ఏడబ్ల్యూఈఎస్ - 8700 టీచర్ పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్) దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో కింది టీచర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు..
* టీచర్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 8700
పోస్టులు: పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), ప్రైమరీ టీచర్ (పీఆర్టీ).
అర్హత:
1) పీజీటీ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత.
2) ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణత.
3) ప్రైమరీ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, రెండేళ్ల డిప్లొమా (ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)/ బీఈడీ ఉత్తీర్ణత.
వయసు: ఫ్రెష్ అభ్యర్థులు 01.04.2021 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి. ఐదేళ్లకు తగ్గకుండా టీచింగ్ అనుభవం ఉండాలి. అనుభవం ఉన్న అభ్యర్థులు 57 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ (ఓఎస్టీ), ఇంటర్వ్యూ, టీచింగ్ నైపుణ్యాలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో (ఎంసీక్యూ) ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.385 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులకు చివరి తేది: 28.01.2022.
ఆన్లైన్లో అడ్మిట్ కార్డుల విడుదల తేది: 10.02.2022 నుంచి అందుబాటులో ఉంచుతారు.
స్క్రీనింగ్ టెస్ట్ తేదీలు: 2022, ఫిబ్రవరి 19, 20
-----------------------------------------------------------------------------------------------------------------------------
బీఎస్ఎఫ్లో 2788 కానిస్టేబుల్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకి చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ 2021-2022 సంవత్సరానికి గాను కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్)
మొత్తం ఖాళీలు: 2788 (పురుషులు - 2651, మహిళలు-137)
1) కాబ్లర్ - 91 (పురుషులు - 88, మహిళలు-03)
2) టైలర్: 49 (పురుషులు - 47, మహిళలు-02)
3) కుక్: 944 (పురుషులు - 897, మహిళలు - 47)
4) డబ్ల్యూ/సీ: 537 (పురుషులు - 510, మహిళలు - 27)
5) డబ్ల్యూ/ఎం: 356 (పురుషులు - 338, మహిళలు - 18)
6) బార్బర్: 130 (పురుషులు - 123, మహిళలు - 07)
7) స్వీపర్: 637 (పురుషులు - 617, మహిళలు - 20)
8) కార్పెంటర్: 13
9) పెయింటర్: 03
10) ఎలక్ట్రీషియన్: 04
11) డ్రాఫ్ట్స్‌మెన్: 01
12) వెయిటర్: 06
13) మాలి: 04
అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో రెండేళ్ల డిప్లొమా/ రెండేళ్ల పని అనుభవం ఉండాలి. నిర్ధిష్ఠ శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ. 21,700 నుంచి రూ.69,100 పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు అందజేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (2022 జనవరి 15-21)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి
-----------------------------------------------------------------------------------------------------------------------------
నవోదయ విద్యాలయ సమితిలో 1925 వివిధ ఖాళీలు
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడా-ఉత్తరప్రదేశ్ ప్రధానకేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పని చేయుటకు కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 1925
పోస్టులు: అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్ (సివిల్), స్టెనోగ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మహిళా స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ తదితరాలు.
అర్హత:
1. అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-ఏ): మాస్టర్స్ డిగ్రీ హ్యుమానిటీస్/ సైన్స్/ కామర్స్ ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 05
పని అనుభవం: కనీసం 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
2. అసిస్టెంట్ కమిషనర్ (అడ్మిన్) (గ్రూప్ ఏ): గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 02
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
3. మహిళా స్టాఫ్ నర్సు (గ్రూప్ బీ): ఇంటర్మీడియట్/ తత్సమానం/ B.Sc (నర్సింగ్) ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 82
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
4. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (గ్రూప్ సీ): డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 10
వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.
5. ఆడిట్ అసిస్టెంట్ (గ్రూప్ సీ): బీకామ్ ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 11
వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.
6. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ (గ్రూప్ బీ): డిప్లొమా/ పీజీ ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 04
వయసు: 35 సంవత్సరాల వరకు ఉండాలి.
7. జూనియర్ ఇంజినీర్ (సివిల్) (గ్రూప్ సీ): డిప్లొమా/డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 01
వయసు: 35 సంవత్సరాల వరకు.
8. స్టెనోగ్రాఫర్ (గ్రూప్ సీ): ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. షార్ట్‌హ్యాండ్ పరిజ్ఞానం ఉండాలి.
మొత్తం ఖాళీలు: 22
వయసు: 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి.
9. కంప్యూటర్ ఆపరేటర్ (గ్రూప్ సీ): డిగ్రీ/ కంప్యూటర్ డిప్లొమా ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 04
వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి.
10. క్యాటరింగ్ అసిస్టెంట్ (గ్రూప్ సీ): ఇంటర్మీడియట్, డిప్లొమా (కేటరింగ్) ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 87
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
11. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (గ్రూప్ సీ): సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత. టైప్ రైటింగ్ నాలెడ్జ్ ఉండాలి.
మొత్తం ఖాళీలు: 630
వయసు: 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి.
12. ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్ (గ్రూప్ సీ): 10వ తరగతి, ఐటీఐ (ఎలక్ట్రిషియన్ / వైర్‌మ్యాన్ / ప్లంబింగ్) ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 273
వయసు: 18 నుంచి 40 సంవత్సరాలు ఉండాలి.
13. ల్యాబ్ అటెండెంట్ (గ్రూప్ సీ): 10వ/ 12వ తరగతి (సైన్స్), డిప్లొమా (లేబొరేటరీ టెక్నిక్) ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 142
వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి.
14. మెస్ హెల్పర్ (గ్రూప్ సీ): మెట్రిక్యులేషన్
మొత్తం ఖాళీలు: 629
వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి.
15. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గ్రూప్ సీ): 10వ తరగతి
మొత్తం ఖాళీలు: 23
వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి.
వయోపరిమితి: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగులకు వయసు సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: పోస్టును అనుసరించి నెలకు రూ.18000- రూ.209200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు పీజు: పోస్టును అనుసరించి రూ.750-రూ.1500 వరకు చెల్లించాలి.
దరఖాస్తు చివరి తేది: 10.02.2022
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 09.03.2022-11.03.2022