసర్, ఐటీ, ఐటీ సెక్యూరిటి అనలిస్ట్, క్రెడిట్ ఆఫీసర్, డాటా సైంటిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 115
ఇందులో ఎకనమిస్ట్ 1, ఐటీ ఆఫీసర్ 1, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 15, డాటా సైంటిస్ట్ 1, క్రెడిట్ ఆఫీసర్ 10, డాటా ఇంజినీర్ 11, ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్ 1, ఐటీ ఎస్వోసీ అనలిస్ట్ 2, రిస్క్ మేనేజర్ 15, టెక్నికల్ ఆఫీసర్ 5, ఫైనాన్షియల్ అనలిస్ట్ 20, లా ఆఫీసర్ 10, సెక్యూరిటీ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీ, ఇంజినీరిగ్ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ ఎగ్జామ్
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్
ఆన్లైన్ ఎగ్జామ్: 2022, జనవరి 22
అడ్మిట్ కార్డులు: 2022, జనవరి 11
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 17
వెబ్సైట్: www.centralbankofindia.co.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీసీఐఎల్‌లో 72 పోస్టులు
భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) పరిధిలోని నరోరా అటమిక్ పవర్ స్టేషన్, ఉత్తర్‌ప్రదేశ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 72
1) నర్సు: 05
2) స్టైపెండరీ ట్రెయినీలు/ సైంటిఫిక్ అసిస్టెంట్: 09
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్.
3) ఫార్మసిస్ట్: 01
4) ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్: 01
5) స్టైపెండరీ ట్రెయినీ ఆపరేటర్: 18
6) స్టైపెండరీ ట్రెయినీ మెయింటేనర్: 24
7) అసిస్టెంట్: 12
8) స్టెనో గ్రేడ్ 1: 02
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.12.2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.12.2021.